అసలు సంక్రాంతిని ఎందుకు జరుపుకుంటాం..? ఈ పౌరాణిక కథల గురించి మీకు తెలుసా?

By Mahesh RajamoniFirst Published Jan 15, 2023, 10:59 AM IST
Highlights

మకర సంక్రాంతికి.. గంగానది స్నానం, దానం, ధ్యానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఇక మకర సంక్రాంతితో వివాహం వంటి శుభకార్యాలు మొదలవుతాయి. ఈ రోజు దానం చేస్తే వందరెట్లు మీకు లాభాలు కలుగుతాయని కొందరు నమ్ముతారు. 

సూర్యభగవానుడితో సంబంధం ఉన్న ప్రధాన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. మకర సంక్రాంతికి గంగానదిలో స్నానం చేయడం, ధ్యానం, దాన ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ మకర సంక్రాంతితో వివాహాలు వంటి శుభకార్యాలపై నిషేదం కూడా ఎత్తివేయబడుతుంది. ఈ రోజున విరాళాలు ఇస్తే వంద రెట్లు తిరిగి పొందుతారని నమ్ముతారు. అయితే ఈ మకర సంక్రాంతిని జరుపుకోవడానికి వెనకున్న కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

దేవతల రోజు

సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. దీనిని దేవతల దినం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణుడు అవుతాడు. శాస్త్రాలలో ఉత్తరాయణ సమయాన్ని దేవతల రోజు అని, దక్షిణాయణ సమయాన్ని దేవతల రాత్రి అని అంటారు. మకర సంక్రాంతి ఒకరకంగా దేవతల రోజే అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున గంగానీటితో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం, జపం, తపస్సుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ తేదీని ఉత్తరాయణ కాలం అని పురాణాలు చెబుతున్నాయి. 

భీష్మ పితామహుడు

భీష్మ పితామహుడు మకర సంక్రాంతినాడే తన శరీరాన్ని బలి ఇవ్వడానికి సిద్దమవుతాడు. మహాభారత కాలంలో భీష్మ పితామహుడు తన శరీరాన్ని త్యాగం చేయడానికి మకర సంక్రాంతినే ఎంచుకుంటాడు. భీష్ముడు బాణాలున్న మంచం మీద పడుకుని ఉత్తరాయణ రోజు కోసం ఎదురు చూస్తుంటాడు. కాగా భీష్ముడు తన జీవితాన్ని మకర సంక్రాంతి రోజు త్యాగం చేస్తాడు.  అయితే ఉత్తరాయణంలో శరీరాన్ని త్యాగం చేయడం వల్ల వారి ఆత్మ కొన్ని క్షణాల పాటు దేవలోకానికి వెళ్తాయని లేదా పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందుతారని పురాణాలు వెళ్లడిస్తున్నాయి. 

మకర సంక్రాంతి పండుగ అన్ని పండుగల్లో కెళ్లా అతిముఖ్యమైందని. ఎందుకంటే ఈ రోజు తండ్రి సూర్యుడు తన కుమారుడైన శనిదేవుడి రాశి అయిన మకర రాశిలోకి వెళ్లి నెల మొత్తం ఉంటాడు. 

మకర సంక్రాంతిని ఏ రోజున జరుపుకుంటారు? 

ఈ పండుగను దేశవ్యాప్తంగా రకరకాల పేర్లతో పిలుస్తారు. మాఘీ అని, మాఘే సంక్రాంతి అంటూ వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను మకర సంక్రాంతి అని, గుజరాత్ లో ఉత్తరాయణం అని పిలుస్తుంటారు. దీనిని పంజాబ్ లో  లోహ్రీగా, ఉత్తరాఖండ్ లో ఉత్తరాయణిగా, కేరళలో పొంగల్ గా జరుపుకుంటారు. ఈ పండుగను ప్రతి ఏడాది జనవరి 14న జరుపుకుంటారు. కానీ ఈ సారి మకర సంక్రాంతి పండుగను 15న జరుపుకుంటున్నాం. 

click me!