Movie Review  

(Search results - 231)
 • Alludu Adhurs

  EntertainmentJan 14, 2021, 7:15 PM IST

  బెల్లంకొండ 'అల్లుడు అదుర్స్‌' రివ్యూ


  సంక్రాంతి పండుగ..అల్లుడు ఈ రెండు ఎప్పుడూ మంచి సింక్ లో ఉంటాయి. ఇది గమనించే ఉత్సాహంగా బెల్లంకొండ బాబు..అల్లుడు అదుర్స్ అంటూ సంక్రాంతికి థియోటర్స్ లో దిగిపోయాడు. కామెడీ ఉందని, ఊపు వచ్చే పాటలు ఉన్నాయని, ఉత్సాహపరిచే డాన్స్ లు ఉన్నాయని ఊరించి మరీ వచ్చాడు. అయితే ట్రైలర్ చూసిన వాళ్లు ఇదేదో పాతికేళ్ల క్రితం నాటి వ్యవహారం లాగుందే అని పెదవి విరాచారు. మరి పూర్తి సినిమా కూడా అలాగే ఉందా..సినిమా లో కొత్తదనం ఏమన్నా చూపించారా..అల్లుడు ఎవరు..అదుర్స్ అని ఎలా అనిపించుకున్నాడు. చూసిన జనాలు కూడా అదుర్స్ అన్నారా లేదా అన్న విషయాలు రివ్యూలో చూద్దాం.

 • Alludu Adhurs Movie Public Talk | Alludu Adhurs Review | Bellamkonda Sreenivas, Nabha Natesh
  Video Icon

  Entertainment NewsJan 14, 2021, 2:30 PM IST

  అల్లుడు అదుర్స్ చిత్రం విడుదల: థియేటర్స్ వద్ద హీరో సాయి శ్రీనివాస్ అభిమానుల కోలాహలం

  సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్  చిత్రం సంక్రాంతి కానుకగా ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయింది..

 • red review

  EntertainmentJan 14, 2021, 2:03 PM IST

  రామ్ 'రెడ్' మూవీ రివ్యూ


  లైటర్ వీన్ కామెడీలు, లవ్ స్టోరీలు చేయటంలో రామ్ పండిపోయాడు. మొన్న వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగానూ ప్రూవ్ అయ్యాడు. అయితే అతని కెరీర్ లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మాత్రం  చేసింది లేదు.  ఆ ముచ్చట కూడా  ‘రెడ్‌’ తో తీరినట్లే. అంతేకాదు తమిళ హిట్ చిత్రం తడమ్ కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో  తొలిసారి ద్విపాత్రాభినయం కూడా చేసాడు. అలాగే తన కెరీర్ లో బెస్ట్ అనుకున్న హిట్ ఇచ్చిన  ‘నేను శైలజ’ డైరక్టర్ కిషోర్ తిరుమల తో ఈ సినిమా చేసాడు. ఇన్ని స్పెషాలిటీలు ఉన్న సినిమా పై అంచనాలు అదే స్దాయిలో ఉంటాయని టీమ్ కు తెలుసు. ఆ ఎక్సపెక్టేషన్స్ ని  ఈ సినిమా ఏ మేరకు అందుకుంది. తమిళ రీమేక్ కు తెలుగులో ఎలాంటి మార్పులు చేసారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకోబోతోంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

 • Red Movie Public Talk | Red Movie Review | Ram Pothineni, Kishore Tirumala
  Video Icon

  Entertainment NewsJan 14, 2021, 1:37 PM IST

  రెడ్ చిత్రంపై టాక్: సంక్రాంతికి నాటు కోడే కాదు, పొట్టేలూ దొరికింది

  రామ్ పోతినేని హీరో గా నటించిన రెడ్ సినిమా సంక్రాంతి కానుకగా ఈ  రోజు విడుదల  అయి హిట్ టాక్ తెచ్చుకుంది..

