వ్యభిచారం కేసులో సినీ నటుడు మంజునాథ్ అరెస్ట్..

By team teluguFirst Published Jan 18, 2023, 10:03 AM IST
Highlights

వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడనే ఆరోపణలపై శాండల్ వుడ్ యాక్టర్ మంజునాథ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన 2019లో విడుదలైన న్యూరాన్‌ సినిమాలో నటించారు. అయితే సినిమా విజయం సాధించలేదు. 

వ్యభిచారం కేసులో కన్నడ సినీ నటుడు మంజునాథ్‌ను సద్గుంటె పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 2019లో విడుదలైన న్యూరాన్‌ సినిమాలో ఆయన నటించారు. తరువాత మంజునాథ్‌ నటనకు దూరమయ్యారు. ఆ సినిమాలో అతడు ప్రేయసిని కనుగొనడానికి తన మాతృభూమికి తిరిగి వచ్చే ఎన్నారై పాత్రను పోషించాడు.

ఫ్రమ్ ది ఇండియా గేట్: కేబినెట్ విస్తరణపై ఆశలు, ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ, పేద పార్టీ.. ధనిక కార్యకర్తలు..

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఈ చిత్రానికి వికాష్ పుష్పగిరి దర్శకత్వం వహించగా నేహా పాటిల్, జై జగదీష్, వైష్ణవి మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా.. కొంత కాలం నుంచి మంజునాథ్‌ పై వ్యభిచారగృహం నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ ప్రొఫైల్స్ తో యాప్స్ తయారు చేసి, వాటి ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

దారుణం.. 13 ఏళ్ల బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారం.. 7గురు అరెస్టు..

అయితే బెంగళూరులో వ్యభిచార కార్యకలాపాలను నివారించేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా సిటీలోని పలు ప్రాంతాల్లో పలుమార్లు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మంజునాథ్ వ్యవహారంలో పక్కా సమాచారం అందడంతో అతడిని అరెస్టు చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు బదిలీలలో పాత్ర పోషించాడని మంజునాథ్ అప్పట్లో వార్తల్లో నిలిచాడు. గతంలో అతడిపై అత్యాచారం కేసు కూడా నమోదైంది.

click me!