సీబీఐలో కుమ్ములాట: రంగంలోకి దిగిన ప్రధాని మోడీ

By narsimha lodeFirst Published Oct 22, 2018, 5:22 PM IST
Highlights

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్  రాకేష్ ఆస్థానా మధ్య ప్రచ్ఛన్నయుద్దం సాగుతోంది.  ఒకరిపై మరోకరు బహిరంగంగానే విమర్శలు చేసుకొన్నారు


న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్  రాకేష్ ఆస్థానా మధ్య ప్రచ్ఛన్నయుద్దం సాగుతోంది.  ఒకరిపై మరోకరు బహిరంగంగానే విమర్శలు చేసుకొన్నారు. దీంతో ప్రధానమంత్రి మోడీ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఇద్దరు సీనియర్ అధికారులు తనను కలవాలని  మోడీ సోమవారం నాడు  ఆదేశించారు. 

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మల,  స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా వ్యవహరం తీవ్ర దుమారం రేపుతోంది. మాంసం వ్యాపారి మెయిన్ ఖురేషీ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సెటిల్మెంట్ కోసం  సీబీఐ డైరెక్టర్  రూ. 2 కోట్లు తీసుకొన్నారని ప్రత్యర్థి వర్గం ఆరోపణలు చేస్తోంది. దీంతో డైరెక్టర్ , స్పెషల్ డైరెక్టర్లు బహిరంగంగానే విమర్శలు చేసుకొంటున్నారు.  

ఈ విషయమై  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ మోడీపై  తీవ్రమైన విమర్శలు గుప్పించారు. తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు మోడీ సర్కార్ సీబీఐను ఉఫయోగించుకొంటుందని రాహుల్ విమర్శలు గుప్పించారు.

ఇద్దరు సీబీఐ అధికారుల తీరుతో రాజకీయంగా నష్టం కలుగుతోందని భావించిన మోడీ.. వీరిద్దరికీ సోమవారం నాడు సమన్లు పంపారు.  తనను కలవాలని ఆదేశించారు.

మరోవైపు ఆస్థానాకు సహాయకుడిగా  పనిచేసిన సీబీఐ డీఎస్పీ దేవేంద్రకుమార్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. స్వయంప్రతిపత్తిగల సీబీఐలో కీలకమైన ఇద్దరు  అధికారులు  పరస్పరం ఆరోపణలు చేసుకోవడాన్ని విపక్షాలు  దుమ్మెత్తిపోస్తున్నాయి.

సంబంధిత వార్తలు

సీబీఐ చరిత్రలోనే తొలిసారి.. లంచం కేసులో సొంత డైరెక్టర్‌పైనే ఎఫ్ఐఆర్


 

click me!