పురుషుల్లో వీర్యకణాలు పెరగాలంటే.. ఇవి చేయాల్సిందే

By ramya neerukonda  |  First Published Oct 30, 2018, 3:42 PM IST

సంతానం కలగకపోవడానికి ప్రధాన కారణం పురుషుల వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం. ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం, అలవాట్లు.. తదితర కారణాల వల్ల పురుషుల్లో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.


ప్రస్తుత కాలంలో సంతానలేమి కారణంగా ఆస్పత్రుల చుట్టూ తిరిగే జంటలు పెరిగిపోతున్నాయి. సంతానం కలగకపోవడానికి ప్రధాన కారణం పురుషుల వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం. ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం, అలవాట్లు.. తదితర కారణాల వల్ల పురుషుల్లో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. కాగా.. వీటిని అధిగమించాలంటే కొన్ని రూల్స్ పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. అవేంటో మనమూ ఓసారి చూసేద్దామా...

పొగ అలవాటుకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే పొగాకు వీర్యకణాల సంఖ్య, వాటి కదలికలు తగ్గిపోయేలా చేస్తుంది. పొగాకు వీర్యకణాల డీఎన్‌ఏను సైతం దెబ్బతీస్తున్నట్టు.. ఇది సంతాన సమస్యలకు, భాగస్వామికి గర్భస్రావం కావటానికీ దోహదం చేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మంచి విషయం ఏంటంటే పొగ అలవాటు మానేస్తే దెబ్బతిన్న డీఎన్‌ఏ తిరిగి మామూలు స్థాయికి వస్తుండటం.

Latest Videos

undefined

చక్కెర, కొవ్వు, నిల్వ పదార్థాలతో కూడిన జంక్‌ఫుడ్‌ కన్నా ఆయా కాలాల్లో దొరికే తాజా పండ్లు, కూరగాయలు తినటం మేలు. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు.. ముఖ్యంగా విటమిన్‌ సి, విటమిన్‌ ఇ దండిగా ఉంటాయి. ఇవి సంతానం త్వరగా కలగటానికి తోడ్పడతాయి. 

వీర్యం నాణ్యత వివిధ రకాల హార్మోన్లతో ముడిపడి ఉంటుంది. కొవ్వు కణజాలం ఈ హార్మోన్ల మిశ్రమాన్ని దెబ్బతీయొచ్చు. కాబట్టి కండరాలను బలోపేతం చేసే వ్యాయామాల మీద కూడా కాసింత దృష్టి పెట్టటం మంచిది. 

 మితిమీరి మద్యం తాగినా వీర్యం నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి మద్యం అలవాటు గలవారు పరిమితిని పాటించాలి. శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవటానికి చాలామంది అక్రమంగానో, వైద్యుల పర్యవేక్షణలోనో టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ తీసుకుంటున్నారు. ఇలా చేస్తే ఒంట్లో సహజంగా టెస్టోస్టీరాన్‌ ఉత్పత్తి కావటం తగ్గిపోతుంది. ఫలితంగా వీర్యం ఉత్పత్తి కూడా పడిపోతుంది.

బాత్ టబ్ లో వేడి నీరు నింపుకొని స్నానం చేయటం హాయిగానే ఉంటుంది. కానీ వృషణాలకు మరీ ఎక్కువ వేడి తగిలితే వీర్యం నాణ్యత తగ్గే ప్రమాదముంది. ఇదేమీ శాశ్వతంగా ఉండిపోయే సమస్య కాదు గానీ సంతానం కోసం ప్రయత్నించేటప్పుడు చాలా వేడిగా ఉండే నీటితో స్నానం చేయకపోవటమే మంచిది.

read more news

తండ్రి కావాలనుకుంటున్న అబ్బాయిలు చేయాల్సిన మొదటి పని ఇదే

స్వయంతృప్తి మంచిదేనా..?

click me!