Yoga Day 2022: ఒకే ఒక్క నిమిషం పాటు ఈ యోగాసనం వేస్తే.. ఫాస్ట్ గా బరువు తగ్గుతారు..

By Mahesh RajamoniFirst Published Jun 16, 2022, 12:38 PM IST
Highlights

Yoga Day 2022: అధిక బరువు, ఊబకాయం ఈ రోజుల్లో సర్వ సాధారణ సమస్యలుగా మారాయి. ఈ సమస్యలున్న వారు క్రమం తప్పకుండా ఒక నిమిషం పాటు ఈ ఆసనం వేస్తే కొవ్వు చాలా ఫాస్ట్ గా కరిగిపోతుంది. 

Yoga Day 2022: ఒత్తిడితో కూడిన జీవనశైలి, పేలవమైన ఆహారం కారణంగా.. ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు (Overweight), ఊబకాయం (Obesity)తో బాధపడుతున్నారు. బర్గర్లు (Burgers), పిజ్జాలు (Pizzas) మొదలైన స్నాక్స్ కూడా ఈ సమస్యలకు కారణమవుతాయి. ఇక దీని నుంచి బయటపడటానికి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతుంటారు. బరువు తగ్గడానికైనా, ఆరోగ్యంగా ఉండటానికైనా యోగా ప్రయోజనకరంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఇది వాస్తవం కూడా. యోగా మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఫిట్ గా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక బరువు, ఊబకాయం నుంచి బయటపడేయడానికి ఒక ఆసనం మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆసనం బెల్లీ ఫ్యాట్ ను కూడా తగ్గిస్తుంది.

యోగాతో శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. రోజూ యోగా చేసేవారికి ఊబకాయం సమస్య ఉండనే ఉండదు. ఎందుకంటే యోగాకు అలాంటి శక్తి ఉంది. ఊబకాయాన్ని తగ్గించడంలో యోగా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ప్రతి ఆసనం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజూ హలాసనం చేస్తుంటే ఊబకాయాన్ని ఇట్టే కరిగించేయొచ్చు. 

హలాసనం అంటే ఏమిటి?
యోగాలో బొడ్డు కొవ్వు (Belly fat)ను తగ్గించడానికి ఒక ప్రభావవంతమైన ఆసనం ఉంది. అదే హలాసనం, దీనిని బ్లో బోస్ అని కూడా పిలుస్తారు. దీనిని క్రమం తప్పకుండా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ ను దూరం చేసుకోవచ్చు. హలాసనం తలక్రిందులుగా ఉండే ఆసనం. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది చేసేటప్పుడు మీ కడుపు, కడుపు ప్రాంతంపై ఒత్తిడి ఉంటుంది. తద్వారా ఊబకాయం సులభంగా కరిగిపోతుంది.

హలాసనం ఎలా చేయాలి?
చాపపై పడుకోండి.  మీ చేతులు మీ పక్కన పెట్టుకోండి. కాళ్ళు 90-డిగ్రీల కోణంలో ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా కాళ్లను ఎత్తండి. అలాగే మీ చేతులను మీ వీపుకు సపోర్ట్ గా ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా కాళ్లను 180-డిగ్రీల కోణంలో పైకి లేపండి. అలగే నెమ్మదిగా వాటిని మీ చెవి వెనుకకు తీసుకురండి. ఒక నిమిషం పాటు ఈ భంగిమలో ఉండండి. ఈ స్థితికి రావడానికి ముందు శ్వాసను బాగా తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను వదలండి. తరువాత సాధారణంగా శ్వాసను తీసుకోండి. తరువాత నెమ్మదిగా శ్వాసను వదలి .. తిరిగి మామూలు స్థితికి రండి. 

హలాసనం ఊబకాయాన్ని ఎలా తగ్గిస్తుంది?

ఈ ఆసనం జీర్ణ అవయవాలకు మసాజ్ లా పనిచేస్తుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. థైరాయిడ్ గ్రంధిపై పనిచేసి మీ జీవక్రియను మెరుగుపరుస్తాయి. అందువల్ల అదనపు కొవ్వును వదిలించుకోవాలనుకునేవారికి ఇది గొప్ప ఎంపిక. క్రమం తప్పకుండా హలాసనాన్ని చేయడం వల్ల మీ శ్వాసను మెరుగుపరుస్తుంది.

ఒకవేళ మీకు డయేరియా, రుతుస్రావం లేదా మెడకు గాయం అయినట్లయితే ఈ ఆసనాన్ని ప్రయత్నించకండి. అలాగే అధిక రక్తపోటు, ఆస్తమాతో బాధపడుతున్నట్లయితే ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ కాళ్లు వీపుకు సపోర్టులతో సపోర్ట్ చేయండి. మీరు గర్భవతిగా ఉంటే.. మీరు చాలా కాలంగా ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రమే ఈ ఆసనం వేయండి. గర్భధారణ సమయంలో దీన్ని చేయకపోవడమే మంచిదని నిపుుణులు చెబుతున్నారు. 

click me!