ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు, ఎప్పుడు, ఎలా మొదలైంది? ఈ రోజునే ఎందుకు జరుపుకుంటున్నాం?

By Mahesh RajamoniFirst Published Mar 8, 2022, 10:07 AM IST
Highlights

International Women's Day: ఇప్పటికే మీ వాట్సాప్ కు, ఫేస్ బుక్ కు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలంటూ మేసేజ్ లు వచ్చే ఉంటాయి కదా. ఇంతకీ ఈ ఉమెన్స్ డే ఎందుకు పుట్టుకొచ్చిది. ఎప్పుడు మొదలైంది? ఈ వేడుకలు జరుపుకోవడానికి వెనక ఏదైనా కారణం ఉందా..?  మార్చి 8 వ తారీఖునే మహిళలకు గుర్తింపునిచ్చే ప్రత్యేక రోజుగా ఏర్పాటు చేయడానికి అసలు కారణాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. 

అంతర్జాతీయ ఉమెన్స్ డే ఎప్పుడు ప్రారంభమైంది ?

1908 సంవత్సరంలో మహిళా దినోత్సవ పుట్టుకకు బీజం పడింది. మహిళా కార్మికులు చేసిన ఉద్యమం నుంచే ఈ రోజు పుట్టుకొచ్చింది. ఓటు హక్కు కోసం, మెరుగైన జీతం, తక్కువ పనిగంటల కోసం సుమారుగా 15 వేల మంది ఆడవారు న్యూయార్క్ సిటీలో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన ఫలితంగా 1909 సంవత్సరంలో కార్మిక మహిళల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని సోషలిస్టు పార్టీ మార్చి 8 తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. 

అంతర్జాతీయ ఉమెన్స్ డేను నిర్వహించాలన్నది మాత్రం క్లార జెట్కిన్ అనే మహిళలక ఆలోచనే. 1910 సంవత్సరంలో కోపెన్ హెగన్ అనే నగరంలో 'International Conference of Working Women'అనే సదస్సులో అంతర్జాతీయ ఉమెన్స్ డేను జరుపుకోవాలన్న ప్రతిపాదనను చేశారు. ఈ సదస్సుకు సుమారుగా 17 దేశాల నుంచి వచ్చిన వంద మంది ఆడవారు ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. అప్పటి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 

అయితే 1911 సంవత్సరంలో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, డెన్మార్ంక్ దేశాల్లోనే మొదటగా అంతర్జాతీయ ఉమెన్స్ డేను జరుపుకున్నారు. కాగా 2011 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శతాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి కూడా. ఇక ఈ 2022 తో 111 వ ఇంటర్నేషన్ ఉమెన్స్ డే ను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 

అయితే ఇంటర్నేషన్ ఉమెన్స్ డేకు 1975 ఏడాదిలో ఐక్యరాజ్యసమితి నుంచి అధికారిక గుర్తింపు లభించింది. అంతేకాదు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్ తో ఈ ఉమెన్స్ డేను సెలబ్రేట్ చేస్తుంది. ఈ ఏడాది థీమ్  ‘లింగ వివక్షతను తరిమి కొట్టండి, లింగ సమానత్వాన్నిసాధించండి.’ “సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం” అంటూ ఐక్యరాజ్య సమితి  పిలుపునిచ్చింది. 

లింగ సమానత్వం రావాలని, ఎలాంటి పక్షపాతం, వివక్షలు లేని ప్రపంచంగా మారాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది. కాగా ప్రపంచ కార్మిక శక్తికి.. పనిచేసే వయసున్న ఆడవారిలో సగం మంది మాత్రమే ప్రాతినిథ్యం విహిస్తున్నారని గణాంకాలు పేర్కొంటున్నాయి. 

నిజానికి ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని.. మహిళల పట్ల ఇంకా కొనసాగుతున్న అసమానతలపై నిరసనలు, ధర్నాలు నిర్వహించడం దీని వెనకున్న కారణం. కానీ ఈ రోజున ఆడవారు ఆర్థిక రంగంలో , రాజకీయ , సామాజిక రంగంలో ఎంతగా ఎదిగారో లెక్కలు వేసి  సెలబ్రేట్ చేసుకునే రోజుగా మారింది.  

కానీ నేటికీ మన దేశంలో మహిళల  పట్ల ఇంకా చిన్న చూపు కొనసాగుతూనే ఉంది. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఆడవారి పట్ల వివక్షమాత్రం పోవడం లేదు. ఆఫీసుల్లో, పనిచేసే వివిధ చోట్ల మహిళల పట్ల వ్యతిరేక భావన, చిన్నచూపు, లైంఘిక వేధింపులు మాత్రం ఆగడం లేదు. ఇక సమానత్వం విషయానికొస్తే.. అది కొన్నిచోట్లకు మాత్రమే పరిమితమైంది. అయినా కానీ మహిళలు వెనక్కి తగ్గకుండా తమ సత్తాను చాటుకుంటున్నారు. 

మార్చి 8 తారీఖునే ఎందుకు? 

ఆహారం, శాంతి ని డిమాండ్ చేస్తూ 1917  యుద్దం జరుగుతున్న వేళ  మహిళలు సమ్మే చేశారు. ఈ సమ్మే నాలుగో రోజున రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 తన పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వమే మహిళలకు ఓటు హక్కును ప్రకటించింది. జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 వ తేదీనే ఆ మహిళలు సమ్మెకు దిగారు. ఈ తేదీ గ్రెగోరియన్ క్యాలెంటర్ ప్రకారంగా చూస్తే ఫిబ్రవరి 23 వ తేదీ మార్చి 8 వ తేదీ అవుతుంది. అందుకే మహిళలు సమ్మేకు దిగిన మార్చి 8 వ తేదీని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 

click me!