 • Master movie Review

  EntertainmentJan 13, 2021, 2:42 PM IST

  విజయ్ “మాస్టర్” రివ్యూ


  కార్తీ హీరోగా వచ్చిన ‘ఖైదీ’ సినిమా చాలా మందికి నచ్చేసింది. ఈ డైరక్టర్ దర్శకత్వంలో చేయాలని చాలా మంది హీరోలు ఉత్సాహపడ్డారు. కానీ విజయ్ ఆ డైరక్టర్ ని వెంటనే లాక్ చేసి తనతో సినిమా చేయించుకున్నారు. దాంతో అటు విజయ్ ఫ్యాన్స్..ఇటు డైరక్టర్ కనక్ రాజ్ ఫ్యాన్స్ ఎలాంటి సినిమా వస్తుందా అని ఎదురుచూడటం మొదలెట్టారు. ఖచ్చితంగా విజయ్ రెగ్యులర్ సినిమా అయితే కాదు అని ఫిక్సైపోయారు. దానికి తగినట్లుగానే ట్రైలర్ కూడా విభిన్నంగానే సాగింది. వీటిన్నటికీ తోడు విభిన్నతకు మారు పేరైన విజయ్ సేతుపరి మరో కీలకపాత్రలో కనిపించటం. తను కూడా ఈ సినిమాలో తన వైపు చూస్తే హీరో క్యారక్టరైజేషనే అని విజయ్ సేతుపరి చెప్పటం..ఇదోదో మామూలు సినిమా కాదు అన్న ఆలోచనని కలిగించి..ఎక్సపెక్టేషన్స్ ని రెట్టింపు చేసేసాయి. ఆ అంచనాలను ఎంతవరకూ ఈ సినిమా అందుకుంది. డైరక్టర్ కనక్ రాజ్ మరోసారి  “మాస్టర్” స్ట్టోక్ ఇచ్చారా..కథేంటి,విజయ్ ఫ్యాన్స్ కు నచ్చేలా ఉందా..డైరక్టర్ ఫ్యాన్స్ కు నచ్చేలా ఉందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

 • KRACK movie review

  EntertainmentJan 10, 2021, 7:26 AM IST

  రవితేజ ‘క్రాక్‌’ రివ్యూ

  రవితేజకు పోలీస్ డ్రస్ బాగానే అచ్చొచ్చింది.  పోలీస్ కథ‌లు చేసిన ప్ర‌తీసారీ హిట్టు ద‌క్కించుకుంటూనే ఉన్నాడు. అప్పట్లో రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్ అంటూ మీసం మెలేసిన మాస్ రాజా..ఆ తర్వాత బలుపులోనూ మరోసారి పోలీస్ గా దుమ్ము రేపారు. ఇదిగో ఇప్పుడు క్రాక్ సినిమాతో  పోతరాజు వీర శంకర్‌గా పోలీస్ అవతారం ఎత్తాడు.వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న ర‌వితేజ ఈ పోలీస్ డ్రస్ తో ఒడ్డున పడదాముకున్నాడు‌. ఈ సినిమాతో హిట్టు ప‌డితే… త‌న కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డుతుంద‌న్న ఆశగా ఉన్నాడు. దానికి తోడు `క్రాక్‌` ట్రైలర్ చూస్తూంటే మంచి క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ తో తెర‌కెక్కిన సినిమా అనిపించింది. పాట‌లూ మాస్ కి బాగా ఎక్కాయి. అన్నిటికన్నా ముందు కరోనా తర్వాత రిలీజ్ అవుతున్న మాస్ సినిమా ఇదే. సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఈ సినీ పందెం కోడి..ఏ మేరకు అభిమానులను అలరించింది. హిట్ టాక్ తో దూసుకుపోతుందా. రవితేజం మళ్లీ గత వైభవం తెచ్చుకోగలుగుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

