ఆడవారిలోనే ఇమ్యునిటీ పవర్ ఎక్కువ.. ఎందుకో తెలుసా ?

By Mahesh RajamoniFirst Published Jan 17, 2022, 11:56 AM IST
Highlights

స్త్రీ, పురుషుల శరీర నిర్మాణం వ్యవస్థ లోనూ, మానసిక స్థితిలో, హార్మోన్ల స్థాయిలు వంటి ఎన్నో అంశాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అందులోనూ పురుషుల కంటే మహిళలకే క్యాన్సర్, హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకర వ్యాధుల ఎకబారిన పడే అవకాశాలు చాలా తక్కువ. ముఖ్యంగా అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడంలో ఆడవారే ముందుంటారని తాజా అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. ఎందుకంటే..

స్త్రీ, పురుషుల శరీర నిర్మాణం వ్యవస్థ లోనూ, మానసిక స్థితిలో, హార్మోన్ల స్థాయిలు వంటి ఎన్నో అంశాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అందులోనూ పురుషుల కంటే మహిళలకే క్యాన్సర్, హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకర వ్యాధుల ఎకబారిన పడే అవకాశాలు చాలా తక్కువ. ముఖ్యంగా అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడంలో ఆడవారే ముందుంటారని తాజా అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. ఎందుకంటే..

ఆడవారు లేకపోతే ఈ లోకం లేదు. ఈ సృష్టి ఇలా మున్ముందుకు ఇలా సాగడానికి ఆడవారే ఆధారం. ఇంటి పనులు, పిల్లల పెంపకం, ఉద్యోగం అంటూ ఎన్నో రకాలుగా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విరామమనేదే లేకుండా పనిచేసే ఆడవాళ్లు సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ.. మగవారికి ఏమాత్రం తక్కువ కాదనే విధంగా జీవిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు మహిళల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించారు. 

ప్రమాదకరమైన రోగాలు, రకరకాల అంటు వ్యాధులను దూరం చేసే రోగ నిరోధక శక్తి మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువ ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. దీనికి కారణం జన్యు నిర్మాణంలో వచ్చిన మార్పేనని శాస్త్రవేత్తలే తేల్చి చెప్పారు. కాగా ఈ 
Genetic structure నే మైక్రోఆర్ఎన్ఏలు అని కూడా అంటారని శాస్త్రవేత్తలు వెళ్లడిస్తున్నారు. ఈ Micro RNA లు ఆడ X chromosome పై ఉంటుందని నిపుణులు వెళ్లడిస్తున్నారు. ముఖ్యంగా మైక్రోఆర్‌ఎన్‌ఏలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని నిపుణులు తేల్చి చెప్పారు. కాగా ఇవి ఆడవారిలోనే ఇమ్యూనిటీని పవర్ ను మరింత పెంచుతాయి. 

ఇవి అనేక అంటు వ్యాధులు, రకరకాల రోగాల నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి. వైరల్ Infections, ఎల్లో ఫీవర్, ఫ్లూ, డెంగ్యూ వంటి అనేక రోగాలతో పోరాడేందుకు టీకాలు వేసుకున్న మహిళల్లో Protective antibodies ను అధికంగా రిలీజ్ చేయడంలో మైక్రోఆర్‌ఎన్‌ఏలు లు ప్రధాన పాత్ర పోషిస్తాయని తేలింది.  అనేక వ్యాధుల నుంచి మనల్ని కాపాడే రక్షణ ప్రతిరోధకాలను మెరుగుపరిచే రోగ నిరోధక శక్తి మగవారిలో కంటే ఆడవారిలోనే అధికంగా ఉంటుంది. 

అయితే ఆడవారిలో  T-సెల్  యాక్టివేషన్ Production ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే ఇంటర్ ఫెరాన్ ఉన్నప్పటికీ కూడా బాగానే జరుతుంది. అయినా ఆటో ఇమ్యూన్ వ్యాధులైన Multiple sclerosis, Rheumatoid arthritis వంటి రోగాలు ఎక్కువగా ఆడవారికే సోకే ప్రమాదం ఉందని నిపుణులు వెళ్లడించారు. 

click me!