తెల్ల వెంట్రుకలు రాకుండా ఇలా చేస్తే సరిపోతుందా?

By Shivaleela RajamoniFirst Published Jul 12, 2024, 4:37 PM IST
Highlights

పెద్దలు, పిల్లలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఒకప్పుడు అయితే వయసు మీద పడుతున్న వారికే తెల్ల జుట్టు వచ్చేది. అయితే మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే తెల్ల వెంట్రకలు రాకుండా ఉంటాయి. అవేంటంటే?

ఒకప్పుడు తెల్ల వెంట్రుకలు వస్తే వయసు మీద పడుతుందని అర్థం చేసుకునేవారు. నిజమే.. అప్పట్లో తెల్ల వెంట్రుకలు వృద్ధులకే వచ్చేవి. ఇప్పుడు 20 ఏండ్ల వారికే కాకుండా.. చిన్న చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. నేటి ఉరుకుల పరుగుల జీవితం, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల నల్ల జుట్టు కాస్త తెల్ల జుట్టుగా మారిపోతోంది. మగవారితో పోలిస్తే.. ఆడవాళ్లలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.  తెల్ల జుట్టు రావడానికి వాతావరణం, హెయిర్ కేర్ రొటీన్ సరిగా లేకపోవడం కూడా కారణమే. ఈ తెల్ల వెంట్రుకలు కనిపించకూడదని నల్ల రంగులను వేసి కవర్ చేస్తుంటారు. కానీ ఈ రంగు శాశ్వతం కాదు. వారంలోనే మీ తెల్ల జుట్టు కనిపిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా చేయడం సాధ్యం కాదు. కానీ తెల్ల జుట్టు పెరగకుండా మాత్రం చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గోరువెచ్చని నీళు:  మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే హెయిర్ వాష్ ఖచ్చితంగా చేయాలి. అయితే జుట్టును వాష్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జుట్టును ఎప్పుడూ కూడా మరీ చల్ల నీళ్లతో, ఎక్కువ వేడి నీల్లతో కడగకూడదు. జుట్టును వాష్ చేయడానికి గోరువెచ్చని నీళ్లను ఉపయోగించండి. వాతావరణం ఎలా ఉన్నా.. నీళ్లు చాలా చల్లగా లేదా చాలా వేడిగా ఉండకుడదంటారు నిపుణులు. నిజానికి ఇలా చేసే వారికి తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  

Latest Videos

మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తక్కువ ఘాడత ఉన్న షాంపూను ఉపయోగించాలి. షాంపూతో తల స్నానం చేసిన తర్వాత మర్చిపోకుండా కండీషనర్ ను ఉపయోగించండి. 

ఆడవాళ్లు జుట్టు సంరక్షణ కోసం ఎన్నో రకాల హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. చాలా మంది ఎవ్వరినీ సంప్రదించకుండా వీటిని వాడేస్తుంటారు. కానీ వీటివల్ల ఎన్నో జుట్టు సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే మీరు ఏ రకమైన హెయిర్ ప్రొడక్ట్స్ వాడాలన్నా ముందుగా నిపుణుల సలహా తీసుకోండి. లేదంటే  ఎలాంటి ప్రొడక్ట్స్ ను వాడకండి. 

తెల్ల జుట్టు సమస్యను తగ్గించడానికి సహాయపడే ఎన్నో ఇంటి చిట్కాలు ఉంటాయి. కానీ నిపుణుల సలహా లేకుండా ఎలాంటి హోం రెమెడీస్ ప్రయత్నించకండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ జుట్టు దెబ్బతినే ప్రమాదం ఉంది. 

గుర్తుంచుకోవాల్సిన విషయాలు: 

  • మీ జుట్టు  ఆరోగ్యంగా ఉండాలంటే.. మీరు వారానికి రెండు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. 
  • అలాగే షాంపూను ఎక్కువగా వాడకూడదు.
  • మర్చిపోకుండా షాంపూ తర్వాత కండీషనర్ ను వాడాలి. 
  • తలస్నానం చేసిన తర్వాత వెంట్రుకలు వాటంతట అవే ఆరేలా చూసుకోవాలి. హెయిర్ డ్రయ్యర్ ను ఉపయోగించకూడదు. 
  • హీటింగ్ టూల్స్ ను వాడకూడదు. 
  • జుట్టును టైట్ గా కట్టడం మానుకోండి.
click me!