అజ్ఞాతం నుంచి రైలు ప్రమాదంపై వేడుకల నిర్వాహకుడి వీడియో ప్రకటన

By narsimha lodeFirst Published Oct 22, 2018, 6:07 PM IST
Highlights

అమృత్‌సర్ జోడా పాఠక్ వద్ద దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని రావణ దహనం కార్యక్రమానికి  అన్ని అనుమతులు తీసుకొన్నట్టుగా నిర్వాహకుడు సౌరబ్ మదన్ ప్రకటించారు.


అమృత్‌సర్: అమృత్‌సర్ జోడా పాఠక్ వద్ద దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని రావణ దహనం కార్యక్రమానికి  అన్ని అనుమతులు తీసుకొన్నట్టుగా నిర్వాహకుడు సౌరబ్ మదన్ ప్రకటించారు.

 

Organizer of Dusshera event Saurabh Madan Mithoo releases video message,says ' Had taken all permissions,had alerted crowd atleast 10 times to not stand on tracks. I am extremely pained by the incident. Some ppl are trying to defame me' (location: unknown) pic.twitter.com/viPXBws3P8

— ANI (@ANI)

 

దసరా సందర్భంగా రావణ దహనం వీక్షిస్తుండగా రైలు ఢీకొని 61 మంది  మృత్యువాతపడగా, మరో 72 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
రావణ దహనం కార్యక్రమాన్ని  సౌరబ్ మదన్ నిర్వహించాడు.రైలు ఢీకొని  61 మంది మృత్యువాతపడగానే  సౌరబ్  అదృశ్యమయ్యాడు.  అయితే ఈ ఘటనకు తనకు సంబంధం లేదని ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు.

రావణ దహనం సందర్భంగా గ్రౌండ్తో పాటు ప్రభుత్వం నుండి అన్ని రకాల అనుమతులు తీసుకొన్నట్టు చెప్పారు. అంతేకాదు రైలు పట్టాలపై నిలబడకూడదంటూ  కనీసం  10 దఫాలకు పైగా విన్నవించినట్టు ఆయన ఆ వీడియోలో గుర్తు చేశారు.

రైలు పట్టాల పక్కన రావణ దహనం ఉంటే....  జనం పట్టాలపై నిలబడ్డారన్నారు. ఈ ఘటనతో తాను  కలత చెందినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురైదుగురు  ఉద్దేశ్యపూర్వకంగా తనకు ఆపాదించే ప్రయత్నిస్తున్నారని చెప్పారు.ఈ వీడియోలో అతను చేతులు జోడించి ఏడుస్తూ ఈ ఘటనకు తనకు సంబంధం లేదని వేడుకొన్నాడు. 

సంబంధిత వార్తలు

వారిని దత్తత తీసుకుంటా, నా భార్యపై విమర్శలా: సిద్ధూ

అమృత్‌సర్ రైలు ప్రమాదం: రాళ్ల దాడికి దిగారు: డ్రైవర్

పంజాబ్ ప్రమాదం: సెల్ఫీల మోజులో పడి

దసరా ఉత్సవాల విషయం తెలియదు: రైల్వే బోర్డు ఛైర్మెన్ అశ్విని లోహానీ

పంజాబ్ ప్రమాదం: 61 మంది మృతి, 72 మందికి గాయాలు

పంజాబ్ ప్రమాదం: ఘటనకు ముందే అక్కడి నుండి వెళ్లిపోయా: నవజ్యోత్ కౌర్

పంజాబ్ రైలు ప్రమాదం: బాణసంచా పేలుళ్లే కారణమా?
పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం: 50 మందికి పైగా దుర్మరణం

 

click me!