చాణక్య నీతి ప్రకారం.. మంచి భార్యకు ఉండే లక్షణాలు ఏంటో తెలుసా.?

By Narender Vaitla  |  First Published Dec 29, 2024, 4:51 PM IST

హిందువులకు చాణక్యుడు సుపరచితం అనే విషయం తెలిసిందే. భారతదేశంలో మౌర్య సామ్రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించిన గొప్ప తత్త్వవేత్త, రాజకీయవేత్త, ఆర్థికవేత్త అయిన చాణక్యుడు ఎన్నో విషయాలను ప్రస్తావించారు. ప్రస్తుత ఆధునిక సమాజానికి కూడా ఆయన చేసిన సూచనలు దిక్సూచిగా పనిచేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి చాణక్యుడు మంచి భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలని చెబుతుంటారు. అంటే ఇంటి నిర్మాణంలో ఇల్లాలి పాత్ర ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఇల్లాలు సరిగ్గా ఉంటేనే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. అందుకే ఒక మంచి భార్య ఎలా ఉండాలన్న విషయాన్ని చాణక్య నీతిలో స్పష్టంగా పేర్కొన్నారు. చాణక్య అభిప్రాయం ప్రకారం ఒక మంచి భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలి.? ఎలాంటి లక్షణాలు ఉంటే ఆ ఇల్లు నిలబడుతుంది? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

సంతోషం.. 

ఒక మంచి భార్య నిత్యం సంతోషంగా ఉండాలి. ఇంటిని నడిపించే భార్య సంతోషంగా ఉంటేనే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఆమె మాటలు చేసే పనులు ఇంట్లో ఉన్న వారికి సంతోషాన్ని పంచేవి ఉండాలి. అలాకాకుండా ఏదో కోల్పోయినట్లు నిత్యం విషాధంలో ఉంటూ ఇతరులను బాధ పెట్టకూడదని చాణక్య నీతిలో తెలిపారు. 

ధర్మ మార్గంలో.. 

Latest Videos

వివాహిత ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడవాలి. తనతో పాటు తన భర్తను, కుటుంబ సభ్యులను ధర్మ మార్గంలో నడిపించేలా చూడాలి. ఆచారాల పాట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. ఇంట్లో ఆధ్యాత్మిక విలువలను పెంచాలి. 

పరిశుభ్రత.. 

కొత్త వ్యక్తులు ఎవరు ముందుగా ఇంటికి వచ్చినా ఇంటి నిర్మాణం ఎంత గొప్పగా ఉందనే దానికంటే ఇల్లు పరిశుభ్రంగా ఉందా లేదా అన్న విషయాన్ని గమనిస్తారు. అందుకే ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలని చెబుతుంటారు. మంచి భార్య ఇంటిని నిత్యం పరిశుభ్రంగా ఉంటుంది. 

సహనం.. 

ఇంటి వ్యవహారాలను నడిపించే గృహిణికి సహనం ఎక్కువగా ఉండాలి. ఈ సహన గుణం కుటుంబంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. భార్య సహనం కోల్పోతే ఆ ఇల్లు సరైన దిశలో ముందుకు సాగదని అర్థం చేసుకోవాలి. 

నమ్మకం.. 

భార్య తన భర్తతో పాటు కుటుంబ సభ్యుల విషయంలో ఎప్పుడూ నమ్మకంగా ఉండాలి. మంచి భార్యకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాల్లో నమ్మకం ఒకటి. కుటుంబం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అస్సలు వమ్ము చేయకూడదు. 

సమస్యలను పరిష్కరించే నైపుణ్యం 

మంచి భార్యకు ఉండే మరో ప్రధాన లక్షణంలో సమస్యలను పరిష్కరించే నైపుణ్యం ఒకటి. కుటుంబలో ఏవైనా సమస్యలు వస్తే వాటిని సామరస్యంగా పరిష్కరించేందుకు చురుకుగా ఉండాలి. అందరినీ సమన్వయపరిచే తెలివితేటలు ఉండాలి. 

click me!