సెల్పీ వివాదంపై సీఎం సతీమణి వివరణ ...(వీడియో)

By Arun Kumar PFirst Published Oct 22, 2018, 5:26 PM IST
Highlights

ప్రమాదకరంగా సెల్పీల కోసం ప్రయత్నించి దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటి వాటిని ప్రోత్సహించే విధంగా ఓ సీఎం  భార్య వ్యవహరించి రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. చివరకు తన తప్పును గ్రహించిన సదరు సీఎం సతీమణి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. 
 

ప్రమాదకరంగా సెల్పీల కోసం ప్రయత్నించి దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటి వాటిని ప్రోత్సహించే విధంగా ఓ సీఎం  భార్య వ్యవహరించి రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. చివరకు తన తప్పును గ్రహించిన సదరు సీఎం సతీమణి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. 

 మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పద్నవీస్ భార్య అమృత పద్నవీస్ ఓ కార్యక్రమంలో బాగంగా డొమెస్టిక్ క్రూయిజ్ అంగ్రియాలో ప్రయాణించారు. అయితే క్రూయిజ్ సముద్రంలో ప్రయాణిస్తుండగానే ఆమె ఓ రిస్కీ సెల్పీకోసం ప్రయత్నించారు. క్రూయిజ్ లోని సెక్యూరిటీ ఏరియాను దాటుకుని వెళ్లి అంచుల చివరగా కూర్చుని తన మొబైల్ లో సెల్పీ తీసుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు ఆమె పక్కనే వున్నా సీఎం సతీమని కావడంతో ఎవరూ అడ్డుచెప్పలేకపోయారు.

అయితే ఇలా అమృత పద్నవీస్ ప్రమాదకరంగా సెల్పీ దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధ్యతాయయుతంగా వ్యవహరించాల్సిన ఓ సీఎం భార్య ఇలా చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. దీని ద్వారా యువతకు ఎలాంటి సందేశం ఇవ్వాలని ఆమె ప్రయత్నించారో అర్థం కావడంలేదని ట్రోలింగ్ చేస్తున్నారు.

అయితే తన సెల్పీపై వివాదం చెలరేగుతుండటంతో అమృత స్పందించారు. తాను ఫోటో దిగడానికి ప్రయత్నించిన క్రూయిజ్ లోని ప్రాంతం అంత ప్రమాదకరమైనది కాదని వివరణ ఇచ్చుకున్నారు. అయితే యువత మాత్రం రిస్కీ సెల్పీల కోసం ప్రయత్నించవద్దని అమృత పద్నవీస్ పిలుపునిచ్చారు. 

వీడియో

: Amruta Fadnavis, wife of Maharashtra CM Devendra Fadnavis, being cautioned by security personnel onboard India's first domestic cruise Angria. She had crossed the safety range of the cruise ship. pic.twitter.com/YYc47gLkHd

— ANI (@ANI)


 

click me!