Secrets: ఇలాంటి విషయాలను ఇతరులకు అస్సలు చెప్పకండి.. లేదంటే ..

By Mahesh Rajamoni  |  First Published Feb 5, 2022, 1:59 PM IST


Secrets: కొంతమంది ఎలాంటి సీక్రేట్స్ ను మెయిన్ టైన్ చేయరు. విషయం ఎలాంటిదైనా.. పక్క వారితో చెప్పిందాకా.. వారికి పాణం కుదురుగా ఉండదు. ఏదో గుట్ట మోస్తున్నట్టుగా ఫీలవుతుంటారు. పక్కవారి విషయాలే కాదు.. తమ పర్సనల్ విషయాలను కూడా బేషుగ్గా చెప్పేస్తూ.. తర్వాత.. అయ్యో ఎంత తప్పు చేశాను .. ఈ విషయాలను చెప్పాల్సింది కాదు కదా అని ఫీలైపోతుంటారు. 


Secrets: విషయం ఎలాంటిదైనా సరే దాన్ని ఇతరులతో షేర్ చేసుకునే అలవాటుందా. అయితే వెంటనే మానుకోండి. దానివల్ల వచ్చే లాభం కన్నా.. నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మీ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను ఖచ్చితంగా రహస్యంగా ఉంచాల్సిందే. మీ ఇంటి చుట్టుపక్కలుండే వారితో, ఆఫీస్ లో, మీ స్నేహితులతో కొన్ని విషయాలను పంచుకోకపోవడమే మంచి పద్దతి. ఇంతకీ ఎలాంటి విషయాలను షేర్ చేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ లక్ష్యాలు: మనుషులన్నాకా.. ప్రతి ఒక్కరికీ కొన్ని ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు ఉండటం సర్వసాధారణం. వాటిని చేరుకోవాలంటే ముందుగా మీరు చేయాల్సిన పని మీ లక్ష్యం వైపుగా అడుగులు వేయడమే. అయితే కొంతమంది నేను ఇది చేద్దామనుకుంటున్నా, ఇది సాధించాలనుకుంటున్నానని ఇతరులతో చెప్తుంటారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఒకవేళ మీరు దాన్ని సాధించలేపోతే.. వారు మిమ్మల్ని ఎగతాళి చేయడమో.. తరచుగా ప్రశ్నించడమో చేస్తూ ఉంటారు. 

Latest Videos

undefined

మీ భాగస్వామి అలవాట్లు: ఇది మహా చెడ్డ అలవాటు. చాలా మంది భార్యా భర్తలు చేసే అతిపెద్ద తప్పు ఇదే. రిలేటీవ్స్ లేదా స్నేహితులతో తమ భార్యా భర్తల గురించి అనేక విషయాలను చెబుతూ ఉంటారు. ముఖ్యంగా వారి లోపాలు, అలవాట్లు, ఫోబియాల గురించి చెప్పడం మనం చూస్తున్నదే. భర్తా భర్తలన్నాక సవాలక్ష ఉంటాయి. అలా అని అన్ని విషయాలను అందరితో చెప్పేయకూడదు. ఇలాంటి విషయాలు భాగస్వాముల మధ్యే రహస్యంగా ఉంచాలి.

సాయం విషయం: మీలో దాగున్న దయగల గుణాన్ని ఎవ్వరితో చెప్పుకోకూడదు. ఎందుకంటే నేను వేరే వారికి ఈ సాయం చేసానని చెప్తే వారు విమర్శించే అవకాశం లేకపోలేదు. అందుకే ఇతరులకు మీ గురించి నెగిటీవ్ గా మాట్లాడుకునే అవకాశం అస్సలు కల్పించకండి.

బలహీనత: ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మీ వీక్ నెస్ ఏంటనేది ఇతరులకు చెబితే.. అది మీకు బలహీనంగా మారే ప్రమాదం ఉంది. అందుకే విషయం చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా.. ఇతరులతో అస్సలు షేర్ చేసుకోకండి. ఇలాంటి విషయాలను భార్యతో లేదా భర్తతో లేదా కుటుంబ సభ్యులతో పంచుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్  ఉండదు. 

బ్యాంకు బ్యాలెన్స్: మీరు పని చేస్తుంటే.. ఎంత సాలరీ వస్తుంది. బ్యాంకు బ్యాలెన్స్ ఎంతుంది, మీ ఆస్తి ఎంతుంది వంటి విషయాలను ఇతరులతో పంచుకోకూడదు. అయినా స్నేహానికి ఇలాంటి విషయాలు అవసరం లేదేమో కదా. ఇప్పటి నుంచి మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి అస్సలు చెప్పుకోకండి.

ఫ్యామిలీ ప్రాబ్లమ్స్:  గొడవలు లేని ఇళ్లంటూ ఉండదు. ప్రతి ఇంట్లో ఏదో ఒక విషయంలో గొడవలు జరగడం సర్వ సాధారణం. వీలైతే వాటిని పరిష్కరించుకోండి. ఒకవేళ ఆ గొడవలు మీపై బాగా ఎఫెక్ట్ చూపిస్తే థెరపిస్టుతో మాట్లాడిచూడండి. లేదా మీ అమితంగా ఇష్టమైన మిత్రుడితో చెప్పండి. అంతేకాని పనిచేసే చోట, మీ స్నేహితులకు, ఇంటి చుట్టుపక్కల వారితో షేర్ చేసుకుంటే చిన్న గొడవ కాస్త పెద్ద ఇష్యూ అవుతుంది. అంతేకాదు ఈ విషయాలను మీ కుటుంబం మధ్య మరిన్ని గొడవలను పెంచే అవకాశం ఉంది. 
 

click me!