
Amarnath Yatra 2022: కరోనా కారణంగా అమర్ నాథ్ యాత్ర సుమారుగా రెండేళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ యాత్ర మళ్లీ పున:ప్రారంభం అవుతోంది. కాగా ఈ యాత్ర జూన్ 30 నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ఆగస్టు 11 వరకు కొనసాగుతుంది.
కాగా ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 11 నుంచే మొదలయ్యాయి. ఈ అమర్ నాథ్ యాత్రకు సుమారుగా 3 లక్షల భక్తులు రావొచ్చని అమర్ నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు అంచనా వేసింది. ఇక ఈ యాత్ర అతి తొందరలోనే ప్రారంభం కావడంతో అధికారులు యాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అమర్ నాథ్ యాత్రికుల భద్రత విషయంలో పోలీస్ యాంత్రంగం చాలా కట్టు దిట్టమైన చర్యలను తీసుకుంటోంది. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఈసారి నోటిఫికేషన్ జారీ చేసింది. అమర్ నాథ్ యాత్రికులు ఆధార్ కార్డు నంబరును సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ అథెంటికేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (Social Welfare, Innovation, Knowledge) రూల్స్ 2020 లోని రూల్ 5 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ అనుమతి ప్రకారం.. అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే యాత్రికులు ఆధార్ కార్డు లేదా Aadhaar Proof అందించాలి. ఈ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి నిర్దిష్ట మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.
రెండేళ్ల తర్వాత అమర్ నాథ్ యాత్ర జరుగుతోంది. ఇది జూన్ ౩౦ న ప్రారంభమవుతుంది. ఇది ఆగస్టు 11 వరకు నడుస్తుంది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం అమర్ నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించారు.
Amarnath Yatra 2022: ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాలు..
1. అన్ని పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి.
2. అధికారులు ప్రయాణ భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని (Technology)ఉపయోగించాల్సి ఉంటుంది.
3. అధికారులు భద్రతా ఏర్పాట్లను సకాలంలో తనిఖీ చేయాలి.
4. రవాణా, వసతి, పరిశుభ్రత, విద్యుత్తు, నీరు, ఆరోగ్యం, దుకాణాలు, ఆహారాలు అందించబడతాయి.
ఇదిలా ఉంటే అమర్ నాథ్ యాత్రకు ముందు మళ్లీ ఉగ్రదాడి జరుగుతుందనే భయం వెంటాడుతోంది. శ్రీనగర్ లోని బెమినా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ఓ పోలీసు గాయపడ్డాడు. ఈ విషయాన్ని పోలీసులు మంగళవారం నాడు తెలియజేశారు. కశ్మీర్ జోన్ పోలీసుల కథనం ప్రకారం.. సోపోర్ ఎన్‌కౌంటర్ సమయంలో తప్పించుకున్న బృందం ఇది. వారి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్ ను "భారీ విజయం"గా పోలీసు అధికారులు అభివర్ణించారు.
లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు పాక్ ఉగ్రవాదులను Pak handlers పంపినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు మరో ట్వీట్ లో పేర్కొన్నారు. అతనితో పాటు ఒక స్థానిక మిలిటెంట్ ఉన్నాడు. పహల్గాం-అనంత్ నాగ్ కు చెందిన ఆదిల్ హుస్సేన్. అతను 2012 నుంచి పాకిస్తాన్ లో ఉన్నాడు. యాత్రపై దాడులు చేయడానికి మిలిటెంట్లను పంపారు.