జార్ఖండ్‌లో 33 కేవ్ వైర్‌ తగిలి.. విద్యుత్ షాక్ తో ఐదు ఏనుగులు మృతి...

By SumaBala Bukka  |  First Published Nov 22, 2023, 2:19 PM IST

ఏనుగుల మృతదేహాలకు ఇప్పటికీ వైర్ అంటుకునే ఉండడం చాలా విచారకరం. ఈ ప్రమాదానికి ఏ శాఖ బాధ్యత వహిస్తుందో దీంతో తెలుస్తుందని అధికారులు అంటున్నారు. 


జార్ఖండ్‌ : జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లా ముసబాని అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి 33 కిలోవోల్ట్ (కెవి) వైర్‌ తాకడంతో కరెంట్ షాక్ తో ఐదు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన వాటిల్లో రెండు పిల్ల ఏనుగులు కాగా, మూడు పెద్దవి. జిల్లాలో గత రెండు నెలల్లో ఇది రెండో ఘటన. కరెంట్ షాక్ తో చనిపోయిన ఏనుగుల సంఖ్య ఏడుకు చేరడం ఇది మూడోసారి అని అధికారులు తెలిపారు.

ముసబాని బ్లాక్‌లోని ఊపర్ బండా, బనాసోల్ గ్రామాల ప్రాంతంలో ఏనుగుల గుంపు ఆ ప్రాంతాన్ని దాటుతున్నట్లు స్థానిక గ్రామస్తులు గమనించిన కొద్ది రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. డిప్యూటీ కమిషనర్ (డిసి) మంజునాథ్ భజంత్రీ మాట్లాడుతూ, “బెనాసోల్-ఉపర్ బండా అటవీ ప్రాంతంలో 33 కెవి వైర్‌ తగిలి ఐదు ఏనుగులు చనిపోయాయి. వైర్ హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్‌కు వెళుతోంది. ఈ సంఘటనపై వివరణాత్మక దర్యాప్తు చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించాను. విచారణ తర్వాత, 33 కేవీ వైర్ కిందికి తక్కువ ఎత్తులో వేలాడుతూ ఎందుకు ఉందో స్పష్టంగా తెలుసుకోవాలని తెలిపాను.

Latest Videos

deepfake : గర్భా అడిన ప్రధాని వీడియో డీప్ ఫేక్ కాదు.. వైరలైన క్లిప్ లో ఉన్నది ఎవరో తెలుసా ?

గత కొన్ని రోజులుగా బ్లాక్‌లోని జంగల్‌, తెరెంగ పంచాయతీల్లో ఏనుగుల గుంపులు సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో పదుల సంఖ్యలో రైతుల పొలాల్లోని వరి పంటలను ఏనుగులు తిని ధ్వంసం చేశాయని కొందరు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మమతా ప్రియదర్శిని మాట్లాడుతూ, “ఇది చాలా విచారకరం, ఏనుగుల మృతదేహాలకు ఇప్పటికీ వైర్ అంటుకునే ఉంది. దీంతో దీనికి ఏ శాఖ బాధ్యత వహించాలో స్పష్టంగా తెలుస్తుందన్నారు. పోస్ట్‌మార్టం తర్వాత పూర్తి వివరాలు తెలుసుకుంటాం” అన్నారు.

ఘట్‌శిలా బ్లాక్‌లోని చాకులియా ప్రాంతంలో గత రెండు నెలల్లో 11కేవీ వైర్లు తగిలి రెండు ఏనుగులు చనిపోయాయని డీసీ భజంత్రీ తెలిపారు. "భద్రతా ప్రమాణాల ప్రకారం, కేవీ లోడ్ల ప్రకారం అన్ని హై-టెన్షన్ వైర్ల కనీస ఎత్తును నిర్వహించాలని నేను అధికారులను కోరాం" అన్నారు. 33 కెవి లైన్లు ఒక చిన్న సబ్‌స్టేషన్ నుండి మరొక సబ్‌స్టేషన్‌కు విద్యుత్‌ను అమర్చడానికి ఉపయోగించే ఫీడర్ లైన్‌లు అని అధికారులు తెలిపారు. 11 కెవి లైన్ స్థానిక ట్రాన్స్‌ఫార్మర్‌లకు.. అక్కడినుంచినివాస గృహాలకు వెళుతుంది.

click me!