రొయ్యపొట్టుతో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే వాటిని తినకుండా అస్సలు ఉండలేరు తెలుసా..?

By Mahesh RajamoniFirst Published Jan 17, 2022, 12:52 PM IST
Highlights


చిన్న చిన్న రొయ్యలు, రొయ్య పొట్టుతో రకరకాల వంటలు చేయొచ్చు. ఈ వంటల రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నోటికి రుచిని అందించడంతో పాటుగా ఈ రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ఎలా అంటే..
 

రొయ్యల గోంగూర, రొయ్యల ఇగురు, రొయ్యల సూప్.. అంటూ రొయ్యలతో చేసే ప్రతి వంటకం కూడా ఎంతో టేస్టేగా ఉంటుంది. రొయ్యల కూర వండితే చాలు ఇంటిల్లి పాది లొట్టలేసుకుంటూ.. వద్దనకుండా లాగించేస్తుంటారు. అందుకే ఈ రొయ్యలు మర్కెట్ లో చాలా ఎక్కువ ధరకు లభిస్తాయి. పచ్చి రొయ్యలు, ఎండు రొయ్యపొట్టుతో ఎంతో రుచికరమైన వంటలను తయారుచేసేయొచ్చు. రొయ్యలతో ఎంతో రుచికరమైన కూరలను తయారుచేయడమే కాదు.. వీటని తింటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి మీకు ఎరుకేనా.. దీన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలిస్తే వీటిని అస్సలు వదలరు. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. రొయ్యలను తింటే బరువు పెరుగుతామన్న భయం అస్సలు ఉండదు. అందులోనూ వీటిని తినడం వల్ల బరువు కోల్పోతారు. చిన్న చిన్న రొయ్యలు లేదా, ఎండబెట్టిన రొయ్య పొట్టులో ప్రోటీన్లు, విటమిన్లు, జింక్, అయోడిన్ లు పుష్కలంగా లభిస్తాయి. అందులోనూ వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకున్నవారికి రొయ్యలు చక్కటి ఎంపిక. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రొయ్యల్లో జింక్ అధికంగా ఉండటంతో ఆకలిని నియంత్రించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. 

2. రొయ్యలు తింటే క్యాన్సర్ తో మరణించే ప్రమాదం తక్కువ స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ఈ రొయ్యల్లో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఈ సెలినీయం క్యాన్సర్ తో చనిపోయే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అలాగే ఇది Immunity Power ను కూడా పెంచుతుంది. దీని ద్వారా కణితుల ఎదుగుదలను కూడా నిరోధిస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అందుకే నెలకో, వారానికో ఒకసారైనా రొయ్యలను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

3. హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టడంలో కూడా రొయ్యలు ముందుంటాయి. బలహీనపడిన జుట్టు ను తిరిగి గట్టిగా, పట్టుకుచ్చులా మెరిసి పోయేలా చేయడంలో రొయ్యలు చక్కటి ఔషదంలా పనిచేస్తాయి. ఈ రొయ్యల్లో జింగ్, ఖనిజాలు మెండుగా లభిస్తాయి. ఇందులో జింక్ వల్ల జుట్టు కణాలు ఉత్తత్పి ఎక్కువగా జరుగుతుంది. అలాగే కణాల ఉత్పత్తికి కూడా రొయ్యలు ఎంతో ఉపయోగపడతాయి. రొయ్యల్లో ఉండే రాగి ఖనిజం హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెడుతుంది. ముఖ్యంగా జుట్టు ఒత్తుగా, వెంట్రుకలు మందంగా, పట్టుకుచ్చులా మెరిసేలా చేస్తాయి.  
 
4. రొయ్యల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. దీనివల్ల గుండె ఆరోగ్యంగా, ఎలాంటి జబ్బులకు గురికాకుండా ఉంటుంది. కాగా మతిమరుపు సమస్యకు చెక్ పెట్టడంలో రొయ్యలు బెస్ట్ మెడిసిన్. మతిమరుపు సమస్యతో బాధపడేవారు రొయ్యలను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన Calcium మంచిగా అందుతుంది. చర్మం నిగనిగలాడేలా.. కాంతివంతంగా చేయడంలో రొయ్యలు బాగా ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ బీ12 ఉండటం వల్ల రక్తనాళాలు కూడా శుభ్రపడతాయని నిపుణులు వెళ్లడిస్తున్నారు.
 

click me!