ఇళ్లు ఊడ్చడం నుంచి అంట్లు తోమడం వరకు.. ఇంటి పనులు చేస్తే ఎన్ని లాభాలో!

By Shivaleela Rajamoni  |  First Published Dec 20, 2023, 7:15 AM IST

మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుత కాలంలో చాలా మంది బరువు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఇక పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడిపోతుంటారు. కొంతమందికైతే బరువు తగ్గేందుకు ఏం చేయాలో తోచదు కూడా. కానీ ఒక్క ఇంటి పనులు చేస్తే మీరు సులువుగా బరువు తగ్గిపోతారు తెలుసా? 
 


ఇంటి పనులను చేయడానికి బద్దకంగా ఉంటుంది కొంతమందికి. ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసేవారికి. కానీ ఇంటి పనులు మీకు భారంగా కాకుండా మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి తెలుసా? అవును ఇంటి పనులను మీకు చేసే మేలు అంతా ఇంతా కాదు. మీరు ఉద్యోగం చేసే మహిళ అయితే..ఆఫీసు టైమింగ్స్ వల్ల మీకు వ్యాయామం చేయడానికి తగిన సమయం లేకపోతే మీ ఇంటి పనిని మీరే చేయండి. ఎందుకంటే ఇంటి పని మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది. మీకు తెలుసా? ఇంటి పని కూడా వ్యాయామమే మరి. అంతేకాదు ఇంటి పనుల వల్ల మీ ఇంటిని మీరే స్వయంగా అందంగా మార్చినవారుతారు. ఇది మీ ఇంటితో మీరు కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది కూడా. అసలు ఇంటి పని చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి. 

ఊడ్చడం

Latest Videos

undefined

ఇంటిని ఊడ్చడం, పాత పద్ధతిలో మీ ఇంటిని క్లీన్ చేయడం వల్ల కూడా మీరు కేలరీలను బర్న్ చేయగలుగుతారు. ఇంటిని ఊడ్చడం వల్ల మీ కాళ్లు, చేతులు ఫిట్ గా ఉంటాయి. బరువు తగ్గడానికి ఇది మంచి మార్గం. ఇలా చేయడం వల్ల శరీరం నుంచి చాలా చెమట విడుదలువుతుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పిండిని కలపడం

ఇంట్లో పిండిని కలపడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనివల్ల మీ చేతుల కండరాలు బాగా పనిచేస్తాయి. ఇది మీ చేతుల అలసటను తగ్గిస్తుంది. అందుకే పిండిని కలపడం కూడా ఒక వ్యాయామమే అవుతుంది. 

తోటపని

ఇంట్లో గార్డెనింగ్ చాలా మంచి వ్యాయామం. ఇది మీ కేలరీలను బర్న్ చేస్తుంది. అలాగే మీ ఒత్తిడి కూడా చిటికెలో తగ్గిపోతుంది. తోటలోని అందమైన పూలు, పండ్లు, వాటిపై తిరుగుతున్న సీతాకోక చిలుకలు మనసును ఉత్తేజపరుస్తాయి. సైకలాజికల్ రీసెర్చ్ లో ఈ విషయం వెల్లడైంది.

బట్టలు ఉతకడం

ఈ రోజుల్లో చాలా మంది బట్టలను ఉతకడానికి వాషింగ్ మెషిన్ నే ఎక్కువగా వాడుతున్నారు. కానీ చేతులతో బట్టలు ఉతుక్కోవడం, వాటిని పిండడం, దులిపి ఆరేయడం వంటి పనుల వల్ల మీ కేలరీలు కరుగుతాయి. ఇది పూర్తి శరీర వ్యాయామం. ఇలా గంట సేపు చేస్తే కొన్ని క్యాలరీలు సులభంగా కరిగిపోతాయి.

కారును కడగడం

వీలైతే, ప్రతి ఆదివారం మీ కారు లేదా స్కూటీని మీరే కడగండి. ఇది మీ చేతికి మంచి వ్యాయామంలా పనిచేస్తుంది. ఇది కేలరీలను కూడా బర్న్ చేస్తుంది.

గిన్నెలను కడగడం

ఇంట్లోనే పాత్రలను మీరే కడుక్కోవడం మంచి అలవాటు. ఇదొక మంచి వ్యాయామం కూడా. గిన్నెలను కడిగే ప్రాసెస్ కూడా మీ కేలరీలను బర్న్ చేస్తుంది. బరువు తగ్గడానికి మీరు ఇంటి పనులను కూడా చేయొచ్చు తెలుసా?
 

click me!