
Rahul Gandhi: మహిళలను అవమానించడం, మత విద్వేషాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలాంటి దుర్చర్యలకు లేదా విధ్వంసానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ముస్లిం మహిళలను లక్ష్యంగా 'బుల్లీ బాయ్' యాప్ పేరుతో దుండగుల వికృత చేష్టలకు పాల్పడిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. "మహిళలను అవమానించడం, మత విద్వేషాలకు వ్యతిరేకంగా గొంతు వినిపించినప్పుడే.. అలాంటి దారుణాలు ఆగుతాయి. సంవత్సరం మారింది. పరిస్థితులు కూడా మారాలి. ఇది మాట్లాడాల్సిన సమయం * అంటూ నో ఫియర్ హ్యాస్ ట్యాగ్‌తో రాహుల్ ట్వీట్ చేశారు.
Read Also : Omicron ఎఫెక్ట్: బెంగాల్‌లో రేపటి నుండి విద్యా సంస్థల మూసివేత
మరో ట్వీట్ లో ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శస్త్రాలు సంధించారు. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా సైన్యం అక్రమ చొరబాట్లకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇక నైనా మోదీజీ మౌనం వీడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వాని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. గల్వాన్‌లో చైనా దురాక్రమణలకు పాల్పడుతున్న ప్రధాని మోడీ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ఇకనైనా మౌనం వీడి.. వారిని సరైన సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ కోరారు. అలాగే.. అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భద్రత, విజయం కోసం సరైన సమయంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా అవసరమని, బూటకపు మాటల వల్ల దేన్ని సాధించలేమని రాహుల్ గాంధీ అని ట్వీట్ చేశారు.
Read Also : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో 10వ తేదీ వరకు స్కూల్స్ బంద్, స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం
Bulli Bai App లో ముస్లీం మహిళలను లక్ష్యంగా చేసుకుని దుండగులు వికృత చేష్టలకు పాల్పడటం చర్చనీయాంశమైంది. ఈ యాప్ పై దేశవ్యాప్తంగా దూమారం రేగింది. అలాగే పెద్ద ఎత్తున ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ఈ యాప్‌ను, సైట్‌ను తొలగించినట్లు వెల్లడించారు పోలీసులు .