Banana Side Effects: ఈ సమస్యలున్న వాళ్లు అరటిపండును తింటే అంతే సంగతి.. ఎందుకంటే?

Published : Jan 16, 2022, 04:04 PM IST
Banana Side Effects: ఈ సమస్యలున్న వాళ్లు అరటిపండును తింటే అంతే సంగతి.. ఎందుకంటే?

సారాంశం

Banana Side Effects: అరటిపండులో ఎన్నో ఆరోగ్యకరమై ప్రయోజనాలు పొందవచ్చు. దీన్ని తింటే ఎన్నో రకాల రోగాలకు చెక్ పెట్టొచ్చు. అయితే ఈ పండు తినడం వల్ల కూడా అనేక సమస్యలు తలెత్తుతాయి. అవేంటంటే..? 

Banana Side Effects:మార్కెట్లో చాలా చవకగా లభించే మేలైన పండ్లలో అరటి పండు రారాజు. ఈ పండు తక్కువ ధరకే లభించినా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పండులో విటమిన్ B6, పొటాషియం, విటమిన్ సి, మాంగనీస్, మెగ్నీషియం, బయోటిన్, రాగి పుష్కలంగా లభిస్తాయి. అందులోనూ ఈ పండులో కొవ్వుశాతం 0 శాతంగా ఉంటుంది. ఈ పండును తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా అనేక అనారోగ్య సమస్యలను సైతం తరిమికొట్టవచ్చు. ఈ పండు అజీర్తి సమస్యకు చక్కటి చిట్కాలా ఉపయోగపడుతుంది, అలాగే అధిక రక్తపోటు, ఆస్థమా, మధుమేహం, జీర్ణ సమస్యలు, క్యాన్సర్ వంటి అనేక సమస్యలను నిరోధించడంలో ముందుంటుంది. అరటి వల్ల ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. అందుకే వైద్యులు కూడా ఈ పండ్లను రోజూ తినాలని సలహానిస్తుంటారు. అరటిపండును తింటే మనకు ఎక్కువ మొత్తంలో పొటాషియం లభిస్తుంది. అలాగే దీనిలో ఫైబర్ (Fiber) ఎక్కువగా ఉండటంతో బీపీని నియంత్రణలో ఉంచుతుంది. అయితే ఎన్నో ప్రయోజనాలున్న ఈ Banana ను తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. మలబద్ధకం: అరటిపండ్లు మోతాదుకు మించి తింటే మలబద్ధకం సమస్య వస్తుంది. ఎందుకంటే దీనిలో ఉండే టానైట్ యాసిడ్ Digestive system పై తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. అందుకే మలబద్ధకం సమస్యతో బాధపడేవారు అరటి పండ్లను తక్కువగా తినడం ఉత్తమం.  2. ఎసిడిటీ.. అరటిపండులో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తిన్నది తొందరగా జీర్ణం కాదు. అందులోనూ ఈ పండు తింటే కడుపులో గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. సో ఈ పండును మోతాదులో తినడం మంచిది. 

3. అధిక బరువు.. banana లో సహజ చక్కెర, ఫైబర్ లు పుష్కలంగా లభిస్తాయి. కాగా ఈ పండును తింటే ఆటోమెటిక్ గా బరువు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకని బరువు తగ్గాలనుకునే వారు ఈ పండ్లకు దూరంగా ఉండటం బెటర్. 4. మైగ్రేన్.. మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు ఈ అరటి పండుకు దూరంగా ఉండటం మంచిది . ఎందుకంటే మైగ్రేన్ ఉన్నవారు అరటిని తినడం వల్ల ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. ఎలా అంటే.. అరటిపండులో టైరమైన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మైగ్రేన్ సమస్యను ఇంకా తీవ్రతరం చేయడంలో సహాయపడుతుంది. దీంతో మైగ్రేన్ ఇంకా పెరుగుతుంది. అందుకే ఈ సమస్య ఉన్న వారు అరటిపండు జోలికి పోకూడదు. 

5. షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది.. డయాబెటీస్ తో బాధపడేవారు అరటిపండును అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ పండులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. ఇది blood లో షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. అందుకే ఈ వ్యాధి గ్రస్తులు అరటిని తక్కువ మోతాదులో తినాలని వైద్యులు సూచిస్తున్నారు. 6. అలర్జీని.. అలర్జీ సమస్యతో బాధపడేవారు అరటి పండ్లను తినకపోవడం ఉత్తమమైన పని. ఎందుకంటే ఈ పండును వారు తినడం మూలంగా అలర్జీ సమస్య మరింత పెరుగుతుంది కాబట్టి.  7. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు అరటి పండ్లను పూర్తిగా తినకూడదు. ఎందుకంటే ఈ పండులో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. దానివల్ల హైపర్ కలేమియా వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Blouse Designs: కళ్లు చెదిరిపోయేలా హెవీ బ్లవుజు డిజైన్లు
డిసెంబర్ లో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇది