Benefits of Nose Splinter : అందమైన ముక్కుకు ఆకర్షణీయమైన ముక్కుపుడక మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే ప్రస్తుత కాలంలో ముక్కుపుడకల హవా పెరిగింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు వస్తే చాలు వారి డ్రెస్సింగ్ కు తగ్గట్టు ముక్కుపుడకలు పెట్టేస్తూ స్టైల్ గా ముస్తాబవుతున్నారు.
Benefits of Nose Splinter : ముక్కు పుడక ఖచ్చితంగా అమ్మాయిలు ధరించాలనేది పాత పద్దతి. అనతి కాలం నుంచి ఈ ముక్కు పుడుక పెట్టుకోవాలనే ఆచారం కొనసాగుతూనే వస్తోంది. ఆడపిల్ల అన్నాకా.. పక్కాగా ముక్కు పుడక పెట్టుకోవాల్సిందేనంటూ పెద్దవారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన సాంప్రదాయంలో ముక్కు పుడకకు విశిష్టమైన స్థానం ఉంది. ఒకప్పుడు ముక్కు పుడక ధరించడం అనేది సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంటే.. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ గా మారింది.
ఆకర్షణీయమైన బట్టలు ఎలా అయితే ధరిస్తామో.. ముక్కు పుడకలను కూడా ప్రస్తుతం అదే విధంగా పెట్టుకుంటున్నారు. ఏ డ్రెస్ కు ఎలాంటి ముక్కు పుడక సెట్ అవుతుందో చూసుకుని అటువంటి వాటినే ధరిస్తున్నారు. సాధారణ జనాల నుంచి మొదలు పెడితే.. సెలబ్రిటీల వరకు కూడా ఈ ముక్కుపుడకలు విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ట్రెండుకు తగ్గట్టు మార్కెట్లో కూడా రకరకాల ముక్కు పుడకలు అందుబాటులోకి వచ్చాయి. సిల్వర్, గోల్డ్, ప్లాటినం, పగడపు ముక్కు పుడకలు, రత్నం ముక్కుపుడకలంటూ మార్కెట్లోకి వచ్చి అమ్మాయిలను తెగ ఆకట్టుకుంటున్నాయి.
undefined
ముక్కు పుడుక ఒక ఆభరణమే అయినా దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. కాగా ప్రతి ఆడపిల్ల వీటిని తప్పనిసరిగ్గా ధరిస్తుంది. దీనివల్ల అందం మరింత పెరుగుతుంది. అయితే ఒకప్పుడు చాలా పెద్ద సైజులో ఉండే ముక్కు పుడకలనే ఎక్కువగా ధిరంచే వారు. అయితే కాలంలో పాటుగా ముక్కు పుడకల సైజు కూడా రాను రాను చిన్నగా అయ్యింది. ఇక ప్రస్తుతం చిన్న సైజు ముక్కు పుడకల హవా అంతా తగ్గి పెద్ద పెద్ద నోస్ రింగ్స్ వైపు మళ్లింది. అంటే పాతకాలం నాటి ముక్కు పుడకలే ట్రెండింగ్ లోకి వచ్చాయన్న మాట.
సాంప్రదాయం ప్రకారమే ముక్కు పుడకలను పెట్టుకోవడానికి మహిళలు ముందుకొచ్చారు. అందుకే యువతులకు బహిష్టు సమయం తర్వాత ముక్క పుడకలు పెడుతుంటారు. అయితే ఈ ముక్కు పుడకను ధరించడం వెనకున్న అసలు కారణాలు వేరే ఉన్నాయి. సైన్స్ ప్రకారం ముక్కు పుడక పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం .. రండి..
ముక్కు పుడకను ధరించడం వల్ల నాసికా బిందువుపై ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా ఆడవారు తమ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. అంతేకాదు బ్లాక్ ఎనర్జీ కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ముక్కు పుడక ఆడవారి కోపాన్ని, అస్థిరతను అణచివేస్తుందట. మహిళల కోసమే ప్రత్యేకించి చేయబడ్డ ఈ ఆభరణం వల్ల ఆడవారికి శ్వాస నాళాలకు రక్షణ కల్పిస్తాయి. ఇది పెట్టుకోవడం వల్ల ఆ ప్రాంతమంతా క్లీన్ ఉంటుందట. తద్వారా వాయుమార్గంలో ఎటువంటి సమస్యలు తలెత్తవు. అయితే ఈ ముక్కు పుడక ప్రధాన లక్ష్యం సైనస్, ఇస్నోఫీలి వంటి ముక్కు సంబంధించిన రుగ్మతల నుంచి మనకు రక్షణ కల్పించడమే.
ఈ ముక్కు పుడకను ఎక్కువగా ఎడమ వైపే ఎందుకు కుట్టించుకుంటారో ఎవరికైనా తెలుసా.. ఎందుకంటే జననాంగాలు, గర్భాశయానికి సంబంధించిన నాడీ ముక్కు ఎడమ వైపు భాగంతో సంబంధం కలిగి ఉంటుందని సైన్స్ చెబుతోంది. ఈ కారణంతోనే ఆడవారు ఎక్కువగా ఎడమ వైపు ముక్కు కుట్టించుకుంటారు. అంతేకాదు ఇది మహిళలకు ప్రసవ నొప్పులను కూడా తగ్గిస్తుంది. ముక్కు పుడుక పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయో తెలుసుకున్నారు కదా.. ఇప్పటి వరకు ఎవరైతే ఈ ముక్కుపుడకను ధరించలేదో.. వారు ఇప్పటి నుంచే పెట్టుకోవడం అలవాటు చేసుకోండి మరి.