ఒడిశా రైలు ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. 2022 ఆడిట్ రిపోర్టులోనే రైలు భద్రతపై తీవ్ర ఆందోళన లేవనెత్తిన కాగ్..

By Asianet NewsFirst Published Jun 5, 2023, 8:53 AM IST
Highlights

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం వల్ల ప్రస్తుతం రైల్వేల భద్రతపై అనేక మందిలో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 2022లో కాగ్ విడుదల చేసిన నివేదిక తెరపైకి వచ్చింది. అందులోనే రైల్వేల భద్రతపై ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ రైలును  శుక్రవారం ఢీకొనడంతో 288 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 1000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన యావత్ దేశం మొత్తాన్ని ఒక్క సారిగా ఉలిక్కిపడేలా చేసింది. అయితే రైలు పట్టాలు తప్పడం, ఢీకొట్టడం రైలు భద్రతపై తీవ్ర ఆందోళన రెకెత్తించింది. కాగా ఏడాది సెప్టెంబరులో పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే ఆడిట్ రిపోర్టులో రైలు భద్రతలో అనేక తీవ్రమైన లోపాలు ఉన్నట్లు తేలింది. ఆ సమయంలోనే కాగ్ రైలు భద్రతపై తీవ్ర ఆందోళన లేవనెత్తింది.

ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు, బీజేపీ మాజీ నేత అమీర్ రజా హుస్సేన్ కన్నుమూత.. ప్రముఖుల నివాళి..

ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ లో మార్పు వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పినప్పటికీ దీనిపై ప్రతిపక్షాలు సంతృప్తి చెందడం లేదు. ప్రతిపక్షాలు ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో 2022 కాగ్ నివేదిక తెరపైకి వచ్చింది. రైలు భద్రతపై ఆ సమయంలోనే కాగ్ ఆందోళన వ్యక్తం చేసినా.. ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా నివేదికలోని సూచనలను ఎత్తి చూపారు. సీఆర్ఎస్ ను ఎందుకు బలోపేతం చేయలేదని ప్రశ్నించారు. ‘‘తాజా కాగ్ ఆడిట్ నివేదిక ప్రకారం 2017-18 నుంచి 2020-21 మధ్య జరిగిన 10 రైలు ప్రమాదాల్లో దాదాపు ఏడు రైళ్లు పట్టాలు తప్పడం వల్లనే జరిగాయి. 2017-21 మధ్యలో ఈస్ట్ కోస్ట్ రైల్వేలో భద్రత కోసం రైల్ అండ్ వెల్డ్ (ట్రాక్ మెయింటెనెన్స్) జీరో టెస్టింగ్ జరిగింది. దాన్ని ఎందుకు విస్మరించారు?’’ అని ఖర్గే ప్రశ్నించారు.

విషాదం నింపిన రైలు ప్రమాదం.. చివరి క్షణంలో ఆగి, కుటుంబం మొత్తాన్ని కోల్పొయి ఒంటరిగా మిగిలిన యువకుడు..

ఇంతకీ కాగ్ నివేదిక ఏం చెప్పింది?
- 2017-18 నుంచి 2020-21 వరకు జరిగిన ఆడిట్ లో ట్రాక్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, అతివేగం, మెకానికల్ ఫెయిల్యూర్ వంటివి పట్టాలు తప్పడానికి ప్రధాన కారణాలు.
- రైల్వే ట్రాక్ ల రేఖాగణిత, నిర్మాణ పరిస్థితులను అంచనా వేయడానికి అవసరమైన ట్రాక్ రికార్డింగ్ కార్ల తనిఖీలలో 30-100 శాతం వరకు లోపాలు ఉన్నాయి.
- 'మెకానికల్ విభాగం' కారణంగా పట్టాలు తప్పిన వాటి సంఖ్య 182. 'వీల్ డయామీటర్ వేరియేషన్ లో లోపాలు, బోగీలు/వ్యాగన్లలో లోపాలు పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం (37 శాతం)గా ఉంది.
- ఆపరేటింగ్ డిపార్ట్ మెంట్ ఇవ్వని బ్లాక్ లు (32 శాతం), డివిజన్ లు ప్లాన్ చేయని బ్లాక్ లు (30 శాతం), ఆపరేషనల్ సమస్యలు (19 శాతం), సిబ్బంది అందుబాటులో లేకపోవడం (5 శాతం), పని అవకాశం లేకపోవడం (3 శాతం) కారణంగా ట్రాక్ మెషీన్ల కొరత కనిపించింది. 16 జోనల్ రైల్వేల్లో పట్టాలు తప్పిన ప్రమాదాలకు సంబంధించిన 1,129 'ఎంక్వైరీ రిపోర్టుల' విశ్లేషణలో పట్టాలు తప్పడానికి కారణమైన 24 అంశాలు వెల్లడయ్యాయి. ఈ కేసుల్లో మొత్తం నష్టం రూ.32.96 కోట్లుగా నమోదైంది.

"ప్రపంచం మనకు మద్దతుగా నిలిచింది": ఒడిశా రైలు విషాదంపై ఎస్ జైశంకర్
- 'లోకో పైలట్ల' తప్పిదాల వల్ల జరిగిన ప్రమాదాల సంఖ్య 154. పట్టాలు తప్పడానికి 'బ్యాడ్ డ్రైవింగ్/ఓవర్ స్పీడ్' ప్రధాన కారణంగా ఉంది. 'ఆపరేటింగ్ డిపార్ట్ మెంట్ ' వల్ల జరిగిన ప్రమాదాల సంఖ్య 275. పాయింట్లను తప్పుగా సెట్ చేయడం, షంటింగ్ ఆపరేషన్లలో ఇతర తప్పులే 84 శాతంగా ఉన్నాయి.
- 63 శాతం కేసుల్లో నిర్ణీత గడువులోగా 'విచారణ నివేదికలు' అథారిటీకి సమర్పించలేదు. 49 శాతం కేసుల్లో రిపోర్టులను ఆమోదించడంలో అధికారులు జాప్యం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 27,763 బోగీల్లో (62 శాతం) అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేయలేదు.
- కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన 2022 నివేదికలో.. అనేక రైలు పట్టాలు తప్పడానికి భారతీయ రైల్వే ఇంజనీరింగ్ విభాగం బాధ్యత వహిస్తుంది. నిర్వహణ కార్యకలాపాలు సకాలంలో అమలయ్యేలా పటిష్టమైన పర్యవేక్షణ యంత్రాంగాన్ని రూపొందించాలని సూచించింది.

click me!