మీరు తీసుకునే ప్రోటీన్ విషంగా మారుతుందా? సంకేతాలివే...

By AN TeluguFirst Published Oct 20, 2021, 11:57 AM IST
Highlights

నిజానికి ప్రతీ వ్యక్తీ రోజుకి కనీస మొత్తంలో ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రతీ భోజనంలో ఎంత మొత్తంలో ప్రోటీన్ ఉండాలి. ఎంత మోతాదు వరకు తినొచ్చు.. అనేది చాలామందికి తెలియదు. ప్రోటీన్ లోని స్థూల పోషకాలు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి, కానీ వాటిని తెలీకుండా ఎక్కువ మోతాదుల్లో తీసుకుంటే అవి మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
 

బరువు తగ్గే క్రమంలో ఆహారంలో మార్పులు తప్పనిసరి. దీంట్లో భాగంగా మొదటగా ఆహారంలో పెంచేది ప్రోటీన్ శాతాన్ని. ప్రోటీన్ వల్ల కడుపు ఎక్కువ కాలం నిండుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కండరాల నిర్మాణంలో సహాయపడుతుంది. తీవ్రమైన వ్యాయామం తర్వాత కణాల రిపేర్, పునరుద్ధరణను ప్రోత్సహిస్తుంది.

ఇది మాత్రమే కాదు, ప్రోటీన్ వల్ల స్కిన్ టోన్ పెరుగుతుంది. జుట్టు నిగనిగలాడుతుంది. దీనికి ప్రోటీస్ సహాయపడుతుంది. దీంతోపాటు  ఎముకలను బలంగా చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అవి లైఫ్ కి Building block‌గా పనిచేస్తాయి. 

నిజానికి ప్రతీ వ్యక్తీ రోజుకి కనీస మొత్తంలో ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రతీ భోజనంలో ఎంత మొత్తంలో ప్రోటీన్ ఉండాలి. ఎంత మోతాదు వరకు తినొచ్చు.. అనేది చాలామందికి తెలియదు. ప్రోటీన్ లోని స్థూల పోషకాలు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి, కానీ వాటిని తెలీకుండా ఎక్కువ మోతాదుల్లో తీసుకుంటే అవి మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

మీకు ఎంత ప్రోటీన్ కావాలి??
మీ శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు, ఒక గ్రాము ప్రోటీన్ అవసరమని నిపుణులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు, కొవ్వు లేకుండా అంతకంటే ఎక్కువ ప్రోటీన్లు తీసుకోవడం వల్ల Protein poisoningగా పరిణమిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్ ఎలా విషంగా మారుతుందో.. దాన్ని సూచించే కొన్ని లక్షణాల గురించి ఇక్కడ ఉన్నాయి. 

 

డీ హైడ్రేషన్ 
అధిక మొత్తంలో ప్రోటీన్ మూత్రపిండాల ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే అవి మూత్రం ద్వారా బయటకు వెళ్లడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇది కి దారితీస్తుంది, అందుకే ఆరోగ్య నిపుణులు తగినంత నీరు, ఖనిజాల కోసం ఎక్కువ మొత్తంలో కూరగాయలు, పండ్లను తినాలని సూచిస్తున్నారు.

బరువు పెరుగుతారు..
బరువు తగ్గడం కోసం మీ ఆహారంలో ప్రోటీన్ శాతాన్ని పెంచితే.. అది విషంగా మారి మీ బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. దీనివల్ల మీ ప్రయత్నం రివర్స్ అవుతుంది. అధిక మొత్తంలో ప్రోటీన్ మీ పేగుల్లో అంతరాయం కలిగిస్తుంది, దీనివల్ల అనవసరమైన Weight gain పెరగడానికి దారితీస్తుంది.

దుర్వాసన
బరువు తగ్గాలని పూర్తిగా ప్రోటీన్ ఆధారిత ఆహారం మీద ఆధారపడడం వల్ల మరో సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది.  అదే నోటి దుర్వాసన. కార్బోహైడ్రేట్లను తినకుండా ఉండడం వల్ల శరీరంలోని కొవ్వు, కార్బోహైడ్రేట్లు బాగా  బర్న్ అవుతాయి. దీనివల్ల  ​Foul breath వస్తుంది. అందువల్ల, ఆరోగ్యకరమైన పోషణ కోసం ప్రోటీన్‌తో పాటు కార్బోహైడ్రేట్‌లను తగినంత మొత్తంలో తీసుకోవడం మంచిది.

డిప్రెషన్
ఇక బరువు తగ్గాలనుకునే మహిళలు ఎవరైతే ఎక్కువ తక్కువ మోతాదుల్లో ప్రోటీన్లు తీసుకుంటారో.. ఆ క్రమంలో తక్కువ కార్బోహైడ్రేట్లను తీసుకునే మహిళలు ​Depression, ఆందోళన, మానసిక కల్లోలం, ప్రతికూల భావోద్వేగాలు వంటి మానసిక సమస్యలకు ఎక్కువగా గురవుతారు.

ప్రతి తల్లీ.. కూతురికి కచ్చితంగా నేర్పాల్సిన విషయాలు ఇవి..!

 

click me!