 • Vitamin she telugu movie review

  EntertainmentDec 29, 2020, 5:09 PM IST

  'విటమిన్ షి' సినిమా రివ్యూ

  ప్రక్క గదిలో ఉన్న కొడుకుని భోజనానికి పిలవాలంటే వాట్సప్ లోనో లేక ఫేస్ బుక్ లోనో మెసేజ్ పెట్టాల్సిన సిట్యువేషన్ నేడు చాలా ఇళ్లల్లో ఉంది.   ఆరోగ్యం, చదువు, మానసిక స్థితిపై  సెలఫోన్ వాడకం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆధునికీకరణ పేరుతో జరుగుతున్న ఈ సామాజిక నష్టాన్ని వారించేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ప్రయత్నించాలని మానసిక శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆ విషయాన్ని సైతం జనాలకి రీచ్ అవ్వాలంటే ఏ ట్విట్టర్ లోనో చెప్పాల్సిన పరిస్దితి. అప్పుడు సోషల్ మీడియాలోనే జనం కలిసికట్టుగా కొన్ని పోస్ట్ లు పెట్టి తమ నిరసన తెలియచేసి, మరో విషయంలోకి అంతే స్పీడుగా వెళ్లిపోతారు.ఇలాంటి పరిస్దితులు ఉన్న ఈ రోజుల్లో  విజువల్ మీడియా కొంతవరకూ ఇలాంటి సమస్యలను ఎక్సప్లోర్ చేయగలుగుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడూ  జనం సోషల్ మీడియాలోంచి,సెల్ లోంచి బయిటకు వచ్చి సినిమాలు చూస్తున్నారు. అఫ్ కోర్స్ అలా థియోటర్స్ కు వెళ్లి చూసేవాళ్లు తగ్గుతున్నారు కాబట్టే ఓటీటిలతో సెల్ ఫోన్స్ సాయింతో జనం వద్దదే సినిమాని తీసుకువెళ్తున్నారు. ఇలాంటి సిట్యువేషన్ లో సినిమా ద్వారానే ఈ విషయాలను ఎత్తిచూపాలని ఫిక్సైన ఓ దర్శకుడు ఈ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టెక్నాలిజీపై ఓ వ్యగ్యాత్మక సినిమాని రూపొందించి వదిలాడు. ఆ సినిమా కథేంటి...దర్శకుడు చెప్పాలనుకున్న మెసేజ్ ఏమిటి..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
   

 • Guvva Gorinka Telugu Movie Review

  EntertainmentDec 17, 2020, 5:44 PM IST

  సత్యదేవ్ 'గువ్వా – గోరింక‌' రివ్యూ

  ఆమె పేరు శిరీష.. సంగీతమే ఈమె ప్రపంచం.. అతని పేరు సదానంద్.. చదువుతోంది మెకానికల్ ఇంజినీరింగ్ లో పీ హెచ్ డి.. చిన్న సౌండ్ వచ్చినా భూకంపం వచ్చినవాడిలా రియాక్ట్ అవుతాడు.. సంగీతమే ప్రాణమైన ఓ అమ్మాయికి సౌండ్ అంటేనే పడని ఓ అబ్బాయికి.. ఇష్టాయిష్టాలు వేరున్నా.. గువ్వ గోరింకల్లాంటి ఇద్దరి కథ .ఓటీటిలలో సత్యదేవ్ ది ప్రత్యేకమైన ట్రెండ్. విభిన్నమైన కాన్సెప్ట్ లతో  వరసహిట్స్ తో దూసుకుపోతున్నారు. ఆయన తాజా చిత్రం “గువ్వ గోరింక”. అయితే దాదాపు మూడేళ్ల క్రితం సినిమా పూర్తై రిలీజ్ కోసం ఆగి...ఆగి ఇన్నాళ్లకు రిలీజైంది. వినటానికి ఇంట్రస్టింగ్ పాయింట్ తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాతకాలం సినిమా అనిపించే 'గువ్వా – గోరింక‌' అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి..కథేంటి, సత్యదేవ్ కెరీర్ కు ఏ మేరకు ప్లస్ అవుతుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

 • IIT Krishnamurthy

  EntertainmentDec 10, 2020, 5:34 PM IST

  'ఐఐటి కృష్ణమూర్తి' రివ్యూ

  పృథ్వీ దండ‌మూడి, మైరా దోషి జంట‌గా న‌టించిన చిత్రం `ఐఐటీ కృష్ణ మూర్తి`. ఈ సినిమాతో శ్రీ వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమయ్యారు. క్రిస్టోలైట్ మీడియా క్రియేష‌న్స్, అక్కి ఆర్ట్స్ బ్యాన‌ర్ల పై మ్యాంగో మాస్ మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ప్ర‌సాద్ నేకూరి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు (గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా నేరుగా ఈ చిత్రం విడుదలైంది. 

