ప్రేమికుల మధ్య ముద్దు ఎవరికి లాభం..? షాకింగ్ సర్వే

By ramya neerukondaFirst Published Oct 29, 2018, 2:55 PM IST
Highlights

ముద్దు పెట్టుకోవడం ద్వారా ఎం జరుగుతుందో కొన్ని ప్రేమ జంటలను ఓ గదిలో ఉంచి వారినుంచి కాసింత సమాచారం రాబట్టారు. ఘాడంగా ముద్దు పెడితే శరీరం లోపల కొన్ని రసాయనిక మార్పులు జరుగుతాయని ఆ పరిశోధకులు అంటున్నారు.

ఒకరి మీద ఉన్న ప్రేమను మరొకరికి చెప్పడంలో ముద్దు కీలక పాత్ర పోషిస్తుంది.. ఇది మనకు తెలిసిందే.  అంతేకాదు.. ముద్దు పెట్టుకుంటే.. శరీంలోని క్యాలరీలు ఖర్చు అవుతాయి అన్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే.. తాజాగా.. మరికొన్ని విషయాలు బయటపడ్డాయి. ఓ సంస్థ చేపట్టిన సర్వేలో ముద్దు గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి.

చికాగోకు చెందిన కొంతమంది పరిశోధకులు ముద్దు పెట్టుకోవడం ద్వారా ఎం జరుగుతుందో కొన్ని ప్రేమ జంటలను ఓ గదిలో ఉంచి వారినుంచి కాసింత సమాచారం రాబట్టారు. ఘాడంగా ముద్దు పెడితే శరీరం లోపల కొన్ని రసాయనిక మార్పులు జరుగుతాయని ఆ పరిశోధకులు అంటున్నారు. 

ముందుగా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన కొన్ని ప్రేమ జంటలను, అందులో ముఖ్యంగా టీనేజీ (కాలేజ్ చదివే) యువతీయువకులను పట్టుకొని వారికొక బంపర్ అఫర్ ఇచ్చారు. వారందరిని ఒక గదిలో ఉంచి, మంచి సంగీతం వినిపిస్తూ వారి భాగస్వామ్యులను ముద్దు పెట్టుకోమని చెప్పారు. అంతే ఇంకేముంది దొరికిందే ఛాన్స్ అని ఓ పదిహేను నిమిషాలపాటు ఘాటైన ముద్దుల ప్రపంచంలో మునిగిపోయారు. ఈ సమయంలో శాస్తవేత్తలు తమకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకున్నారు… ప్రియుడు, ప్రియురాలు ముద్దు పెట్టుకుంటున్న సమయంలో వారి శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ (ప్రేమబంధాలు గట్టిపడేందుకు కారణమయ్యే ముఖ్య రసాయనం) తో పటు కార్టిసాల్ (ఆందోళనకు కారణమయ్యే రసాయనం)ల మోతాదును లెక్క కట్టారు.

ముద్దు పెట్టుకోవడానికి ముందు, పెట్టుకుంటున్న సమయంలో, పెట్టుకున్న తరువాత ఆ మోతాదును లెక్కగట్టి ఆ మోతాదులను పోల్చి చూడగా ముద్దు తరువాత యువతీయువకుల ఇద్దరిలో కార్టిసాల్ (ఆందోళనకు కారణమయ్యే రసాయనం) విడుదల బాగా తగ్గిపోయిందనీ అదే సమయంలో యువతుల్లో ఆక్సిటోసిన్ విడుదల కూడా తగ్గిపోయిందని గుర్తించారు. కానీ యువకుల్లో ఆక్సిటోసిన్ విడుదల పెరగడాన్ని గమనించారు. దీని ఫలితంగా ఆ జంటల్లో మానసిక ఒత్తిడి దూరమైందని తెలుసుకున్నారు

click me!