రోజూ రెండు యాలకులు తినండి.. జరిగే మార్పులు మీ ఊహకు కూడా అందవు

By Narender Vaitla  |  First Published Jan 3, 2025, 2:59 PM IST

దాదాపు ప్రతీ ఒక్క వంటకంలో కచ్చితంగా ఉపయోగించే వాటిలో యాలకులు ఒకటి. వంటకు రుచిని అందించే యాలకులతో ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతాయి. ప్రతీ రోజూ రెండు యాలకులను ఆహారంలో భాగం చేసుకుంటే జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ఇందులోని డిటాక్సిఫైయింగ్ లక్షణాలు శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు యాలకను నోట్లో వేసుకుంటే శరీరంలో స్పష్టమైన మార్పులను గమనించవచ్చని చెబుతున్నారు. అవేంటంటే.. 

గుండె ఆరోగ్యానికి 

Latest Videos

యాలకులు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజూ యాలకను తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. అలాగే రక్త నాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హైబీపీతో బాధపడేవారికి యాలకులు దివ్యౌషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. 

నోటి దుర్వాసన 

నోటి దుర్వాస నమస్యతో బాధపడేవారు యాలకులు నమిలితే మంచి ఫలితం ఉంటుంది. యాలకులను నమలడం వల్ల నోటిలో తేమగా ఉంటుంది. అలాగే నోటి నుంచి వచ్చే దుర్వాసనకు చెక్ పెడుతుంది. ముఖ్యంగా యాలకుల్లో యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటిలో బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీంతో నోటి దుర్వాసన దూరం కావడమే కాకుండా దంతాల సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. 

మెరుగైన జీర్ణక్రియకు 

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే రోజూ రెండు యాలకులను తీసుకుంటే సమస్యలన్నీ బలదూర్‌ అవ్వాల్సిందే. ఇటీవల చాలా మందిలో కడుపుబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తున్నాయి. అలాంటి సమస్యలన్నింటికీ ఇవి బాగా ఉపయోగపడతాయి.

యాలకుల్లో ఉండే సహజ ఎన్జైమ్‌లు ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఎంతో తోడ్పడుతుతాయి. దీంతో కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత యాలకులు నోట్లో వేసుకొని చప్పరిస్తే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కడుపుబ్బరం సమస్య నుంచి బయటపడొచ్చు. 

నాజుకైన శరీరం కోసం 

యాలకులు బరువు తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. యాలకుల్లో మెటబాలిజం పెంచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది.

ప్రతీరోజూ క్రమం తప్పకుండా రెండు యాలకులను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కణాలు విరిగిపోతాయి. ఇవి శక్తిగా మారడంలో తోడ్పడుతుంది. దీంతో ఇది సహజంగానే బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు రోజూ యాలకులను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

వ్యాధులు దూరం 

తరచూ వచ్చే వ్యాధులను తరిమికొట్టడంలో కూడా యాలకులు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. యాలకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. ఈ కారణంగా తరచూ వచ్చే జలుబు, దగ్గు వంటి వ్యాధులు దూరమవుతాయి. అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. 

కిడ్నీల ఆరోగ్యం 

కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా యాలకులు బాగా పనిచేస్తాయి. శరీరంలోని హానికరమైన టాక్సిన్లను బయటకు పంపించడంలో యాలకులు మంచి డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తాయి. ఇవి కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు. మూత్ర విసర్జనను ప్రోత్సహించి, కిడ్నీల్లో ఎలాంటి మలినాలు లేకుండా చేయడంలో తోడ్పడుతుంది. 


క్యాన్సర్‌ 

క్యాన్సర్‌ మహమ్మారిని కూడా దరిచేరనివ్వకుండా చేయడంలో యాలకులు కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. యాలకుల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలో క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకోవడంలో సహాయపడతాయి. దీర్ఘకాలంలో శరీరంలో క్యాన్సర్‌ కణాలు పెరగకుండా అడ్డుకోవడంలోనూ యాలకులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. 


గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

click me!