Mission Impossible:తాప్సీ 'మిషన్ ఇంపాజిబుల్' మూవీ రివ్యూ

By Surya Prakash  |  First Published Apr 1, 2022, 2:23 PM IST


తాప్సీ "మిషన్ ఇంపాజిబుల్" అంటూ మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ" సినిమాతో మంచి హిట్ అందుకున్న స్వరూప్ ఆర్ ఎస్ జె ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.



తాప్సీ ఒకప్పుడు మన సౌత్ లో గ్లామర్ పాత్రలు చేసి దుమ్ము రేపింది. ఇప్పుడు బుద్దిగా కాస్తంత తెలివైన మల్టిఫెక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా..ఆమే గుర్తు వచ్చేలా బ్రాండింగ్ ఫిక్స్ చేసింది. ఈ క్రమంలో వచ్చిన చిత్రమే  'మిషన్ ఇంపాజిబుల్' . పోస్టర్, ట్రైలర్ లో  పిల్లలు, మధ్యలో తాప్సీ ని చూపి ఆసక్తి క్రియేట్ చేసారు.  మరి ఆ ఆసక్తి సినిమాని నిలబెట్టేలా సస్జైన్ చేయగలిగారా..కొత్త తరహాగా చెప్పబడుతున్న ఈ సినిమా మన తెలుగువాళ్లను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ

Latest Videos

undefined

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శైలజ (తాప్సీ) కాస్తంత ధైర్య సాహసాలు ఎక్కువే. తన వృత్తిలో దూసుకుపోతుంది.. సాహసాలు చేస్తూ పలుకుబడి ఉన్న పెద్దల భాగోతాలు బయిటపెడుతుంది. అలాగే ఓ పొలిటీషన్ ని  పదవి నుంచి దింపేసిన ఆమె తన నెక్స్ట్ మిషన్ ను మొదలుపెడుతుంది. ఈ సారి చైల్డ్ ట్రాఫికింగ్ మీద దృష్టి పెడుతుంది. ఆ మిషన్ లోకి ముగ్గురు పిల్లలు అనుకోకుండా వచ్చి చేరుతారు. వాళ్లు రఘుపతి (సినిమా పిచ్చోడు), రాఘవ (టీవీ యాడిక్ట్),రాజారామ్ (క్రికెట్ లవర్). లో మిడిల్ క్లాస్ నుంచి  వచ్చిన ఈ ముగ్గురు పిల్లలది తిరుపతి దగ్గర్లో ఒక చిన్న విలేజ్. వాళ్ళకు ఒకటే కోరిక... ఎలాగైనా దావూద్ ఇబ్రహీం ని పట్టుకొని యాభై లక్షల రివార్డు డబ్బులు చేజిక్కించుకోవాలని. దాంతో ఇంట్లోంచి పారిపోయి..ముంబై అనుకుని బెంగుళూరు వచ్చేస్తారు.  వాళ్లు అనుకోకుండా  శైలజ కి కనెక్ట్ అవుతారు. అప్పుడు ఆమె ఓ వారిని ,వారి ఐడియాలజీని విని, వారితో కలిసి మాఫియాడాన్ రామ్ శెట్టి చేసే చైల్డ్ ట్రాఫికింగ్ ను ఆపాలని ఫిక్స్ అవుతుంది. అక్కడ నుంచి శైలజ ఏం చేసింది...ఆ పిల్లలతో ఆమె మిషన్ ఎంత వరకు సక్సెస్ అయ్యిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 

ఎనాలసిస్..

అప్పుడెప్పుడో 2003లో  'ఐతే' అనే చిత్రం వచ్చింది.ఓ  డాన్ ని పట్టుకుని ప్రైజ్ మనీ కొట్టేద్దామని  కొందరు కుర్రాళ్లు, అమ్మాయి కథలో   కొత్త తరహా ఫన్, థ్రిల్స్ తో వచ్చి సూపర్ సక్సైస్ అయ్యింది. ఆ తర్వాత ఆ తరహా నేరేషన్ ని కొందరు ట్రై చేసారు. కానీ ట్రైల్స్ క్రిందే మిగిలిపోయారు. మళ్లీ ఇంతకాలానికి ఓ డాన్ ని పట్టుకోవాలని , ముగ్గురు పిల్లాళ్లు బయిలుదేరటం, అందుకు ఓ జర్నలిస్ట్ సహకరించటం వంటి అంశాలతో ఈ చిత్రం వచ్చింది. అయితే ముగ్గురు పిల్లలు ఫన్ దాకా బాగా రాసుకున్న దర్శకుడు ఆ తర్వాతే దారి తప్పాడు. సెకండాఫ్ కు వచ్చేసరికి తను ఓ ఫన్ సినిమా రాస్తున్నా, తీస్తున్నా అనే విషయం మర్చిపోయి సీరియస్ గా శివమెత్తే ప్రయత్నం చేసాడు. అయితే పిల్లలు ఓ డాన్ ని ప్టటుకుందామనేది ఓ ఫార్స్..దానికి మరింత ఫార్స్ జతైతే పాపం పసివాడు పరిస్దితి అయ్యిపోయింది థియోటర్ లో కూర్చున్న జనం పరిస్దితి. తాప్సీ కూడా ఏం చేయటానికి వీల్లేకపోయింది.

