కలలు సర్వసాధారణం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు రావడం మాములే. మనం కోరుకున్నట్లు కలలు రావడం మన ప్రమేయం లేకుండానే మనకు కలలు వస్తుంటాయి. అయితే మన ప్రమేయం లేకుండా వచ్చే కలలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని పండితులు, శాస్త్రాలు చెబుతుంటాయి. కలలో మనకు కనిపించే ఒక్కో అశానికి ఒక్కో రకమైన అర్థం ఉంటుంది. అలాంటి ఒక కల, దానివల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయి లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కలలో కనిపించే అంశాలు మనం నిజజీవితంలో ఎదుర్కొన్న అనుభవాల ప్రతిచర్యగా మానసిక నిపుణులు చెబుతున్నారు. మన మనసులో గూడుకట్టుకున్న అంశాలే కలల రూపంలో ప్రతిబింబిస్తాయని చెబుతుంటారు. ప్రత్యేకంగా స్వప్నశాస్త్రంలో ఇలాంటి అంశాలకు సంబంధించి ఎన్నో వివరాలను పేర్కొన్నారు. అదే విధంగా పండితులు సైతం ఇలాంటి కొన్ని విషయాలను తెలిపారు. కలలో ఒకవేళ నగ్నంగా ఉన్న స్త్రీ కనిపిస్తే ఎలాంటి పరిణమాలు జరుగుతాయంటే.
ఒకవేళ స్త్రీలు తమను తాము కలలో నగ్నంగా చూసుకున్నట్లయితే. మీ గురించి ఏదో రహస్యాన్ని మీరు దాచి పెడుతున్నారని అర్థం చేసుకోవాలి. మీ వ్యక్తిగత జీవితానికి లేదా మీ వృత్తిపరమైన విషయానికి సంబంధించిన వివరాలను ఎవరికీ పంచుకోకుండా ఉంటున్నారన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో మీరు ఏదో తెలియని భయంతో బాధపడుతున్నారని కూడా అర్థం చేసుకోవాలి. ఏదో తెలియని భయం మిమల్ని వెంటాడుతుందని అర్థం చేసుకోవాలి.
undefined
ఒకవేళ పురుషులకు ఎవరైనా స్త్రీ కలలో నగ్నంగా ఉన్నట్లు కనిపిస్తే. సదరు స్త్రీ పట్ల మీరు ఎంతో ఆకర్షితులవుతున్నారని అర్థం. ఆ మహిళ మీకు మానసికంగా దగ్గరయ్యారని, వారి సాన్నహిత్యం కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. అయితే ఇది నెగిటివ్‌గా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనిషి మెదడులో ఏర్పడ్డ ఇష్టానికి ప్రతీరూపమే ఇలాంటి కలలు రావడానికి కారణమని అంటున్నారు.
మీకు కలలో నగ్నంగా ఉన్న స్త్రీతో మాట్లాడుతున్నట్లు కల వస్తే అది కూడా మంచికి సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఇది మంచి ఆరోగ్యం, ఐశ్వర్యానికి సూచికగా చెబుతున్నారు. గతకొంత కాలంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి త్వరలోనే ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నయని అర్థం చేసుకోవాలి. ఇక మహిళ నగ్నంగా కనిపిస్తే మీకు నచ్చిన వ్యక్తి సాన్నిహిత్యం కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి.
ఒకవేళ కలలో మీకు అంతకు ముందు పరిచయం లేని వ్యక్తి కలలో నగ్నంగా కనిపిస్తే మీ ప్రేమ జీవితం మొదలుకాబోతోందని అర్థం చేసుకోవాలి. మీరు త్వరలోనే ప్రేమలో పడబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే మీకు కావాల్సిన జీవిత భాగస్వామి దొరికే సమయం దగ్గరపడుతోందని అర్థం. మీరు ఓ ఇంటి వారు కాబోతున్నారని, వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టే ఘడియలు దగ్గర పడ్డాయని అర్థం చేసుకోవాలి.
నగ్నంగా ఉన్న మహిళ దుస్తులతో కవర్ చేసుకుంటున్నట్లు కనిపిస్తే మీ వ్యక్తిత్వం చాలా గొప్పదని అర్థం చేసుకోవాలి. మహిళలపై మీకు మంచి అభిప్రాయం ఉంటుందని అర్థం. ముఖ్యంగా మహిళల విషయంలో మీరు హుందాగా వ్యవహరిస్తారు. తోటి మహిళల విషయంలో చాలా గౌరవంగా ఉంటారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే మనస్తత్వంతో ఉంటారని అర్థం చేసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రంతో పాటు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
ఇది కూడా చదవండి: ఇది కూడా చదవండి: https://telugu.asianetnews.com/entertainment/actress-who-turns-as-producers-in-tollywood-industry-vnr-sp6xgu