 • comali review

  EntertainmentDec 4, 2020, 3:24 PM IST

  కాజల్ ‘కోమాలి’ రివ్యూ

  పదహారేళ్లు కోమాలో ఉన్న ఓ వ్యక్తి మళ్లీ ఈ లోకంలోకి వస్తే? అనే కథాంశంతో ‘కోమాలి’ రూపొందింది. పదహారేళ్లకు, ఇప్పటికి సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. మారిన పరిస్థితులకు హీరో అలవాటు పడ్డాడా? అనేది ఎప్పుడూ ఆసక్తిగొలిపే అంశమే. అయితే అంతే ఇంట్రస్ట్ తో డైరక్టర్ ఈ సినిమాని డీల్ చేసారా..అసలు కథేంటి..తెలుగు వాళ్లకు నచ్చుతుందా ఈ తమిళ డబ్బింగ్ సినిమా? వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
   

 • Bombhaat telugu movie Review

  EntertainmentDec 3, 2020, 7:18 PM IST

  'బొంభాట్' తెలుగు సినిమా రివ్యూ

  తెలుగు తెరపై ఓ సైన్స్ ఫీక్షన్ సినిమా చూపిస్తున్నామంటూ ఈ దర్శక,నిర్మాతలు చెప్పారు. నిజమే అనుకుంటూ మనమూ ఈ సినిమా చూడబోతాం. అయితే ఆ తర్వాత అర్దమవుతుంది. ఈ సైన్స్ ఫిక్షన్ కాదు..మరొకటి కాదని..మరేంటి..అసలేముంది ఈ సినిమాలో అని తెలుసుకునే క్రమంలో సినిమా, మన మౌస్ పోటీ పడి మరీ  ముందుకు జరుగుతాయి. 

 • <p>ANAGANAGA O ATHIDI</p>

  EntertainmentNov 21, 2020, 4:38 PM IST

  పాయల్ రాజ్‌పుత్ 'అన‌గ‌న‌గా ఓ అతిథి' రివ్యూ


   `ఆహా` వేదిక‌గా విడుద‌లైన ఓ వెబ్ మూవీ `అన‌గ‌న‌గా ఓ అతిథి`. కన్నడ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు సక్సెస్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

 • <p>Middle Class Melodies&nbsp;</p>

  EntertainmentNov 20, 2020, 3:04 PM IST

  'మిడిల్ క్లాస్ మెలొడీస్' రివ్యూ

   అమేజాన్ ప్రైంలో విడుదలైన మరో చిన్న సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘జాను’ ఫేమ్ వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రం ఈ రోజు రిలీజైంది.

 • <p>Gatham movie review</p>

  EntertainmentNov 6, 2020, 5:06 PM IST

  'గతం' మూవీ రివ్యూ

  సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే మంచి ఎక్సపెక్టేషన్స్ ని ఏర్పరుచుకుంది.  అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే  రివ్యూలోకి వెళ్లాల్సిందే.

 • <p>Miss india review</p>

  EntertainmentNov 4, 2020, 12:17 PM IST

  కీర్తి సురేష్ ‘మిస్‌ ఇండియా’ రివ్యూ

  కీర్తి సురేష్ కొద్దికాలం క్రితమే ‘పెంగ్విన్’ అంటూ పలకరించింది. ఇప్పుడు అదే కోవలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘మిస్ ఇండియా’. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సినిమా అయినా మహానటి స్థాయికి తగ్గట్లు ఉందో లేదో చూద్దాం