నోరు బాగుంటే.. ఊరు బాగుంటుందనే సామెత ఉండనే ఉంది. అయితే నోరు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందనేది సామెత కాదు నిజం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నోటి ఆరోగ్యం బాగుండాలని నిపుణులు సైతం చెబుతుంటారు. అందుకే కచ్చితంగా నోటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటారు. బ్రషింగ్‌తో పాటు కొందరు మౌత్ వాష్‌లను సైతం ఉపయోగిస్తుంటారు. అయితే మౌత్ వాష్ ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న విషయంపై పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..
మనలో చాలా మందికి మౌత్ వాష్‌లను ఉపయోగించే అలవాటు ఉంటుంది. బ్రషింగ్‌తో పాటు నోటి శుభ్రత కోసం ఈ విధానాన్ని కూడా ఫాలో అవుతుంటారు. మార్కెట్లో రకరకాల కంపెనీలకు చెందిన మౌత్ వాష్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి నోటిని పూర్తిగా శుభ్రం చేసి, బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి. దీంతో నోటి ఆరోగ్యం మెరుగవుతుంది. అయితే మౌత్ వాష్‌లను ఉపయోగించడం వల్ల ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ప్రముఖ బ్రిటీష్ సర్జన్ ఇటీవల తన పోడ్‌కాస్ట్‌లో ఈ విషయమై పలు సూచనలు చేశారు. మౌత్ వాష్ ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. అయితే మౌత్ వాష్ కచ్చితంగా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడంలో నిర్దిష్ట ఆధారాలు కనుగొనబడలేదని, అయితే ఇది కచ్చితంగా క్యాన్సర్ ముప్పును పెంచుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. సాధారణంగా మౌత్ వాష్‌ల తయారీలో ఆల్కహాల్‌ను ఉపయోగిస్తుంటారు. ఈ కారణంగా ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీర్ఘకాలంగా మౌత్ వాష్‌లను ఉపయోగించే వారిలో నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు లేదా 40 సంవత్సరాలకు పైగా మౌత్‌వాష్‌ను ఉపయోగించడం వల్ల నోటి క్యాన్సర్‌కు దారితీయవచ్చని ఒక అధ్యయనంలో తేలింది.
undefined
సాధారణంగా మౌత్ వాష్ నోటిలో బ్యాక్టీరియాను తగ్గించడంలో ఉపయోగపడుతుందని తెలిసిందే. అయితే మౌత్ వాష్ వినియోగం నోటిలో బ్యాక్టీరియా తగ్గడం పక్కన పెడితే పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. నోటిలో పెరిగే ఈ బ్యాక్టీరియా చిగుళ్ల వ్యాధి, గొంతు క్యాన్సర్, కడుపు క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశ ఉందని నిపుణులు చెబుతున్నారు. చిగుళ్ల వ్యాధి కారణంగా శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. మౌత్ వాష్‌ల ఉపయోగం గొంతు, కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.
మౌత్ వాష్‌లను అధికంగా ఉపయోగించే వారిలో వచ్చే చిగుళ్ల వ్యాధి ఇన్ఫక్షన్‌కు దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో చిగుళ్ల వాపు నోటి క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చిగుళ్ల సమస్యల కారణంగా పుట్టుకొచ్చే బ్యాక్టీరియా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిచే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మౌత్ వాష్లో ఉండే ఫ్యూసోబాక్టీరియం, న్యూక్లియేటమ్, స్ట్రెప్టోకోకస్ వంటివి నోటిలో బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. ఇది నోటిలో కణితి పెరిగేందుకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.
మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన మౌత్ వాష్‌లను ఉపయోగించే కంటే సహజసిద్ధమైన మౌత్ వాష్‌లను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కలబంద బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. కలబంద చిగుళ్లు నుంచి వచ్చే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది. కలబంద రంసలో నీరు కలుపుకొని పుకిలిస్తే నోరు శుభ్రంగా మారుతుంది. కొబ్బరి నూనె కూడా నేచురల్ మౌత్ వాష్‌గా ఉపయోగపడుతుంది. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది పళ్లను దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇందులోని లారిక్ యాసిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌గా పనిచేస్తుంది. నోటిలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. చెడు శ్వాసకు చెక్ పెట్టడంలో తోడ్పడుతుంది. ఇక ఉప్పు, గోరు వెచ్చని నీరు తీసుకొని పుకిలించాలి. దీంతో నోటిలో బ్యాక్టీరియాకు కారణమయ్యే పాచిని దూరం చేస్తుంది. చిగుళ్ల వాపు, రక్తస్రావవం వంటివి దూరమవుతాయి.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇది కూడా చదవండి: కలలో నగ్నంగా ఉన్న స్త్రీ కనిపిస్తే.. జీవితంలో జరగబోయేది ఇదే.