సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ... నాని సినిమా హిట్టా? ఫట్టా? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

By Sambi ReddyFirst Published Aug 29, 2024, 6:17 AM IST
Highlights

హీరో నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించారు. ఈ మూవీ ప్రీమియర్స్ ముగియగా సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. సరిపోదా శనివారం ట్విట్టర్ ఎక్స్ టాక్ ఏమిటో చూద్దాం.. 
 

హీరో నాని వరుస విజయాలతో జోరుమీదున్నారు. ఆయన గత రెండు చిత్రాలు దసరా, హాయ్ నాన్న బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. దసరా నాని కెరీర్ లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా ఉంది. హాయ్ నాన్న మెల్లగా పుంజుకుని బ్రేక్ ఈవెన్ దాటి హిట్ స్టేటస్ అందుకుంది. సరిపోదా శనివారం చిత్రంతో హ్యాట్రిక్ పై నాని కన్నేశాడు. దర్శకుడు వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం చిత్రానికి దర్శకత్వం వహించాడు. 

వివేక్ ఆత్రేయ రొమాంటిక్ కామెడీ చిత్రాలతో పాప్యులర్ అయ్యారు. ఆయన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేసింది లేదు. సరిపోదా శనివారం ఆ జోనర్లో తెరకెక్కించారు. కాగా నానితో ఆయనకు సరిపోదా శనివారం రెండో చిత్రం. గతంలో వీరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న అంటే సుందరానికీ కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. అంటే సుందరానికీ విఫలం కావడానికి దర్శకుడు కారణం కాదు. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం నేనే ఫెయిల్ అయ్యాయని నాని చెప్పడం విశేషం. 

Latest Videos

సరిపోదా శనివారం మూవీ ఆగస్టు 29న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేశారు. యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ ముగిశాయి. మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మెజారిటీ ఆడియన్స్ సరిపోదా శనివారం పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మూవీలో లోపాలు ఉన్నప్పటికీ సంతృప్తి పరుస్తుందని అంటున్నారు. 

సరిపోదా శనివారం మూవీలో ప్రధాన హైలెట్స్ గా హీరో నాని ఇంట్రో సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ చెబుతున్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో కూడా మెప్పించాడని అంటున్నారు. మెయిన్ విలన్ రోల్ చేసిన ఎస్ జే సూర్య పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన నటన, క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. సూర్య డామినేట్ చేశాడనేది ఆడియన్స్ అభిప్రాయం. 

విలక్షణమైన పాత్రలో నాని మెప్పించాడని అంటున్నారు. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రేపే సీన్స్ చాలా ఉన్నాయి. సరిపోదా శనివారం మూవీలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్ గురించి ఆడియన్స్ లో పెద్దగా చర్చ లేదు. బహుశా ఆమె పాత్రకు ప్రాధాన్యత లేదనిపిస్తుంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ చాలా బాగుందన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా బీజీఎమ్ సినిమాకు ప్లస్ అయ్యింది. సీన్స్ ని ఎలివేట్ చేసిందని అంటున్నారు. 

is a satisfactory action drama that had moments of excellence but at the same time had moments where the film was too dragged out and predictable.

The introduction block, interval block, climax block, and few confrontation scenes between Nani and SJ Surya…

— Venky Reviews (@venkyreviews)

ఇక సరిపోదా శనివారం మూవీలో లోపాల ప్రస్తావన వస్తే... మూవీ స్లోగా ఉందని అంటున్నారు. రన్ టైం ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల బోరింగ్ గా సాగుతుందట. అలాగే ఫ్లాట్ నరేషన్ నిరాశపరుస్తుందట. ఈ కారణంగా ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవరట. సరిపోదా శనివారం ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తుంది. 

మరి కమర్షియల్ గా సరిపోదా శనివారం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. పూర్తి రివ్యూ వస్తే కానీ సరిపోదా శనివారం ఫలితం ఏమిటో అంచనా వేయగలం.  సాయి కుమార్, అదితి బాలన్, మురళీ శర్మ కీలక రోల్స్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ ప్రొడ్యూసర్ డీవివి దానయ్య ఈ చిత్రాన్నినిర్మించాడు. 

Saved this long back To Post Today!

Prathi Scene lo Director Kasi 🙏

Evaraithe Troll Chesaro Vaallathone Elevations Veyinchukune Stuff Ichaadu 🥵❤️‍🔥

Interval Sequence and 2nd Half lo Vacche Pub Scenes are 🔥🔥

Go Watch It 🥳👌 pic.twitter.com/Rprd9sbtIQ

— ft.frames_ (@ft_urs_dileep)
click me!