చాలా మంది బరువు తగ్గడానికి ఎంతో కష్టపడతారు. కానీ కొంచెం కూడా తగ్గరు. అయితే మీరు రాత్రిపూట ఒక చిన్న పనిచేస్తే చాలు చాలా సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే?
బరువు తగ్గాలంటే ఖచ్చితంగా తినే ఫుడ్ పై కంట్రోల్ ఉండాలి. ఇది లేకపోతేనే బరువు తగ్గడానికి బదులుగా మరింత పెరిగిపోతారు. బరువు తగ్గాలంటే హెల్తీ ఫుడ్ ను తినాలి. కానీ అంత సమయం ఈ రోజుల్లో చాలా తక్కువ మందికే ఉంది. చాలా మంది బిజీ వర్క్ షెడ్యూల్ ఉండటం వల్ల సరైన ఆహారాన్ని తినలేకపోతున్నారు. ఆకలి వేస్తే ఏదో ఒకటి తినడం కడుపు నింపుకోవడం చేస్తున్నారు. కానీ దీనివల్లే బరువు విపరీతంగా పెరుగుతారు. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
బరువు తగ్గాలని ఉన్నా.. దీనికోసం అంత సమయం కేటాయించలేని వారు రాత్రిపూట ఒక్క పనిచేస్తే సులువుగా బరువు తగ్గుతారు. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. అందుకే రాత్రిపూట ఏం చేస్తే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
undefined
ఇలా ప్రతి రాత్రీ చేయండి
నిపుణుల ప్రకారం.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే మీరు బరువు తగ్గడానికి కష్టపడాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ సమయం లేకే చాలా మంది బరువు పెరిగిపోతున్నారు. అయితే ఇలాంటి వారు రాత్రిపూట ఎట్టి పరిస్థితిలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి కార్భోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తినకూడదు. ఎందుకంటే రాత్రిపూట కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఫుడ్ ను తింటే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాగే సరిగ్గా నిద్రపట్టదు. అలాగే మీ శరీరంలో కొవ్వు నిల్వలు కూడా బాగా పెరుగుతాయి. ఇవన్నీ మీరు మరింత బరువు పెరగడానికి దారితీస్తాయి. అంతేకాదు మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే సాయంత్రం 6 గంటల తర్వాత కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నం, మైదా, రోటీ వంటివి తినకండి.
ప్రోటీన్ ఫుడ్ ను తినండి
బరువు పెరగొద్దంటే రాత్రిపూట కార్బోహైడ్రేట్ ఫుడ్ ను మానేయడంతో పాటుగా.. సాయంత్రం 6 గంటలకు ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఫుడ్ ను ఖచ్చితంగా తినాలి. ప్రోటీన్లు మెండుగా ఉండే ఆహారాలను రోజూ సాయంత్రం 6 గంటలకల్లా తింటే మీరు ఈజీగా బరువు తగ్గిపోతారు. ఎందుకంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచి మీరు మధ్యమధ్యలో అనవసరమైన ఆహారాలు తినకుండా చేస్తుంది. ఇది మీరు బరువు తగ్గడాన్ని సులువు చేస్తుంది.
సాయంత్రం 6 గంటలకల్లా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల కల్లా తినడం వల్ల మన శరీరం సక్రమంగా పనిచేస్తుంది. దీంతో మన జీవక్రియ, జీర్ణక్రియ రెండూ మెరుగ్గా పనిచేస్తాయి. దీంతో మీ శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉండదు. అంతేకాదు ఇది మీ కాలెయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే అంత తొందరగా తినడం వల్ల మీ జీర్ణక్రియకు విశ్రాంతి లభిస్తుంది. దీంతో మీ గట్ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రాత్రిపూట రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం కూడా ఉండదు. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ అలవాటు వల్ల బరువు పెరగడం, డయాబెటీ