Assembly Elections2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయండి .. లేకుంటే..?

By Mahesh Rajamoni  |  First Published Jan 3, 2022, 7:45 AM IST

Assembly Elections 2022: క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన త‌ర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. భార‌త్ లోనూ ఒమిక్రాన్ (Omicron) కేసులు అధిక‌మ‌వుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వహించ‌డానికి ఎన్నిక‌ల సంఘం సిద్ధం కావ‌డంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 
 


Assembly Elections2022: ద‌క్షిణాఫ్రిక‌లో 2021 న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ చాలా దేశాల్లో పంజా విసురుతోంది. దీంతో కోవిడ్-19 కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోదు అవుతుండ‌టంతో ప‌లు దేశాల్లో ప‌రిస్థితులు దారుణంగా మారుతున్నాయి. భార‌త్ లోనూ ఈ ర‌కం (Omicron) కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైనదిగా నిపుణులు అంచ‌నాలు ఉన్నాయి. డెల్టా కంటే రెట్టింపు వేగంతో ఒమిక్రాన్ విజృంభిస్తున్న‌ద‌ని ఇప్ప‌టికే ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇలాంటి ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఉండ‌గా.. దేశంలో ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేస్తుండ‌టంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుంది.  ఒమిక్రాన్‌ (Omicron) వైరస్ కేసులు పెరుగుతున్న ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోయే గోవా, మణిపూర్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయాలని అఖిల భారత బార్ అసోసియేషన్ (All India Bar Association-AIBA) భారత ఎన్నికల సంఘానికి మెమోరాండం పంపింది. వైరస్‌ వ్యాప్తి కారణంగా వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఒమిక్రాన్ వ్యాప్తి అధిక‌మ‌వుతున్న ఈ త‌రుణంలో ఎన్నిక‌లు నిర్వహిస్తే మున్ముందు తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొనే ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌ని పేర్కొంది. 

Also Read: coronavirus: టీనేజ‌ర్స్ కు నేటి నుంచి వ్యాక్సినేషన్.. ఇప్పటికే 6.79 లక్షల మంది రిజిస్ట్రేషన్..

Latest Videos

undefined

All India Bar Association (AIBA) ప్రెసిడెంట్, ప్ర‌ముఖ సీనియర్ న్యాయవాది డాక్టర్ ఆదిష్ సీ. అగర్వాల్ మాట్లాడుతూ.. క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతున్న ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల నిర్వ‌హించాల‌నే నిర్ణ‌యంపై ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. ప్ర‌స్తుతం కోవిడ్-19 ప్రోటోకాల్ పాటించకుండా ఎన్నికల ర్యాలీలకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడుతున్నారని అన్నారు. క‌రోనా కొత్త వేరియంట్ Omicron వ్యాప్తి ముగిసే వరకు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలను వాయిదా వేయకపోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంద‌ని తెలిపారు. క‌రోనా వైర‌స‌ఖ సెకండ్ వేవ్ స‌మ‌యంలో జ‌రిగినట్లుగానే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మెరుగైన చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌టికీ.. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు లేక‌పోతే.. ల‌క్ష‌లాది మంది చ‌నిపోయే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ని తెలిపారు.  ఇదివ‌ర‌కు అసోం, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి సహా ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల నిర్వ‌హించ‌డం కార‌ణంగా క‌రోనా వ్యాప్తి మ‌రింత అధిక‌మైంద‌నీ, రెండో వేవ్ కార‌ణ‌మై.. ల‌క్ష‌లాది మంది ప్రాణాలు కోల్పోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని తెలిపింది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు ప‌ట్టించుకోని కార‌ణంగా కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయ‌ని తెలిపారు. 

Also Read: UP Elections 2022: ఒక‌ప్పుడు నేర‌స్తుల‌కు అడ్డా.. నేడు క్రీడాకారుల గ‌డ్డ.. ! :ప్ర‌ధాని మోడీ

క‌రోనా వైర‌స్ వ్యాప్తి స‌మ‌యంలో ఇదివ‌ర‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం కార‌ణంగా కోవిడ్‌-19 వ్యాప్తి మ‌రింత‌గా పెరిగింది. దేశంలో కరోనా ఓమిక్రాన్ వేరియంట్‌ల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక ఎన్నికల సంఘం దేశ ప్రజల ఆరోగ్యం, భద్రత గురించి పట్టించుకోకుండా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించింద‌ని All India Bar Association పేర్కొంది.  ప్ర‌స్తుతం దేశంలో  కోవిడ్ -19 ఓమిక్రాన్ వేరియంట్ దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితులు ఉన్నాయనే విష‌యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, మరో 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొంది. ఈ రాష్ట్రాలలో ఎన్నికలు వాయిదా వేయాలన్నారు. క‌రోనా కేసులు పెరుగుతున్న ఇత‌ర దేశాల ప‌రిస్థితుల‌ను సైతం All India Bar Association ప్ర‌స్తావించింది. క‌ర‌నా కేసులు పెరుగుద‌ల కార‌ణంగా  చైనా, నెదర్లాండ్స్, జర్మనీ మొదలైనవి దేశాలలో పాక్షిక లేదా పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేశాయి. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రచారం కారణంగా అదే పరిస్థితి తలెత్తే అవకాశముంద‌ని తెలిపింది. ఇక ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన తర్వాత ఎన్నికల విషయంలో ఎలాంటి జాప్యం జరగదని ఈసీ చెప్పడం ఆశ్చర్యమేసింద‌ని పేర్కొంది.

Also Read: Andhra Pradesh: జ‌గ‌న్ రెడ్డి కాదు.. జాదు రెడ్డి.. జాబ్ క్యాలెండ‌ర్ ఎక్క‌డ‌?: నారా లోకేష్

click me!