Jogging In Winter:వావ్ చలికాలంలో జాగింగ్ చేస్తే ఇన్ని ప్రయోజనాలున్నాయా..

By Mahesh RajamoniFirst Published Jan 16, 2022, 3:13 PM IST
Highlights

Jogging In Winter:జాగింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో సమస్యలను దూరం చేయడంలో జాగింగ్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందుకే పొద్దు పొద్దున్నే లేచి ఎంతో మంది జాగింగ్ చేస్తుంటారు. అదంతా సరే కానీ చలికాలంలో కూడా జాగింగ్ చేసేవాళ్లు చాలా మందే ఉన్నారు. అన్ని కాలాల్లో కంటే వింటర్ లో జాగింగ్ చేయడం వల్ల సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎలా అంటే..

Jogging In Winter: వింటర్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది.. చల్లటి మంచు తుంపరలు, ఎముకలు కొరికే చలి, వెచ్చని చలి మంటలు, వేడి వేడి బజ్జీలు ఇవే కదా. అవును చలికాలం వచ్చిందంటే చాలు పొద్దు పొద్దున్నే లేస్తే గజగజ వణకాల్సిందే ఆ చల్లటి గాలులకు. ఈ సంగతి పక్కన పెడితే చలికాలం జాగింగ్ చేసే వాళ్లు ఉంటారా..? అంటే ఉండారనే చెప్పాలి. కాలాలతో సంబంధం లేకుండా ప్రతి రోజూ జాగించే చేసే వారు నూటిలో 50 మందైనా ఉంటారు. మహిళలు, పురుషులు అంటూ తేడా లేకుండా చాలా మంది ఈ సీజన్ లో కూడా పొద్దు పొద్దున్న జాగింగ్ కు వెళ్లే వాళ్లను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. చలికాలంలో కూడా ఎలా వెళ్తారు అంటే దానికి సమాధానం చెప్పలేము. కానీ చలికాలంలో పొద్దు పొద్దున్న జాగింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని లండన్ లోని సెయింట్ మేరీస్ యూనివర్సిటీ తెలియజేసింది. వారు చేసిన పరిశోధనలో జాగింగ్ పై ఆసక్తికరమైన విషయానలను వెళ్లడించారు. Winter లో జాగింగ్ చేయడం వల్ల మగవారికంటే ఆడవారికే ఎక్కువ ప్రయోజనాలున్నాయని నిపుణులు వెళ్లడించారు. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయోజనాలు: 1. చల్లటి Weather లో జాగింగ్ చేయడం వల్ల  హృదయస్పందన (Heart rate) తక్కువగా ఉంటుందని నిపుణులు వెళ్లడించారు. అయితే ఈ సమయంలో ఎలాంటి వ్యక్తులైనా సునాయాసంగా పెరుగెత్తుతారు. ముఖ్యంగా 6 శాతం  Heart rate కూడా తగ్గుతుంది. అందువల్ల చలిలో పరుగెట్టే వారికి ఎలాంటి అలసట రాదు. వచ్చినా చాలా తక్కువ మొత్తంలో ఆయాసం వస్తుంది. 2. రక్తనాళములు, గుండె సంబంధిత రోగాలతో బాధపడేవారు ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు పరుగెత్తడం చాలా ప్రమాదకర. దానితో పాటుగా వారు అనేక అనారోగ్య సమస్యల బారిన పడతారు. అందుకే అలాంటి వారు చల్లటి వాతావరణం ఉన్నప్పుడు జాగించే చేయడం శ్రేయస్కరం.  3. అందులోనూ చల్లటి Weather లో జాగింగ్ చేయడం వల్ల తక్కువ శక్తి ఖర్చవుతుంది. 

4. వింటర్ లో జాగింగ్ చేయడం వల్ల గుండెకు, శరీర అవయవాలకు Blood supply తక్కువగా  అవుతుంది. సో ఇలాంటి చల్లటి సమయంలో పరుగెత్తడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. వేరే కాలాల్లో 40 నిమిషాలపాటు జాగింగ్ చేయడం వల్ల 1.3 లీటర్ చెమటను చిందిస్తారు. దీని వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు వింటర్ లో జాగింగ్ చేయడం వల్ల శక్తి తక్కువగా అవసరమయ్యి డీ హైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదమే లేదు. అందులోనూ పొద్దు పొద్దున జాగింగ్ చేయడం వల్ల శరీరానికి ఎంతో అవసరమయ్యే విటమిన్ డీ కూడా పుష్కలంగా లభిస్తుంది. చలికాలంలో జాగింగ్ చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి.. చలి అని చూడకుండా పరుగెత్తడం ఉత్తమమని దీనిపై పరిశోధనలు చేసిన ప్రొఫెసర్ జాన్ బ్రేవర్ వెళ్లడించారు. సో చలికాలమని జాగింగ్ చేయని వారు ఇప్పటి నుంచైనా పరుగెత్తడం అలవాటు చేసుకోండి. 
 

click me!