Omicron Diet: ఒమిక్రాన్ నుంచి త్వరగా కోలుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ ఆహారాన్ని తినండి..

By Mahesh RajamoniFirst Published Jan 17, 2022, 9:57 AM IST
Highlights

Omicron Diet: కొత్త వేరియంట్ Omicron ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ సమయంలో దీని బారిన పడి ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుందోనని ప్రజలు బిక్కు బిక్కు మంటు బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ మీరు ఒమిక్రాన్ బారిన పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?  ఏ ఫుడ్ తీసుకుంటే దీని నుంచి త్వరగా కోలుకుంటామో.. ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
 

Omicron Diet: కరోనా వైరస్ రోజు రోజుకు తన ప్రతాపాన్ని చూపిస్తోంది. సునామిలా విరుచుకుపడి ప్రజల ప్రాణాలను హరించి వేస్తోంది. రోజు రోజుకు తన కొత్త కొత్త రూపాలతో ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీని బారిన పడి ఇంకెంత మంది తమ ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుందోనంటూ బిక్కు బిక్కుమంటు బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులోనూ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోంది. దీనికి తోడు థర్డ్ వేవ్ కూడా ప్రపంచ దేశాలను చుట్టిముట్టింది. ఈ థర్డ్ వేవ్ కేసులే దారుణంగా పెరుగుతున్నాయనుకున్న వేళ ఒమిక్రాన్ కేసులు కూడా అధిక మొత్తంలో నమోదవుదవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల వ్యాప్తంగా థర్డ్ వేవ్ వేగంగా విస్తరిస్తూ ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోంది. 

దీని కారణంగా దేశంలోనే చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పలు ఆంక్షలను విధించాయి. ఈ ఒమిక్రాన్ మూలంగా హోటల్లు, రెస్టారెంట్లలకు వెళ్లి తినే సౌకర్యాన్ని కూడా  ప్రభుత్వం రద్దు చేసింది. ముఖ్యంగా అత్యవసరమైతేనే ప్రజలు తమ ఇండ్ల నుంచి బయటకు రావాలని ఆదేశాలను జారీ చేసింది. ప్రజలకు ఏ ప్రమాదం లేకుండా తగిన జాగ్రత్తలు, సూచనలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో ప్రజలు ఎక్కువగా భయపడాల్సిన పని లేదు. కానీ ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. అందులోనూ ఇమ్యూనిటీ(Immunity)పవర్ ను పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే మీరు తీసుకునే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీరు ఒమిక్రాన్ బారిన పడ్డా దాని నుంచి సులభంగా కోలుకోవాలంటే పోషకాలున్న ఆహారం తప్పని సరి. మరి ఇలాంటి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

కరోనా కష్టకాలంలో బయటి ఫుడ్ కంటే ఇంట్లో వండిన ఆహారాన్నే తినడం ఉత్తమం. ఎందుకంటే ఇంట్లో వండిన ఆహారంలో అనేక పోషకాలు, విటమిన్లు అధికంగా లభిస్తాయి. దానితో పాటుగా ఈ ఆహారం బయట లభించే ఫుడ్ కంటే ఎక్కువు టేస్టీగా ఉంటుంది. కాగా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన నీళ్లు తాగడం ఎంతో ముఖ్యం. మన ఆరోగ్యం మనం తాగే నీటిపైనే ఆధారపడి ఉంటుంది.  అయితే బాటిల్ నీళ్లను తాగకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీళ్లతో పాటుగా నిమ్మరసం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మీ శరీరం ఎప్పుడూ డీ హైడ్రేషన్ కు గురికాకుండా జాగ్రత్తపడాలి. రోజుకు కనీసం 10 గ్లాసుల నీటిని తాగడం తప్పని సరి.

మీరు తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఈ ఫైబర్  వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆకలిని తగ్గించడంలో ఇది ముందుంటుంది. దీని మూలంగా బరువు పెరిగే అవకాశమే లేదు. కాగా ఫైబర్ ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు,  తృణధాన్యాలు, పప్పుల్లో లభిస్తుంది. ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీ రోజు వారి ఆహారంలో ఉప్పు క్వాంటిటీని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే అధికంగా ఉప్పును తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆహారంలో ఉప్పును తక్కువగా వాడటం అలవాటు చేసుకుని  ఆరోగ్యంగా ఉండండి. వీటితో పాటుగా Alcohol తాగే అలవాటుంటే వెంటనే మానుకోండి. ఇది ఆరోగ్యానికి హానికం. దీన్నితాగడం వల్ల Immunity power తగ్గుతుంది. అందుకే ఆల్కహాల్ కు దూరంగా ఉండటం మంచిది.    

click me!