ఆమె ఇన్విస్టేగిటివ్ జర్నలిస్ట్ అంటారు కానీ అదేంటో సీబీఐని మించిపోతుంది. పోలీస్ లతో క్రిమినల్ ని పట్టేసుకునే పోగ్రాం పెట్టుసుకుంటుంది. పోలీస్ లు సైతం పోనీలే ఎవరో ఒకరు చేస్తున్నారు కదా..సాయి పడదాం అనే విశాల హృదయంతో ఉన్నట్లు కనపడతారు. సర్లేండి కొన్ని సినిమాటెక్ విషయాలు పట్టించుకోకూడదు అంటే దాన్ని వదిలేయచ్చు కానీ  ఇలాంటి పిల్లలను చూపించి పోస్టర్, టీజర్స్ లో  చూపించి, మీ పిల్లలతో ఈ సినిమా కు వచ్చేయండి అని టెమ్ట్ చేసీ....   ఛైల్డ్ ట్రాఫికింగ్ సబ్జెక్టు మీద సీన్స్ రన్ చేస్తే ఎలా. అయితే ముగ్గురు చిన్న పిల్లలను అడ్డం పెట్టి మెచ్యూరిటి ఉన్న తాప్సీ పాత్ర ..ఇలాంటి మిషన్స్ పెట్టుకుంటుంది అంటే బాలకార్మికలు చట్టం కేసు పెట్టాలనిపిస్తుంది. అలా ఈ కాలం ఐతే ...ఫస్టాఫ్ లో ఫన్ తో కేకే అనిపించుకుంది.సెకండాఫ్ లో  ఈ సినిమా పూర్తి గా చూడాలా అనిపిస్తుంది. అలాగే విలన్ కు ఈ పిల్లలు, ఇన్విస్టిగేషన్ జర్నలిస్ట్ తన గురించి వెతుకుతున్నారు, పట్టుకోబోతున్నారు అనే విషయం కాస్త తొందరగా తెలిస్తే కిక్ వచ్చేది. పుణ్యకాలం అంతా అయ్యిపోయాక విలన్ కు, వీళ్లకు మధ్య సీన్స్ రావటంతో ప్యాసివ్ పాత్రలు అయ్యిపోయి చతికిలపడ్డాయి.

టెక్నికల్ గా..

"ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" వంటి సూపర్ హిట్ ఇచ్చిన   డైరెక్టర్ స్వరూప్ నుంచి వస్తున్న సినిమా కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్ే ఈ సారి కూడా రొటీన్ కి భిన్నమైన కథను ఎంచుకొన్నారు. అయితే స్క్రిప్టు సరిగ్గా రాసి పెట్టుకోలేదు. దాంతో డైలాగులు ,ఫస్టాఫ్ ఫన్ బాగున్నా,సెకండాఫ్ బాగా డ్రాప్ అయ్యిపోయింది.  అలాగే ఈ సినిమా ఫన్ కు ఎక్కువ స్కోప్ ఉంటుందని అంతా భావించారు. కానీ సెకండాఫ్ లో బోర్ కొట్టించి మన నమ్మకంపై దెబ్బకొట్టాడు.  ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఇక మార్క్ కే రాబిన్ సంగీతం జస్ట్ ఓకే. ఉన్నంతలో కెమెరా డిపార్టమెంట్ బాగా వర్క్ చేసింది. తెరపై కొన్ని విజువల్స్ చాలా రిచ్ గా కలర్ ఫుల్ గా ఉన్నాయి. ఎడిటింగ్ సోసోగా అనిపిస్తుంది.
 
నటీనటుల్లో...
తాప్సీ గురించి కొత్తగా చెప్పుకునేదేముంది. ఎప్పటిలాగే బాగా చేసేది. కానీ ఆమె పాత్రకు అంత సీన్ లేదు. తక్కువ రోజులు తీసుకుని లాగేసినట్లు ఉన్నారు. ఇక పిల్లలు ముగ్గురూ ఎక్కడా కొత్త అనిపించకుండా సీనియర్స్ లా చెలరేగిపోయారు. మలయాళ నటుడు హరీశ్ పేరడి గెటప్ ఇంట్రస్టింగ్ గా  ఉంది.  తాప్సీ పక్కనే ఉండే విక్రమ్ పాత్రధారి రవీంద్ర విజయ్ డబ్బింగ్ బాగోలేదు.సుహాస్, హర్షవర్థన్, వైవా హర్ష, ‘సత్యం’ రాజేశ్‌, మధుసూదన్, సందీప్ రాజ్ వంటి వాళ్ళు గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు.

ఫైనల్ థాట్

ఐడియా లెవిల్లో బాగున్న ప్రతీ సినిమా ...అద్బుతమైన స్క్రిప్టుగా మారాలని రూల్ లేదు. అలాగే ప్రతీ జనరేష్ లోనూ ఓ ఐతే  వస్తుందని నమ్మకమూ లేదు.

---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating :2

ఎవరెవరు...
నటీనటులు: తాప్సీ పన్ను, హర్ష్ రోషన్, హర్ష వర్ధన్, భాను ప్రకాశన్, హరీష్ పెరాడి, వైవ హర్ష, సుహస్, సత్యం రాజేష్ తదితరులు
 సంగీతం: మార్క్ కే రాబిన్
 సినిమాటోగ్రఫీ: ఎస్ మనికందన్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
దర్శకత్వం: స్వరూప్ అర్ ఎస్ జే
బ్యానర్: మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, పీ ఏ ఎంటర్టైన్మెంట్
విడుదల తేది: 01/04/2022

click me!