
Rajasthan: రాజస్థాన్ లోని కోటాలో మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఇద్దరు మృతి చెందడంతో ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కు చేరింది. 2018 తర్వాత ఇదే అత్యధికం. కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లలో నెల రోజుల పాటు ఎలాంటి పరీక్షలు ఉండవని కోటా కలెక్టర్ ఓపీ బంకర్ ఆదేశాలు జారీ చేశారు.
వివరాల్లోకెళ్తే.. చదువుల ఒత్తిడితో ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు రాజస్థాన్ లో వరుసగా చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పోటీ పరీక్షలకు పేరుగాంచిన కోటాలో మరో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఆదివారం ఇద్దరు మృతి చెందడంతో ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కు చేరింది. 2018 తర్వాత ఇదే అత్యధికం. హాస్టళ్ల యజమానులు, అధికారులు గదుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లు ఏర్పాటు చేసి సూసైడ్ ప్రూఫ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంజినీరింగ్ విద్యార్థులు, వైద్యులకు కేంద్ర బిందువైన రాజస్థాన్ లోని కోటాలో ఆదివారం మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కామన్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ కు ప్రిపేర్ అవుతున్న అవిష్కర్ శుభాంగి అనే నీట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదర్శ్ అనే మరో విద్యార్థి కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రకు చెందిన అవిష్కర్ భవనం 6వ అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. షెడ్యూల్డ్ వీక్లీ టెస్ట్ కు హాజరైన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఇద్దరు మృతి చెందడంతో ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కు చేరింది. 2018 తర్వాత ఇదే అత్యధికం. కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లలో నెల రోజుల పాటు ఎలాంటి పరీక్షలు ఉండవని కోటా కలెక్టర్ ఓపీ బంకర్ ఆదేశాలు జారీ చేశారు. బీహార్ కు చెందిన ఆదర్శ్ కునాడ్డిలో ఉరేసుకుని చనిపోయాడు. అతను మెడికల్ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడనీ, 12వ తరగతి చదువుతున్నాడనీ, అతని తాతయ్యలు కూడా అతనితో పాటు ఇక్కడే ఉండేవారని తెలిపారు. ఈ రోజు పరీక్ష ఉండగా, ఐదు నిమిషాలు ముందుగానే పరీక్ష ముగించి ఆరో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధరమ్వీర్ సింగ్ తెలిపారు.
ఇటీవలే ఓ విద్యార్థి పొరపాటున 15 మాత్రలు మింగడంతో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో మానసికంగా కుంగిపోయాడని అతని స్నేహితుడు చెప్పాడు. ఇంజినీరింగ్ కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ), మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఏటా రెండు లక్షల మంది విద్యార్థులు కోటాకు వెళ్తుంటారు. కాగా, విద్యార్థులు పై అంతస్తుల నుంచి దూకితే అడ్డుకునేందుకు అన్ని లాబీలు, బాల్కనీల్లో భారీ వలలను ఏర్పాటు చేశాం. ఈ వలలు 150 కిలోల వరకు బరువును మోయగలవని, విద్యార్థులు గాయపడకుండా చూసుకుంటాయని హాస్టల్ యజమాని ఒకరు తెలిపారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది)