Operation Sindoor: భారత్ ను సవాలు చేసే వారికి ‘ఆపరేషన్ సిందూర్’ తగిన సమాధానమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా పాకిస్తాన్, దాని ఉగ్రవాదసంస్థల భారత్ గట్టి బదులు ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన ఎయిర్ స్టైక్ తో లష్కరే తోయిబా,జైషే మహమ్మద్ వంటి తీవ్రవాద ముఠాలను లక్ష్యంగా చేసుకొని మెస్సెల్స్ దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలో భారత సైన్యాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. మోడీ ప్రభుత్వం 'ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్' విధానాన్ని అవలభిస్తోందనీ, ఆ విషయాన్ని ప్రపంచానికి చాటిచెబుతుందని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో న్యూఢిల్లీలో జరిగిన భద్రతా సమీక్షా సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 'ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దారుణ హత్యలకు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ప్రతీకార దాడి చేసింది. భారత్ సరిహద్దులు, సైన్యం, పౌరులను సవాలు చేసేవారికి ఇది సరైన సమాధానం' అని అన్నారు.
రాష్ట్రాలకు అమిత్ షా సూచనలు:
అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ చేపట్టాలి. ఆసుపత్రులు, అగ్నిమాపక దళం వంటి అత్యవసర సేవలకు ఏర్పాట్లు చేయాలి. ఎస్‌డీఆర్‌ఎఫ్, సివిల్ డిఫెన్స్, హోం గార్డ్స్, ఎన్‌సీసీలను సిద్ధంగా ఉంచుకోవాలి. స్థానిక యంత్రాంగం, సైన్యం, పారా మిలటరీ దళాలు సమన్వయంగా వ్యవహరించాలి.
సోషల్ మీడియాపై నిఘా:
దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచి, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సంస్థలతో కలిసి చర్యలు తీసుకోవాలి. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు చేపట్టాలి.
ఆపరేషన్ సింధూర్ : భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట బుధవారం ఉదయం 1 గంటకు 9 ఉగ్ర స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ దాడిలో 90 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ప్రతిగా పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపింది, ఈ దాడిలో 3 మంది మరణించారు,
పహల్గామ్ దాడి తర్వాత, భారత్ సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్తాన్ పౌరులను 48 గంటల్లో దేశం విడిచి వెళ్ళాలని ఆదేశించింది. అట్టారీ సరిహద్దును మూసివేసి, పాకిస్తాన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది. భారత్ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని షా స్పష్టం చేశారు. 'ఒక్క ఉగ్రవాదిని కూడా వదలం' అని హెచ్చరించారు.