Chia Seeds: నెల రోజులు చియా సీడ్స్ వాటర్ తాగితే ఏమౌతుంది.?

Published : Jun 06, 2025, 11:59 AM IST
How-to-eat-chia-seeds

సారాంశం

చియా సీడ్స్ లో మన ఆరోగ్యానికి అవసరం అయ్యే పోషకాలు చాలా ఉంటాయి. సాధారణంగా ఈ చియా సీడ్స్ ని ఉదయం పూట తీసుకుంటారు. అది కూడా నీటిలో నానపెట్టి తీసుకుంటారు.

చియా సీడ్స్ ఆరోగ్యానికి ఎంత మంచివో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది బరువు తగ్గడానికి ఈ చియా సీడ్స్ ని తీసుకుంటూ ఉంటారు. మరి, ఈ చియాసీడ్స్ ని ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా నెల రోజుల పాటు తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

చియా సీడ్స్ లో మన ఆరోగ్యానికి అవసరం అయ్యే పోషకాలు చాలా ఉంటాయి. సాధారణంగా ఈ చియా సీడ్స్ ని ఉదయం పూట తీసుకుంటారు. అది కూడా నీటిలో నానపెట్టి తీసుకుంటారు. బరువు తగ్గడం కాకుండా, వీటి వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

కడుపు నిండిన భావన.. ఆకలి తగ్గిస్తుంది..

చియా సీడ్స్ లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చియాసీడ్స్ ని తీసుకోవడం వల్ల మనకు కడుపు ఎక్కువ సేపు నిండిన అనుభూతి కలిగిస్తుంది.దీని వల్ల వెంటనే ఆకలి అవ్వదు. ఫలితంగా.. మళ్లీ మళ్లీ తినాలి అనే కోరిక కలిగించదు. దీని వల్ల కేలరీలు చాలా తక్కువగా తీసుకుంటాం. దీని వల్ల బరువు తగ్గడం చాలా సులభం అవుతుంది. నెలరోజులు కంటిన్యూస్ గా తీసుకుంటే చాలా తొందరగా ఎక్కువ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

చియా విత్తనాల్లో ఉండే అద్భుతమైన కరిగే ఫైబర్ మలాన్ని మృదువుగా చేసి, ప్రేగుల కదలికలను క్రమబద్ధం చేస్తుంది. రోజూ ఒక నెల పాటు తీసుకుంటే మలబద్ధక సమస్యలు తగ్గిపోతూ, మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చియా విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే రక్తపోటు నియంత్రణ, గుండె ఆరోగ్య పరిరక్షణ వంటి వాటిలో నెల రోజుల తినడం వల్ల గణనీయమైన తేడా కనిపిస్తుంది.

డీ హైడ్రేషన్ సమస్య ఉండదు..

చియా విత్తనాలు నీటిని పీల్చుకునే గుణం కలిగి ఉంటాయి. ఈ గుణం వల్ల శరీర హైడ్రేషన్ స్థాయి మెరుగవుతుంది. ఒక నెల పాటు చియా నీటిని తీసుకుంటే, నీరసం అనేది ఉండదు. శరీరం చాలా హైడ్రేటెడ్ గా ఉంటుంది.

రక్తంలో షుగర్ లెవల్స్..

చియా విత్తనాల్లో ఉండే జెల్ లాంటి పదార్థం కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. నెల రోజుల పాటు చియా నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండే అవకాశముంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది.

చర్మ ఆరోగ్యం..

చియా విత్తనాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు నెల రోజులు తీసుకుంటే.. చర్మంలో తేడా మీరు క్లియర్ గా చూడగలరు. చర్మం తాజాగా, మెరిసేలా మారడమేగాక వృద్ధాప్య లక్షణాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. మీ వయసు తగ్గిపోతుంది.

బరువు తగ్గించే చియా సీడ్స్..

బరువు తగ్గాలనుకునేవారికి చియా విత్తనాలు సహాయపడతాయి. ఇవి ఆకలి నియంత్రణలో సహకరించి, ఆహార పరిమాణాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నెలరోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే బరువులో తేడా మీకు క్లియర్ గా తెలుస్తుంది.

ఫైనల్ గా..

నెల రోజుల పాటు చియా విత్తనాలను మితంగా తీసుకుంటే, శరీరానికి శక్తి, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, చర్మ మెరుగు, బరువు నియంత్రణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, సమతుల్య ఆహారం, సరైన వ్యాయామం కూడా ఉంటేనే పూర్తిగా ఉపయోగపడుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రాత్రిపూట అస్సలు తినకూడని పండ్లు ఇవే!
ఉదయాన్నే ఈ వాటర్ తాగితే బరువు తగ్గడం ఈజీ