Omicron: భార‌త్ లో ఒమిక్రాన్ డ‌బుల్ సెంచ‌రీ !

By Mahesh Rajamoni  |  First Published Dec 21, 2021, 12:57 PM IST

Omicron: యావ‌త్ ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తోంది. భార‌త్ లోనూ ఈ వేరియంట్ కేసులు క్ర‌మంగా పెరుతున్నాయి. మంగ‌ళ‌వారం నాడు ప్ర‌భుత్వం వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం ఒమిక్రాన్ కేసులు దేశంలో డ‌బుల్ సెంచ‌రీ కొట్టాయి. 
 


Omicron: Omicron: గ‌త నెల‌లో ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా దేశాల్లో పంజా విసురుతోంది. ఈ  వేరియంట్‌ను ఇప్ప‌టివ‌ర‌కు వెలుగుచూసిన వాటికంటే అత్యంత ప్ర‌మాక‌ర‌మైన‌దిగా నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అత్యంత వేగంగా ఉంది. ద‌క్షిణాఫ్రికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో ఒమిక్రాన్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. భార‌త్ లోనూ ఈ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. దీంతో స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఒమిక్రాన్ కేసులు దేశంలో డ‌బుల్ సెంచ‌రీ దాటాయి. మంగ‌ళ‌వారం నాడు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 200 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు న‌మోద‌య్యాయి. ఒమిక్రాన్ మొత్తం కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 54 కేసులు న‌మోద‌య్యాయి. దేశ‌రాధాని ఢిల్లీలో 54 కేసులు కొత్త వేరియంట్ కేసులు న‌మోద‌య్యాయి. 

Also Read: Omicron: ఒక ఈవెంట్ కంటే జీవితం ఎంతో ముఖ్యం.. ఒమిక్రాన్ నేప‌థ్యంలో WHO వ్యాఖ్యలు

Latest Videos

undefined

మ‌హారాష్ట్ర, ఢిల్లీలో అత్య‌ధికంగాఒక్కొదాంట్లో 54 చొప్పున ఒమిక్రాన్ కేసులు న‌మోదుకాగా, ఆ తర్వాతి స్థానంలో ఉన్న తెలంగాణలో 20, క‌ర్నాట‌క‌లో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, ఉత్తరప్రదేశ్‌లో 2, ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్క కేసు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.  సోమ‌వారం నాటికి భార‌త్ లో మొత్తం 174 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు న‌మోద‌య్యాయి. ఇవి మంగ‌ళ‌వారం నాటికి 200ల‌కు పెరిగాయి. కొత్త వేరియంట్ బారిన‌ప‌డ్డ‌వారిలో కొలుకున్న‌వారి సంఖ్య సైతం అధికంగానే ఉంది.  ఇప్పటి వరకు మహారాష్ట్రలో 28 మంది, ఢిల్లీలో 12 మంది, క‌ర్నాట‌క‌లో  15 మంది, రాజస్థాన్‌లో 18, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, బెంగాల్‌లో బాధితులు కోలుకున్నారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.  ఒమిక్రాన్ కేసుల‌తో పాటు సాధార‌ణ క‌రోనా వైర‌స్ కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్‌-19 మ‌హమ్మారి క‌ట్ట‌డి కోసం క‌ఠిన చ‌ర్యలు తీసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. అలాగే, క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను సైతం వేగ‌వంతం చేస్తున్నాయి.

Also Read: హైదరాబాద్‌లో దారుణం..సెల్‌ఫోన్ కోసం స్నేహితుడి హత్య

త‌గ్గిన కోవిడ్ కొత్త కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు 

దేశంలో సాధారణ కోవిడ్-19 కొత్త కేసులు త‌గ్గ‌గా, మ‌ర‌ణాలు పెరిగాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 5,326 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు 3,47,52,164కు చేరుకున్నాయి.  ఇదే స‌మ‌యంలో కొత్త‌గా క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి 8,043 మంది బాధితులు కోలుకున్నారు. యాక్టివ్ కేసులు సైతం ల‌క్ష దిగువ‌కు చేరుకున్నాయి. ప్ర‌స్తుతం 79,097 క్రియాశీల కేసులు ఉన్నాయి. అలాగే, గ‌త 24 గంట‌ల్లో క‌రో్నా మ‌హ‌మ్మారితో పోరాడుతూ 453 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్‌-19 మ‌ర‌ణాల సంఖ్య 4,78,007కు పెరిగింది.  క‌రోనా రిక‌వరీ రేటు 98.4 శాతంగా ఉంది. మ‌ర‌ణాల రేటు 1.35 శాతంగా ఉంది.  వారంత‌పు క‌రోనా పాజిటివిటీ రేటు 5.2 శాతంగా ఉంది. ఇక ఒమిక్రాన్ భ‌యాందోళ‌న‌ల నేప‌థ్యంలో దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేశారు. టీకా డ్రైవ్‌లో భాగంగా మొత్తం 1,38,34,78,181 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. ఇందులో మొత్తం 138.3 కోట్ల మొద‌టి డోసులు పంపిణీ చేశారు. పూర్తి డోసులు (రెండు డోసులు) తీసుకున్న వారు 55.5 కోట్ల మంది ఉన్నారు. 

Also Read: Vizag Ashram: జ్ఞానానంద ఆశ్రమంలో మరో 2 ఆవులు మృతి.. మూడు రోజుల్లోనే 26కు పైగా..

click me!