కిలో వెంట్రుకల ధర అక్షరాల రూ. 8వేలు.. ఇంతకీ మనిషి వెంట్రుకలతో ఏం చేస్తారో తెలుసా?

Published : Dec 30, 2024, 12:38 PM IST
కిలో వెంట్రుకల ధర అక్షరాల రూ. 8వేలు.. ఇంతకీ మనిషి వెంట్రుకలతో ఏం చేస్తారో తెలుసా?

సారాంశం

గ్రామాల్లో వెంట్రుకలు కొంటాం అంటూ తిరిగే వారిని చూసే ఉంటాం. వెంట్రుకలు మొదట్లో చిన్న పిల్లలు ఆడుకునే బుగ్గలు ఇచ్చే వారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న పాత్రలు ఇస్తున్నారు. ఇంతకీ అసలు ఈ వెంట్రుకలను ఎందుకు కొనుగోలు చేస్తారు.? వీటితో ఉపయోగం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా..   

మనిషి శరీరంలో అత్యంత వేగంగా పెరిగే వాటిలో గోర్లు ఒకటైతే, తల వెంట్రుకలు మరొకటి. ఈ రెండు అత్యంత వేగంగా పెరుగుతూనే ఉంటాయి. అందుకే కచ్చితంగా నెల రోజులకు ఒకసారైనా కటింగ్ షాప్‌కి వెళ్లాల్సిందే. ఇక మహిళలు అయితే ఎప్పుడో ఒకసారి దేవుడి మొక్కు చెల్లించుకునే సమయంలో తలనీలాలు సమర్పిస్తుంటారు. అయితే ఈ వెంట్రుకలన్నీ ఏటు వెళ్తాయి.? అసలు వీటిని ఎందుకు ఉపయోగిస్తున్నారన్న సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా. దీని వెనకాల ఉన్న పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


వ్యాపారం.. 

ఎందుకు పనికిరావనుకునే మనిషి వెంట్రుకలతో కోట్ల వ్యాపారం జరుగుతుందని మీకు తెలుసా? మార్కెట్లో వెంట్రుకలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. వెంట్రుకల నాణ్యత, పొడవు ఆధారంగా వాటి ధరను నిర్ణయిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు తల దువ్వుకునే సమయంలో ఊడిపోయే జుట్టును ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తుంటారు. మహిళల జుట్టు పొడవుగా ఉంటుంది కాబట్టి వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే మహిళల జుట్టుతో పోల్చితే పురుషుల జుట్టు బలంగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. 


ధర ఎంతంటే.. 

ప్రస్తుతం మార్కెట్లో జుట్టుకు మంచి డిమాండ్ ఉంది. సహజంగా 8 నుంచి 12 అంగుళాల పొడవు ఉడే జుట్టు కిలో ధర రూ. 8 నుంచి 10 వేల వరకు పలుకుతుంది. అయితే ఈ ధర జుట్టు నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇక వెంట్రుకలను ఏం చేస్తారనే సందేహం రావడం సర్వసాధారణం. ఇలా సేకరించిన జుట్టును విగ్గుల తయారీలో ఉపయోగిస్తుంటారు. అలాగే పురుషుల జుట్టను సముద్రంలో ఓడలకు లంగరు వేయడానికి వాడుతారు. సాధారణంగా పురుషుల జుట్టు బలంగా ఉండడమే కాకుండా నీటిలో కరగదు అందుకే ఈ వెంట్రుకలతో తయారు చేసిన తాడును లంగరు వేయడానికి ఉపయోగిస్తుంటారు. అందుకే వెంట్రుకలకు ఇంత డిమాండ్‌ ఉంటుందన్నమాట. 

భారత్‌లోనే.. 

ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లోనే వెంట్రుకలకు సంబంధించి కోట్ల రూపాయల విలువైన వ్యాపారం జరుగుతోందని గణంకాలు చెబుతున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పటికీ భారతీయ మహిళలు పొడవాటి జుట్టును పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే విధంగా భారతీయ మహిళల వెంట్రుకలు నాణ్యత కూడా దీనికి కారణంగా చెబుతుంటారు. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడి రసాయనాలు ఎక్కువగా ఉపయోగించకపోవడమే. భారత్‌ నుంచి వెంట్రుకలు ఎక్కువగా చైనా, మలేషియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, బర్మాలకు ఎగుమతి అవుతుంటాయి. వెంట్రుకల వ్యాపారంలో ఎక్కువ భాగం దేవాలయాల నుంచి సేకరించిందే కావడం విశేషం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
Beauty Tips: సపోటా పండు తో మెరిసే అందం, మృదువైన జుట్టు.. ఎలాగో తెలుసా?