
Green Tomato Benefits: టమోటాల వల్ల కలిగే బెనిఫిట్స్ ప్రతిఒక్కరికీ తెలిసిందే. అందులోనూ భారతీయ వంటకాల్లో టమోటా స్థానం ప్రత్యేకమైందే. అందులోనూ చాలా మంది టామోటో లేని కూరలు చేయరు. పక్కాగా టమోటాలను ప్రతి కూరల్లో వాడాల్సిందే అంటారు. ఈ టమోటాలు సలాడ్స్, సూప్స్, స్పెషల్ రైస్ లల్లో ఖచ్చితంగా ఉంటాయి. అయితే టమోటాల్లో ఎక్కువగా ఎర్ర టమోటాలనే ఉపయోగించడం మనం చూస్తున్నదే. ఎందుకంటే పచ్చి టమోటోలు మంచివి కావని ఎక్కువగా ఎర్రటమోటాలనే యూజ్ చేస్తుంటారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. పచ్చి టమోటాలు ఆరోగ్యాని హానికరం అన్న మాటలు పూర్తిగా మన అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎర్రటమోటోలు మనకు ఏవిధంగా మేలు చేస్తాయో.. అలాగే పచ్చి టమోటాలు (Green Toamto) కూడా అంతే మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాల కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లు Green Toamtos లల్లో మెండుగా ఉంటాయి. కాగి ఇవి మన ఇమ్యూనిటీ వపర్ ను పెంచడంలో ఎంతో సహాయం చేస్తాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణకల్పిస్తాయి. అలాగే అనేక అనారోగ్య సమస్య బారిన పడకుండా మనల్ని కాపాడుతాయి. ముఖ్యంగా ఈ పచ్చి పటమోటాలల్లో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. ఇది మన రక్తం గడ్డకుండా అడ్డుగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల మన రక్తం గడ్డకడుతుంది అనే సమస్యే ఉండదు.
పచ్చి టమోటాలల్లో బీటా కెరోటిన్ అధికంగా లభిస్తుంది. ఇది కళ్లకు ఎంతో మంచిది. ముఖ్యంగా వీటిని తినడం వల్ల అనేక రకాల కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు సమస్య ఉన్న వారికి ఈ పచ్చి టమోటోలు బాగా సహాయపడతాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికే కాదు.. చర్మ సంరక్షణకు కూడా ఈ పచ్చి టమోటాలు బాగా ఉపయోగపడతాయి. వీటిలో పోటాషియం ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. అంతే కాదు సోడియం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వృద్దాప్య సమయంలో కలిగే మార్పులు చాలా తక్కువగా వస్తాయి. అంతేకాదు వీటిని తినడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. అలాగే వీటిలో ఉండే విటమిన్ సి వల్ల ముడతల సమస్య తొలగిపోతుంది.