Delhi స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. జ‌న‌వరి 1 నుంచి ఆ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు

Published : Dec 16, 2021, 08:47 PM IST
Delhi స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. జ‌న‌వరి 1 నుంచి ఆ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు

సారాంశం

Vehicles Deregister : ఢిల్లీలో 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలన్నీ రిజిస్ట్రేషన్ రద్దు చేయ‌బోతున్న‌ట్టు ఢిల్లీ స‌ర్కార్ ప్ర‌క‌టించింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (National Green Tribunal) ఆదేశాల మేరకు జనవరి 1, 2022 నాటికి పదేళ్లు నిండిన అన్ని డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్లను ఢిల్లీ  ప్రభుత్వం రద్దు చేయనున్నది.  అనంతరం ఆయా వాహనాలకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (NOC) జారీ చేయనున్నది. తద్వారా వాహనాల యజమానులు వాటిని ఇతర ప్రాంతాల్లో తిరిగి రిజస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది.  

Vehicles Deregister:  ఢిల్లీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోంది. వచ్చే ఏడాది 2022 జనవరి 1 నాటికి 10 యేండ్లు  దాటినా అన్ని డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఢిల్లీ స‌ర్కార్ తెలిపింది.  అలాగే..  ఈ డీజిల్ వాహనాలకు ఎలాంటి అభ్యంతర ధృవీకరణ పత్రం (NOC) జారీ చేస్తామనీ, తద్వారా ఈ వాహనాలను ఇతర ప్రదేశాలలో తిరిగి రిజిస్టర్ చేయించుకోవచ్చునని పేర్కొంది.

లేదంటే.. 10 ఏళ్ల డీజిల్ వాహనాలు లేదా 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు నిండిన వాహనాలకు ఎలాంటి NOCజారీ చేయడం జరగదని నగర రవాణా శాఖ వెల్లడించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 10 సంవత్సరాల కంటే ఎక్కువ యేండ్ల‌ ఉన్న డీజిల్ వాహనాలు,  15 సంవత్సరాల కంటే ఎక్కువ యేండ్లు ఉన్న పెట్రోల్ వాహనాల రిజిస్ట్రేషన్లు ర‌ద్దుతో పాటు ప‌రిమితుల‌కు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. జూలై 2016లో, ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం.. 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఏళ్లు  ఉన్నా డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ  సంస్థ ఆదేశాల మేర‌కు ఇట్టి చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు తెలిపింది. 

Read Also: ఢిల్లీలో వాయు కాలుష్యం అరికట్టేందుకు ప్రజలు, నిపుణుల నుంచి సలహాలు తీసుకోండి- సుప్రీంకోర్టు
 
ఎన్‌జిటి ఆదేశాలను పాటిస్తూ.. డిపార్ట్‌మెంట్ వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన ఢిల్లీలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న లేదా పూర్తి చేసుకోనున్నడీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తుందని రవాణా శాఖ ప్రకటన పేర్కొంది. అలాగే 10 ఏళ్లు నిండిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు నిండిన పెట్రోల్ వాహనాలకు దేశంలోని ఏ ప్రాంతానికైనా ఎన్‌ఓసీ జారీ చేయవచ్చని పేర్కొంది. అయితే, అటువంటి వాహనాల రీ-రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్రాలు నిషేధిత ప్రాంతంగా గుర్తించిన స్థలాలకు NOC జారీ చేయబడదు అనే షరతుకు ఇది లోబడి ఉంటుంది. గాలి వ్యాప్తి ఎక్కువగా వాహనాల సాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని NGT రాష్ట్రాలను ఆదేశించింది.

Read Also: రేపు భారత్ పర్యటించనున్న ఫ్రాన్స్ రక్షణ మంత్రి.. ప్రధాని మోడీతో భేటీ

10 ఏళ్ల డీజిల్ లేదా 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలను నడపాలనుకుంటే వాటిని వెంటనే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.  కొన్ని వారాల క్రితం, ఢిల్లీ ప్రభుత్వం EV కిట్‌తో పాత డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలను రీట్రోఫిట్‌మెంట్ చేయడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఇతర సందర్భాల్లో ఇట్టి  పాత వాహనాలను స్క్రాప్ చేయడం ఒకటే దారిగా పేర్కొంది. ఇప్పటికే ఇటువంటి పాత వాహనాలను స్వాధీనం చేసుకుని, అధీకృత విక్రేతలచే వాటిని స్క్రాపింగ్ కోసం పంపుతున్నామ‌ని ఢిల్లీ రవాణా శాఖ తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu