డయేరియా తగ్గేందుకు యూట్యూబ్ చూసి కర్పూరం బిళ్లలు మింగిన యువకుడు.. తీవ్ర అస్వస్థతతో..

Published : Aug 28, 2023, 07:51 AM IST
డయేరియా తగ్గేందుకు యూట్యూబ్ చూసి కర్పూరం బిళ్లలు మింగిన యువకుడు.. తీవ్ర అస్వస్థతతో..

సారాంశం

డయేరియా తగ్గేందుకు ఆ యువకుడు యూట్యూబ్ ను నమ్ముకున్నాడు. అందులోని వీడియోల్లో చెప్పిన విధంగా కర్పూరం బిళ్లలను మింగేశాడు. క్షణాల్లోనే అతడి ఆరోగ్యం మరింత దెబ్బతింది. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 

మన నిత్య జీవితంలో యూట్యూబ్ భాగమైపోయింది. ప్రతీ రోజూ ఇందులో లక్షల సంఖ్యలో వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి. ఇందులో అనేక రకాల వీడియోలు లభిస్తున్నాయి. ఇందులో అందరి అభిరుచికి తగిన వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ యూట్యూబ్ ను అనేక మంది అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. కొందరు యూట్యూబ్ ను జీవనాధారంగా చేసుకొని కంటెంట్ అప్ లోడ్ చేస్తుంటే.. మరి కొందరు అందులోని కంటెంట్ ను ఉపయోగించి నాలెడ్జ్ , స్కిల్స్ పెంచుకుంటున్నారు. 

తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత.. వారం రోజుల ప్రయత్నం సఫలం..

ఇంకొందరు సరదాగా వాటిని చూస్తూ గడిపేస్తున్నారు. ఈ మధ్య ప్రజల్లో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెరిగింది. దీంతో చాలా మంది ఆరోగ్యాభిలాషులు యూట్యూబ్ లోనే ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు, సూచనల వీడియోలు చూస్తున్నారు. అయితే కొందరు ఇలా చెప్పే చిట్కాలను పాటిస్తూ, వాటిలో నిజమెంత ఉందో గ్రహించకుండా, డాక్టర్లను సంప్రదించకుండా చిక్కుల్లో పడిపోతున్నారు. తాజాగా జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. సొంత వైద్యం చేసుకొని మరింత అనారోగ్యానికి గురయ్యాడు.

బహిర్భూమికి వెళ్లి.. చెరువులో మునిగి యువకుడి మృతి.. మట్టి తవ్వకాలే కారణమని, డెడ్ బాడీతో కుటుంబ సభ్యుల ఆందోళన

వివరాలు ఇలా ఉన్నాయి. లాతేహార్‌ జిల్లా బలుమత్ మండలంలోని ఓ గ్రామంలో అవధేష్ అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. ఆ యువకుడు ఇటీవల డయేరియా బారిన పడ్డాడు. అయితే వ్యాధిని తగ్గించుకునేందుకు ఆయన డాక్టర్లను సంప్రదించకుండా యూట్యూబ్ ను నమ్ముకున్నాడు. అందులోని పలు వీడియోలను చూసి పది కర్పూరం బిళ్లలను మింగేశాడు.

Rozgar Mela: కొత్తగా ఉద్యోగాల్లో చేరే 51 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందించ‌నున్న ప్ర‌ధాని మోడీ

కొంత సమయం తరువాత అతడు మరింత అనారోగ్యానికి గురయ్యాడు. కొన్ని నిమిషాల్లోనే అవధేశ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడం మొదలుపెట్టింది. దీనిని కుటుంబ సభ్యులు గమనించారు. ఏం జరిగిందని ఆరా తీయగా.. యూట్యూబ్ లోని వీడియోలు చూసి కర్పూరం బిళ్లలను మింగానని చల్లగా చెప్పాడు. ఇది విన్న కుటుంబ సభ్యలు షాక్ అయ్యారు. వెంటనే తేరుకొని దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ప్రథమ చికిత్స చేశారు. మెరగుైన చికత్స కోసం రిమ్స్ కు వెళ్లాలని సూచించారు. అక్కడ ప్రస్తుతం అవధేశ్ చికిత్స పొందుతున్నాడు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?