Operation Sindoor: పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ AI వీడియో: శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ప్ర‌ద‌ర్శ‌న

Published : May 15, 2025, 07:01 PM IST
Operation Sindoor: పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ AI వీడియో: శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ప్ర‌ద‌ర్శ‌న

సారాంశం

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడిని, దాని ఫలితంగా జరిగిన ప్రతీకార సైనిక చర్య ఆపరేషన్ సింధూర్ పై కొత్త AI-జనరేటెడ్ వీడియోను రూపొందించారు. ఈ వీడియోలను శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో ప్రదర్శించారు. 

Operation Sindoor: ఉగ్రవాదంపై భారత సైనికుల ధైర్యాన్ని ప్రతిబింబించేలా India Today Group రూపొందించిన ఓ శక్తివంతమైన ఏఐ వీడియో ఇటీవల ప్రదర్శనకు వచ్చింది. మే 10, 2025న పహల్గాం‌లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత భద్రతా దళాల ప్రతీకార చర్యలు ఆపరేషన్ సింధూర్ ను ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ వీడియో వైరల్ గా మారింది. మే 13, 2025న మొదటగా India Today నెట్వర్క్ ప్రసారం చేసింది.

ఈ ఏఐ ఆధారిత 7 నిమిషాల వీడియోలో ఉగ్రవాద దాడి ప్రారంభం నుంచి భారత జవాన్లు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వరకూ జరిగిన సంఘటనలను గమనించదగిన స్థాయిలో వివరించారు. భారత భద్రతా బలగాలు 9 పాకిస్తాన్ ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన విధానాన్ని వీడియోలో స్పష్టంగా చూపించారు.

మారుతున్న భారత పోరాట శైలిని ‘Bold New Normal’గా ఈ వీడియోలో చూపించడం విశేషం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఏకతాటిపై ఉండాలన్న సంకేతాన్ని అందించేందుకు ఈ వీడియో ప్రయత్నించింది.

ఇది కేవలం టీవీ ప్రసారంగా మాత్రమే కాకుండా, మే 13, 14 తేదీలలో శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ప్రజలకు ప్రత్యక్షంగా చూపించారు. పెద్ద ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేలు ఏర్పాటు చేసి వీడియోను ప్రదర్శించగా, అక్కడి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కశ్మీర్ ప్రజలలో దేశభక్తిని బలోపేతం చేయడం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒకతాటిపై నిలబడాల్సిన అవసరాన్ని గుర్తు చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం.

ఈ వినూత్న ప్రయత్నాన్ని ట్విట్టర్‌లో ఎంతో మంది అభినందించారు. దేశీయ ఐక్యత, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రజల సన్నద్ధతను ప్రతిబింబించే ఒక మార్గదర్శక ఉదాహరణగా ఈ వీడియో నిలిచింది.
 

PREV
Read more Articles on
click me!