రాత్రి భోంచేసి పడుకున్నారు.. తెల్లారే సరికి ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కింద పడిన యువతి..

Published : Dec 21, 2021, 12:46 PM IST
రాత్రి భోంచేసి పడుకున్నారు.. తెల్లారే సరికి ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కింద పడిన యువతి..

సారాంశం

ఆ రోజు తను నా ఇంటికి వచ్చింది. ఇద్దరం భోజనం చేసి పడుకున్నాం. ఉదయం ఆరు గంటల సమయంలో తను లేచి స్నానాల గదికి వెళ్లింది. అనంతరం కింద పడిపోయింది. నా ఇల్లు 7వ అంతస్తులో ఉంది. అని నితిన్ పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఢిల్లీ : గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్ మెంట్ 7వ అంతస్తు నుంచి ఓ యువతి నగ్నంగా కిందపడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. West Bengal కు చెందిన ఓ యువతి.. తన ప్రియుడి కోసం గతంలో ఇంటిని విడిచి పెట్టి వెళ్లిపోయింది. ఆ తరువాత వారిద్దరూ పానీపత్ లో వివాహం చేసుకున్నారు. ఆ బంధం ఎక్కవ కాలం నిలువలేదు. పలు కారణాల వల్ల వారు విడిపోయారు. ఆ తరువాత ఆ యువతి Panipat లోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేయడం మొదలు పెట్టింది. 

ఈ సమయంలో గ్రేటర్ నోయిడాలోని ఓ NRI Societyకి చెందిన కెమికల్ ఇంజినీర్ Nitin Guptaతో ఆమెకు పరిచయం అయ్యింది. ఈ నెల 2న ఉదయం.. నితిన్ గుప్తా నివాసం కింద ఆ యువతి Nakedగా పడి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. నితిన్ గుప్తాను విచారించారు. 

‘కోవిడ్ కారణంగా... నా భార్య గతేడాది మరణించింది. అప్పుడే ఆ యువతితో నాకు పరిచయం ఏర్పడింది. తరచూ కలుస్తూ ఉండేవాళ్లం. ఆ రోజు తను నా ఇంటికి వచ్చింది. ఇద్దరం భోజనం చేసి పడుకున్నాం. ఉదయం ఆరు గంటల సమయంలో తను లేచి స్నానాల గదికి వెళ్లింది. అనంతరం కింద పడిపోయింది. నా ఇల్లు 7వ అంతస్తులో ఉంది. అని నితిన్ పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Raj Kundra Pornography Case : సిగ్గుతో ముఖం దాచుకుని కూర్చోను.. మౌనం వీడిన రాజ్ కుంద్రా..

ఇదిలా ఉండగా,  ప్రియురాలి మీద స్నేహితులతో కలిసి rape attemptకి పాల్పడ్డాడో కిరాతక ప్రియుడు. ఈ దారుణమైన ఘటన చెన్నైలోని నామక్కల్ లో వెలుగుచూసింది. bihar కు చెందిన ఓ యువతి నామక్కల్ లోని వేప్పేడులోని ఓ ప్రైవేటు మిల్లులో పనిచేస్తోంది. అక్కడే పనిచేస్తున్న బాల్ రాజ్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అయితే, ఆదివారం సెలవు కావడంతో ప్రియురాలికి మాయమాటలు చెప్పి తన ఇంటికి బాల్ రాజ్ తీసుకెళ్లాడు.

ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసిన ఆమె మీద బాలరాజు లైంగికదాడి చేశాడు. అంతే కాదు మిత్రులు ప్రదీప్, మనోజ్ కు అప్పగించాడు. ముగ్గురు కలిసి ఆమె మీద పలుమార్లు సామూహిక లైంగిక దాడి చేయడంతో ఆమె స్పృహ తప్పింది.  ఆమె స్పృహ తప్పి కింద పడిపోవడంతో ఆందోళన చెందిన అక్కడి నుంచి ఆ ముగ్గురు ఉడాయించారు.

అర్థరాత్రి వేళ స్పృహలోకి వచ్చిన ఆ యువతి పెట్టిన కేకలతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో బీహార్ కు పారిపోయే ప్రయత్నంలో ఉన్న ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.  

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు