Rajnath singh: పాకిస్థాన్ అణ్వాయుధాల‌పై ప్ర‌పంచం ప‌ర్య‌వేక్షించాలి.. రాజ్‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Published : May 15, 2025, 06:37 PM IST
Rajnath singh: పాకిస్థాన్ అణ్వాయుధాల‌పై ప్ర‌పంచం ప‌ర్య‌వేక్షించాలి.. రాజ్‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సారాంశం

భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం జమ్మూక‌శ్మీర్‌లో ప‌ర్య‌టించిన ఆయ‌న పాకిస్థాన్ అణ్వాయుధాల‌కు సంబంధించిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంత‌కీ రాజ్‌నాథ్ సింగ్ ఏమ‌న్నారంటే..   

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం జమ్మూ కశ్మీర్‌లో ప‌ర్య‌టించారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26మందికిపైగా సాధారణ పౌరులు మృతి చెందిన తర్వాత ఆయన క‌శ్మీర్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. 

ఈ పర్యటనలో ఆయ‌న‌ జమ్మూ కశ్మీర్‌లోని భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఆయనతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఉన్నారు. బదామీ బాగ్ కంటోన్మెంట్‌లో ఆర్మీ అధికారులతో సమావేశమయ్యారు. పహల్గాం దాడికి సంబంధించి జరిగిన ఎదురు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ – "పాకిస్తాన్ బొంబులు, అణు ఆయుధాల బెదిరింపులు భారతదేశాన్ని భయపెట్టలేవు. అంతర్జాతీయ అణు సంస్థ (IAEA) పాకిస్తాన్ అణు ఆయుధాలపై పర్యవేక్షణ పెట్టాలి. పాకిస్తాన్ వంటి అవినీతి దేశం చేతిలో అణు బాంబులు సురక్షితంగా ఉన్నాయా? ప్రపంచం అంతా దీనిపై ఆలోచించాలన్నారు. 

ఇక పహల్గాం దాడి గురించి మాట్లాడుతూ – "ఉగ్రవాదులు ప్రజల 'ధర్మం' అడిగి చంపారు. కానీ మేము వాళ్ల 'కర్మ' చూసి చంపాం.ష‌ "జమ్మూ కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్‌పై వ్యక్తపరిచిన కోపం, ప్రతీకారాన్ని నేను అభినందిస్తున్నాను. మీరు పాక్ చెక్‌పోస్టులు, బంకర్లను ఎలా ధ్వంసం చేశారో... శత్రువు ఎప్పటికీ మర్చిపోలేడు. అని చెప్పుకొచ్చారు. బదామీ బాగ్ కంటోన్మెంట్‌లో పాకిస్తాన్ వేసిన షెల్స్‌ను మంత్రి పరిశీలించారు. 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం మే 7న 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా దాడులు చేశారు. ఈ ఘటనలతో భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. అయితే అమెరికా మధ్యవరిత్వంతో కాల్పుల విరమణ (ceasefire) ప్రకటన వచ్చాక, పరిస్థితులు కొంత మెరుగయ్యాయి. గురువారం పహల్గాంలో బీజేపీ నాయకులు, స్థానికులు కలిసి త్రివర్ణ పతాక యాత్ర (తిరంగా యాత్ర) నిర్వహించారు. భారత సైన్యానికి మద్దతుగా ఈ యాత్రను నిర్వ‌హించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu