World Blood Donor Day 2022: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు?

By Mahesh RajamoniFirst Published Jun 14, 2022, 1:20 PM IST
Highlights

World Blood Donor Day 2022: రక్తదానం చేస్తే ఆరోగ్యం పాడవుతుందన్న అపోహతోనే ఎంతోమంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం లేదు. వాస్తవానికి 18 నుంచి 60 సంవత్సరాల మధ్యనున్న ఆరోగ్యంగా ఉన్న ఏ వ్యక్తులైనా రక్తదానం చేయొచ్చు. 
 

రక్తదానం అంటే బయపడి పారిపోయేవారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే రక్తదానం వల్ల ఆరోగ్యం పాడవుతుందని బయటపడిపోతుంటారు. కానీ మీరనుకున్నట్టు రక్తదానం చేయడం వల్ల ఎలాంటి చెడుప్రభావాలు పడవు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఎవరికైనా రక్తదానం చేయవచ్చు. ప్రపంచ రక్తదాత దినోత్సవం( జూన్ 14) సందర్భంగా ఎవరు రక్తదానం చేయొచ్చు. ఎవరు చేయకూడదు అనే విషయాలను తెలుసుకుందాం పదండి. 

రక్తదానం ఎవరు చేయొచ్చు:  18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆరోగ్యవంతులైన వ్యక్తులు రక్తదానం చేయవచ్చు. వీరి శరీర బరువు 45 కిలోలు ఉండాలి. Hemoglobin content 12.5 గ్రాముల కంటే ఎక్కువగా ఉండాలి. రక్తపోటు (Blood pressure)నార్మల్ గా ఉండాలి. Systolic blood pressure 100 నుంచి 140 వరకు, Diastolic blood pressure 70 నుంచి 100 వరకు ఉండాలి. 45 నుంచి 60 కిలోలు బరువున్న దాతల శరీరం నుంచి 350 మిల్లీలీటర్ల రక్తాన్ని, 60 కిలోల కంటే ఎక్కువ బరువున్న దాతల నుంచి 450 మిల్లీలీటర్ల రక్తాన్ని దానం చేయొచ్చు. ఆరోగ్యవంతమైన పురుషులు మూడు నెలలకు ఒకసారి, మహిళలు నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. 

ఎవరు రక్తదానం చేయకూడదు: అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రోజూ ట్యాబ్లెట్లను వాడుతుంటారు. HIV/AIDS సోకినవారు, క్యాన్సర్ (Cancer)రోగులు, అంటువ్యాధులు (Infections) ఉన్నవారు, Heart patients, క్షయ రోగులు (Tuberculosis patients), కాలేయం (Liver), మూత్రపిండాల (Kidney) సమస్యలున్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, Hepatitis 'B'సోకినవారు, మాదక ద్రవ్యాలకు (Drugs)బానిసలైనవారు, తక్కువ బరువు ఉన్నవారు, Hemoglobin లోపంతో బాధపడుతున్నవారు, గర్భిణీ స్త్రీలు రక్తదానం చేయడానికి వీలు లేదు. 

రీప్లేస్ మెంట్ బ్లడ్ (Replacement blood)పొంది, చేతులపై పచ్చబొట్టు పొడిపించుకున్న వారు ఆరు నెలల పాటు రక్తదానం చేయడానికి అనుమతి లేదు. శస్త్రచికిత్స (Surgery) చేయించుకున్నవారు, టైఫాయిడ్ (Typhoid), రక్తహీనత (Anemia), మలేరియా, రేబిస్, తల్లిచ్చే తల్లులు ఒక సంవత్సరం పాటు రక్తదానం చేయకూడదు. కలరా, ప్లేగుతో సహా అంటువ్యాధులతో బాధపడుతున్న వారు 15 రోజుల నుంచి ఒక నెల వరకు రక్తదానం చేయకూడదు. 

రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు:  దాత ఒకసారి రక్తదానం చేసిన వారు తిరిగి మూడు నెలల వరకు దానం చేయకూడదు. రక్తదానం చేయడం ద్వారా శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు దీంతో మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇది దాత Functionalityని మెమరీని పెంచుతుంది. రక్తదానం వల్ల శరీరంలోని కొవ్వు పదార్థాలు తగ్గుతాయి. దీనివల్ల గుండెపోటు ప్రమాదం 80 శాతం తగ్గుతుంది. రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నివారించడానికి కూడా రక్తదానం సహాయపడుతుంది.

అలాగే రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నొప్పి ఉండదు. కేవలం 20 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. 48 గంటల్లో అదే మొత్తంలో రక్తం ఉత్పత్తి అవుతుందని, రెండు వారాల్లోనే రక్తంలో అవసరమైన అన్ని భాగాలు చేరుతాయని వైద్యులు చెబుతున్నారు. దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ అవసరమైన వారికి రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. రక్తదానం ఒక వ్యక్తి ప్రాణాలను నెలబెడుతుంది.  

click me!