బెంగళూరు మెట్రోలో ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. రైలు ప్రయాణిస్తుండగానే ఆమెను ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. చుట్టూ ప్రయాణికులు ఉండగానే అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ యువతికి వింత అనుభవం ఎదురైంది. ఏకంగా మెట్రోలనే ఆమెకు లైంగిక వేధింపులు జరిగాయి. చుట్టూ ప్రయాణికులు ఉన్నా ఆ కామంధుడు ఏమాత్రం భయపడలేదు. సాయం కోసం బాధితురాలు అరిచినా.. తోటి ప్రయాణికులు పట్టించుకోలేదు.
ఆ యువతికి ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె స్నేహితురాలు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ రెడ్డిట్ లో పోస్టు చేసింది. అది ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రోటీన్స్ కార్బ్స్ అనే యూజర్ నేమ్ తో చేసిన ఈ పోస్టులో ఇలా ఉంది. ‘‘సాధారణంగా కాలేజీకి బస్సులో వెళ్లే నా స్నేహితురాలు నవంబర్ 20వ తేదీన మెట్రోలో వెళ్లాలని నిర్ణయించుకుంది. మెజెస్టిక్ వద్ద ఉదయం 8:50 గంటల సమయంలో మెట్రో ఎక్కింది. ఆ సమయంలో అందులో సాధారణం కంటే చాలా ఎక్కువగా రద్దీ ఉంది.’’ అని పేర్కొంది.
‘‘ఈ రద్దీ వల్ల మెట్రోలో ఒకరినొకరు తోసుకున్నారు. కొంత సమయం తరువాత నా స్నేహితురాలికి అసౌకర్యంగా అనిపించింది. రెడ్ కలర్ షర్ట్ ధరించిన ఓ వ్యక్తి ఆమెను వెనకాల నిలబడ్డాడు. అక్కడి నుంచి ఆమెను అసభ్యకరంగా తాకాడు. ఆమెను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనిని నా స్నేహితురాలు గ్రహించింది. ’’ అని ఆమె తెలిపింది.
deepfake : గర్భా అడిన ప్రధాని వీడియో డీప్ ఫేక్ కాదు.. వైరలైన క్లిప్ లో ఉన్నది ఎవరో తెలుసా ?
‘‘కొంత సమయం దాకా ఏం జరుగుతోందో నా స్నేహితురాలికి అర్థం కాలేదు. ఆమె వెనుదిరిగిన మరుక్షణమే ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే సాయం కోసం ఆమె కేకలు వేసింది. కానీ అక్కడున్న ప్రయాణికులెవరూ పట్టించుకోలేదు. నా స్నేహితురాలు దిగ్భ్రాంతికి గురైంది. ఆమె నిస్సహాయంగా ఉండిపోయింది’’ అని తెలిపారు.
దారుణం.. 15 మంది మగ పిల్లలపై ఇద్దరు టీచర్ల అత్యాచారం..
కాగా.. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని బెంగళూరు మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) అధికారులు తెలిపారు. ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తామని పేర్కొన్నారు.