
బక్రీద్ ను మనదేశంలో జరపడానికి ముందే సౌదీ అరేబియాలో నిర్వహిస్తారు. అక్కడ ఇండియా కంటే ఒకరోజు ముందే ఈ పండగ జరుపుకొంటారు.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం బక్రీద్ పండుగ ధుల్ హిజ్జా నెలలోని 10వ తేదీన వస్తుంది. ఇది ఈ లూనార్ క్యాలెండర్‌లో చివరి నెల. ఈ సంవత్సరం సౌదీ అరేబియాలో అరఫాత్ డేను జూన్ 5వ తేదీన (గురువారం) నిర్వహించారు. అరఫాత్ డే లేదా యౌమ్ అల్ అరఫా, ధుల్ హిజ్జాలో 9వ రోజు జరుగుతుంది. ఇది ఇస్లామిక్ క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన రోజు.
భారతదేశంలో ఈ సంవత్సరం బక్రీద్ పండుగను శనివారం, జూన్ 7న జరుపుకోనున్నారు. నెలవంక కనిపించిన తర్వాత నిర్వహిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ చంద్ర చక్రాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పండుగ తేదీ దేశాలలో మారుతూ ఉంటుంది. సౌదీ అరేబియా, ఒమన్, యుఎఇ, ఇండోనేషియా వంటి దేశాలలో ఈద్-ఉల్-అధా ఒక రోజు ముందుగా అంటే జూన్ 6న నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడానికి సందేశాలు, శుభాకాంక్షలు ఇప్పుడు తెలుసుకుందాం.
మీ త్యాగం అల్లా స్వీకరించాలి. మీ ప్రార్థనలు ఫలించాలని ఆశిస్తున్నాం.
ఈ ఈద్ మీకు విజయానికి దారి చూపే అవకాశాలను కలిగించాలి.
మీ నమ్మకం, భక్తి.. శాంతి, ఆనందం, విజయాన్ని అందించాలి.
ఈ పవిత్ర రోజు మీ సకల పాపాలు క్షమించబడాలని ప్రార్థిస్తున్నాను.
ఇబ్రహీం భక్తిని గుర్తు చేస్తూ మీ విశ్వాసం దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాను.
ప్రియమైన కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్! మీరే నా బలం.
మిత్రుల్లారా, మీతో ఈద్ జరపడం ఎప్పుడూ ప్రత్యేకమే.
మన బంధం ప్రేమతో నిండాలని ఈద్ సందేశం.
మీ నవ్వు ఈద్ వేడుకను ఇంకా అందంగా మార్చుతుంది.
మీలాంటి మిత్రులతో ఈద్ ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ ఈద్ రోజున మీరు దగ్గర లేకపోయినా నా ప్రార్థనల్లో ఉంటారు.
మీరు ఎక్కడ ఉన్నా, నా మనసు మీతోనే ఉంది. ఈద్ ముబారక్!
దూరం మన బంధాన్ని బలపరచాలి.
ఈ ఈద్ మనలను మరింత దగ్గర చేయాలి.
ప్రతి ఇంటి రాణికి ఈద్ ముబారక్!
మీరు ఇచ్చే ప్రేమ, త్యాగాలకు నమస్కారం. ఈద్ శుభాకాంక్షలు!
మీ నిబద్ధతకు అల్లా బహుమతులు ఇవ్వాలి.
శక్తివంతమైన మహిళలందరికీ ఈద్ శుభాకాంక్షలు!
మీ త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది – ఈద్ ముబారక్!
దయ, విశ్వాసంతో ముందుండే మగవాళ్లకు ఈద్ శుభాకాంక్షలు!
కుటుంబాన్ని రక్షించేవారికి అల్లా ఆశీర్వాదం కలగాలి.
మీరు చూపే బలానికి నా నమస్కారం.
మీరు తీసుకునే ప్రతి అడుగు అల్లా మార్గంలో ఉండాలని ప్రార్థిస్తున్నాను.
ఆహారం లేకుండా ఉండే మనుషుల కోసం ప్రార్థిద్దాం.
నిరాశ్రయులకి ఆశ్రయం కలగాలని కోరుకుందాం.
మన ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకుందాం.
ప్రతి ప్రాణికి ఆనందం, ప్రేమ కలగాలని ఆశిద్దాం.
ఒకరి నవ్వుకైనా మనమే కారణం కావాలి – ఈద్ ముబారక్!
ఈద్ మన జీవితంలో కొత్త ఆశలు, వెలుగులు తేవాలి.
మీ ఇంట్లో ఆనందం, మీ హృదయంలో విశ్వాసం నిండాలని కోరుకుంటున్నాను.
మీరు అడిగిన ప్రతి ప్రార్థనకు అల్లా సమాధానమివ్వాలని కోరుకుంటున్నాను.