Weight Loss Tips: ఈ ఆకుకూరలతో అధిక బరువు చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా?

By Mahesh RajamoniFirst Published Jan 23, 2022, 9:47 AM IST
Highlights

Weight Loss Tips: ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి అధిక బరువు నియంత్రించలేక ఇబ్బందులను ఎదుర్కొనే వారు ప్రస్తుత కాలంలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారు ఇష్టమైన ఆకుకూరలను తింటూ కూడా శరీర బరువును ఈజీగా కోల్పోవచ్చు. అవేంటంటే..


Weight Loss Tips: నేటి ఆధునిక కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య స్థూలకాయం. ఈ సమస్య బారిన పడటానికి ముఖ్య కారణం మన ఆహారపు అలవాట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పోషకాలుండే మంచి ఆహారాన్ని తీసుకునే వారు కరువయ్యారు. అందులో ఆఫీసులకు వెళ్లి పనిచేసే వారైతే తమ ఆహారంపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆకలిగా అనిపిస్తేనే ఏదో ఒకటి తిన్నామా కడుపు నిండిందా అనే చూస్తున్నారు కానీ దాని వల్ల మన ఆరోగ్యం ఏమౌతుంది అని ఆలోచించలేకపోతున్నారు. ఈ ఆహారపు అలవాట్లే అధిక బరువుకు కారణం అవుతోంది. అలాంటి వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఈజీగా తమ బరువును కోల్పోవచ్చు. అలాగే ఆకుకూరలతో కూడా తమ బరువును సులభంగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో బాగా లభించే ఈ ఆకుకూరలు తింటే స్థూలకాయం సమస్యను తగ్గించుకోవచ్చు. మరి ఎలాంటి ఆకుకూరలు తింటే బరువు తగ్గుతారో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

మెంతికూర:  మెంతి ఆకుల్లో బీటా కెరోటిన్, ఆస్కార్బిక్ ఆమ్లం, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ ఆకుకూరను తినడం వల్ల డయాబెటీస్ సమస్య వచ్చే రిస్క్ చాలా తక్కువ. కాగా ఈ కూర కొంచెం చేదుగా అనిపించినా ఎన్నో ఔషదగుణాలను కలిగి ఉంటుంది. అందులోనూ ఈ ఆకు కూరను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కూరను క్యారెట్ లేదా బంగాళదుంపలతో కలిపి గానీ ఇతర కూరగాయలతో కలిపి వండితే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ ఆకుకూరను తినడం వల్ల hypertension కు సంబంధించిన సమస్యలు కూడా రావు.  వీటితో పాటుగా శరీర వాపును, అధిక బరువును కూడా తగ్గించడంలో ముందుంటుంది.

ముల్లంగి ఆకులు: ముల్లంగి ఆకుల్లో తక్కువ కేలరీలు, అధిక మొత్తంలో ఫైబర్ లభిస్తుంది. ఫైబర్ ను ఎక్కువగా తీసుకుంటే జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే ఈ ఆకుకూర స్థూలకాయం సమస్య నుంచి బయటపడేస్తుంది.

ఆవకూర: ఈ చలికాలంలో ఆవకూరను తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఈ ఆకుకూరల్లో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఈ ఆవకూరలో కేలరీలు తక్కువగా లభిస్తాయి. అందువల్ల ఇది బరును తగ్గేందుకు బాగా ఉపయోగపడుతుంది. 

తోటకూర: తోటకూర మన శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని తగ్గించే ఔషద గుణాన్ని కలిగి ఉంటుంది. దీన్ని తినడం వల్ల తక్కువ ఫుడ్ తో కడుపు నిండింది అనే భావన కలగడంతో పాటుగా.. ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా చేస్తుంది. సో ఇది తినడం వల్ల కూడా అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు.  
 

click me!