Asianet News TeluguAsianet News Telugu

స్వయంతృప్తి మంచిదేనా..?

అమ్మాయిల్లోనూ స్వయం తృప్తి ఆనందం

masterbation is good for women or not?

జీవిత భాగస్వామితో తృప్తికరమైన లైంగిక జీవితాన్ని తృప్తిగా పొందలేని చాలా మంది స్వయం తృప్తిని అలవాటు చేసుకుంటూ ఉంటారు. అంతెందుకు పెళ్లికాని చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు స్వయం తృప్తి ద్వారా ఆనందిస్తుంటారు.  అయితే.. అమ్మాయిల్లో స్వయంతృప్తి మంచిదేనా..? దాని వల్ల భవిష్యత్తుల్లో ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందా..? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వయంతృప్తి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలూ లేకపోగా, ఎలాంటి సుఖవ్యాధులూ దరి చేరకుండా ఉంటాయి. పైగా స్వయంతృప్తి వల్ల గర్భం దాల్చే వీలూ ఉండదు. స్వయంతృప్తి వల్ల శరీరంలో ఫీల్‌గుడ్‌ ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి తొలగి, కండరాలు సాంత్వన పొందుతాయి. నెలసరి నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయి. కాబట్టి మహిళలు స్వయంతృప్తి పొందడం అన్ని విధాలుగా సురక్షితం. ఇటీవలే జరిపిన ఒక అధ్యయనంలో స్వయంతృప్తి వల్ల ‘రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌’ తగ్గుతుందనీ, గుండెకు తగిన వ్యాయామం కూడా అందుతుందనీ వెల్లడైంది.
 
మహిళలు తమ శరీరాల్ని స్వయంగా శోధించుకుని, తమకు అనుకూలమైన పద్ధతిలో స్వయంతృప్తి పొందడం హర్షణీయమే! భాగస్వామి లేనివాళ్లతోపాటు, పెళ్లైన మహిళలూ స్వయంతృప్తి పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. ఇందుకు కారణం, ఆ చర్య కొన్ని సందర్భాల్లో లైంగిక క్రీడకు మించిన ఆనందాన్ని అందించడమే! స్వయంతృప్తి అనుసరించడం ద్వారా, క్లైమాక్స్‌ చేరుకోవడం కోసం విభిన్నమైన స్పర్శలు, ఒత్తిడులను తమకు తాముగా మహిళలు తెలుసుకోగలుగుతారు.

Follow Us:
Download App:
  • android
  • ios