రాజద్రోహం చట్టం : దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 326 కేసులు, 6 కేసుల్లో అభియోగాలు రుజువు..

By AN TeluguFirst Published Jul 19, 2021, 3:36 PM IST
Highlights

141 కేసులో అభియోగపత్రం దాఖలు చేయగా, ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులకు కేవలం ఆరు సందర్భాల్లో శిక్షలు పడ్డాయి.  మరోవైపు 2020 గణాంకాలు ఇంకా సిద్ధం కాలేదని కేంద్ర హోంశాఖ అధికారులు పేర్కొన్నారు.  

బ్రిటిష్ కాలం నాటి వివాదాస్పద రాజద్రోహ చట్టం కింద 2014-19 మధ్యకాలంలో దేశంలో మొత్తం 326 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆరింట్లో మాత్రమే అభియోగాలు రుజువు కావడం గమనార్హం. కేంద్రహోంశాఖ గణాంకాల ప్రకారం… 2014-19 మధ్య రాజద్రోహం చట్టం కింద 54 కేసులతో అస్సాం తొలి స్థానంలో నిలిచింది.

141 కేసులో అభియోగపత్రం దాఖలు చేయగా, ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులకు కేవలం ఆరు సందర్భాల్లో శిక్షలు పడ్డాయి.  మరోవైపు 2020 గణాంకాలు ఇంకా సిద్ధం కాలేదని కేంద్ర హోంశాఖ అధికారులు పేర్కొన్నారు.  

అస్సాంలో నమోదైన 54 కేసులో 26 కేసులకు సంబంధించి అభియోగ పత్రాలు దాఖలు అవగా, 25 కేసుల్లో విచారణ ముగిసింది. ఏ కేసులోనూ ఆరోపణలు రుజువు కాలేదు. ఇక ఈ జాబితాలో జార్ఖండ్ (40 కేసులు), హర్యానా (31) కేసులు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 

కాగా, బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని "వలసచట్టం" గా అభివర్ణించిన సుప్రీంకోర్టు "75 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత ఇంకా అవసరమా" అని ప్రశ్రించింది. ఈ చట్టం ద్వారా సంస్థల పనితీరుకు తీవ్రమైన ముప్పు  ఉందని, ఇది దుర్వినియోగం చేయడానికి "అపారమైన శక్తిని"గా వాడబడుతోందని వ్యాఖ్యానించింది.

దేశద్రోహ చట్టం ప్రామాణికతను పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది. ఓ మాజీ ఆర్మీ ఆఫీసర్ ఈ చట్టం మీద వేసిన  పిటిషన్ పై స్పందించాలని కేంద్రాన్ని కోరింది. ఈ చట్టం మట్లాడటం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, వాక్ స్వాతంత్ర్యాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటుందని అందులో పేర్కొన్నారు. 

"దేశద్రోహ చట్టం ఒక వలసవాద చట్టం. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత మన దేశంలో ఇంకా ఈ చట్టం అవసరమా" అని ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ప్రశ్నించారు. "వివాదం ఇది ఒక వలసవాద చట్టం, అదే చట్టాన్ని బ్రిటిష్ వారు గాంధీజీ నోరు నొక్కడానికి ఉపయోగించారు." అని గుర్తు చేశారు. ఈ దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ  అనేక పిటిషన్లు వచ్చాయని, అన్నీ కలిసి విచారించనున్నట్లు కోర్టు తెలిపింది.

"మా ఆందోళన అంతా చట్టాన్ని దుర్వినియోగం చేయడం, ఎవరిమీద ప్రయోగించినా జవాబుదారీతనం లేకపోవడం" అని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. సంస్థల పనితీరుకు ఈ చట్టం "తీవ్రమైన ముప్పు" అని సుప్రీంకోర్టు పేర్కొంది. "ఈ చట్టం దుర్వినియోగం కావడానికి చాలా అవకాశాలున్నాయి. దీన్ని... వడ్రంగి చెక్కముక్కకోసం అడవిని నరికినట్టుగా ఉంటుందని.. అలాగే ఈ చట్టం కూడా ప్రభావితం చేస్తుందని’’ అని ప్రధాన న్యాయమూర్తి రమణ అన్నారు.

పిటిషనర్, మేజర్-జనరల్ (రిటైర్డ్) ఎస్.జి. వోంబాట్కేర్, దేశద్రోహ నేరానికి సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124-ఎ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, "నిస్సందేహంగా కొట్టివేయాలని" వాదించారు.
 

click me!