International Women's Day 2023: బరువు తగ్గడానికి ఒక్కొక్కరూ ఒక్కో పద్దతిని ఫాలో అవుతుంటారు. ఒక పద్దతిని ఫాలో అయ్యి అందరూ బరువు తగ్గుతారన్న గ్యారంటీ లేదు. శరీర రకమే ఇందుకు కారణం. ఏదేమైనా కొన్ని రకాల ఆహారాలు బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
International Women's Day 2023: కొందరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే.. మరికొందరు బరువు పెరగడానికి ప్రయత్నిస్తుంటారు. బరువు ఎక్కువున్నా ప్రాబ్లమే.. తక్కువున్నా ప్రాబ్లమే.. ఏదేమైనా ఈ రెండు సమస్యలను తొందరగా పరిష్కరించుకోవాలి. ప్రస్తుత కాలంలో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఓవర్ వెయిట్ వల్ల అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్, మధుమేహం, గుండెపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. పురుషులతో పోలిస్తే ఆడవాళ్లే అధిక బరువు బారిన ఎక్కువగా పడుతుంటారు. కారణం వ్యాయామం చేయకపోవడం, కొన్ని అనారోగ్య సమస్యలు, చెడు ఆహారం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. అధిక బరువును కొన్ని నెలల్లోనే తగ్గించుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే బరువు తగ్గడానికి వాళ్లు ఏమేం చేసారో మీరు అవి చేసినా తగ్గకపోవచ్చు. బరువును తగ్గించే ప్రణాళికలు ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా పనిచేయకపోవడమే ఇందుకు కారణం.
ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ.. నిపుణుల సలహాలు తీసుకుని ఆహార ప్రణాళికతో ఎలాంటి నొప్పి లేకుండా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. కానీ బరువు తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆడవాళ్లు బరువు తగ్గడానికి ఎలాంటి చిట్కాలను ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం..